SA vs ENG: ఇంగ్లండ్‌పై విజయం.. టీ20 ప్రపంచకప్ సెమీస్‌కు దక్షిణాఫ్రికా!
- డికాక్ బాదుడు
- మలుపు తిప్పిన రబాడ
- సెమీస్‌కు దక్షిణాఫ్రికా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Africa Beat England in T20 World Cup 2024 Super-8: టీ20 ప్రపంచకప్ 2024లో దక్షిణాఫ్రికా వరుస విజయాలు సాధిస్తోంది. లీగ్ దశను అజేయంగా ముగించిన ప్రొటీస్.. అదే హవాను సూపర్-8లోనూ కొనసాగిస్తోంది. సూపర్-8 తొలి మ్యాచ్‌లో అమెరికాపై గెలిచిన దక్షిణాఫ్రికా.. రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌పై గెలుపొందింది. సెయింట్ లూసియా వేదికగా శుక్రవారం అర్ధరాత్రి ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 7 పరుగుల తేడాతో నెగ్గింది. సూపర్-8లో రెండు వరుస విజయాలతో ప్రొటీస్ టీమ్ దాదాపుగా సెమీస్‌కు దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులు చేసింది. తొలి ఓవర్లో ఆచితూచి ఆడిన డికాక్ (65; 38 బంతుల్లో 4×4, 4×6) ఆ తర్వాత బాదుడు మొదలెట్టాడు. దాంతో పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. మరో ఎండ్‌లో హెండ్రిక్స్ (19) మాత్రం నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. పవర్‌ప్లే అనంతరం స్పిన్నర్ల రంగప్రవేశంతో స్కోరు వేగం తగ్గింది. కొద్ది వ్యవధిలో హెండ్రిక్స్, డికాక్ సహా ప్రమాదకర క్లాసెన్ (8), మార్‌క్రమ్ (1) వెనుదిరగడంతో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. చివరి ఓవర్లలో మిల్లర్ (43; 28 బంతుల్లో 4×4, 2×6) చెలరేగి ఆడడంతో దక్షిణాఫ్రికా మెరుగైన స్కోరు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ (3/40) ఆకట్టుకున్నాడు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: Apple School Sale 2024: ‘యాపిల్’ స్కూల్ సేల్.. ఐప్యాడ్, మ్యాక్‌బుక్‌లపై భారీ డిస్కౌంట్!
ఛేదనలో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులే చేసి ఓడింది. సాల్ట్ (11) రెండో ఓవర్లోనే వెనుదిరగ్గా.. బెయిర్‌స్టో (16) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. బట్లర్ (17), మొయిన్ అలీ (9) కూడా ఔట్ అవ్వడంతో ఓటమి తప్పదనిపించింది. ఈ సమయంలో హ్యారీ బ్రూక్ (53; 37 బంతుల్లో 7×4), లియామ్ లివింగ్‌స్టన్ (33; 17 బంతుల్లో 3×4, 2×6)లు జట్టును ఆదుకున్నారు. ఇంగ్లీష్ జట్టు విజయానికి చివరి 3 ఓవర్లలో 25 పరుగులే అవసరం అవవ్వడంతో విజయం ఖాయం అనుకున్నారు. రబాడ అద్భుతంగా బౌలింగ్ చేసి లివింగ్‌స్టన్‌ను ఔట్ చేసి 4 రన్స్ మాత్రమే ఇచ్చాడు. 19వ అవర్లో జాన్సెన్ 9 రన్స్ ఇవ్వగా.. చివరి ఓవర్లో నోకియా 6 పరుగులే ఇచ్చాడు.
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!