సన్ రైజర్స్ కెప్టెన్ అయిడిన్ మార్క్రమ్ గోల్డెన్ డకౌట్ తో పాటు రూ. 13.25 కోట్లు పెట్టి కొన్ని హ్యారీ బ్రూక్, రూ. 8.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన మాయాంక్ అగర్వాల్ కూడా వరుసగా రెండో మ్యాచ్ లో కూడా ఫెయిల్ అయ్యారు. దీంతో సోషల్ మీడియాలో ఎస్ ఆర్ హెచ్ బ్యాటింగ్ పై మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 13.25 కోట్లు పెట్టి ఇంగ్లండ్ స్టార్ హ్యారీ బ్రూక్ ను కొనుగోలు చేసింది. అయితే అంతకు ముందు టెస్టులో హిట్టింగ్ చేశాడన్న కారణంతో హ్యారీ బ్రూక్ కు అన్ని కోట్లు తగలేసింది. టెస్టుల్లో హిట్టింగ్ చేశాడంటే టీ20ల్లో ఇంకా ఎలా ఆడుతాడో అన్న పిచ్చి స్ట్రాటజీతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ నవ్వుల పాలయ్యేలా చేసింది.