India vs Pakistan: 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మక మ్యాచ్ భారత్, పాకిస్తాన్ మధ్య నేడు (అక్టోబరు 5) కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో తలపడనున్నాయి. తమ ప్రపంచకప్ ప్రచారాన్ని శ్రీలంకపై గెలుపుతో ప్రారంభించిన భారత్, మహిళల వన్డేల్లో తమ వరుసగా 12వ విజయాన్ని నమోదు చేయాలని చూస్తోంది. మరోవైపు, తమ మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయిన పాకిస్తాన్‌కు ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్. ఈ టోర్నమెంట్ భారత్‌లో జరుగుతున్నప్పటికీ, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా 2028 వరకు తటస్థ వేదికల్లో ఆడాలనే రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం కారణంగా ఈ మ్యాచ్ కొలంబోలో జరగనుంది.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
భారత్, పాకిస్తాన్ మహిళల ప్రపంచకప్ 2025 మ్యాచ్ అక్టోబరు 5 (ఆదివారం) న మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. భారతదేశంలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. డిస్నీ+ హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. టోర్నమెంట్‌లో ఇది 6వ మ్యాచ్. శ్రీలంక మహిళలపై 59 పరుగుల తేడాతో గెలిచి టోర్నమెంట్‌ను భారత మహిళలు అద్భుతంగా ప్రారంభించారు. 269 పరుగుల లక్ష్యాన్ని భారత్ విజయవంతంగా కాపాడుకుంది. ఇందులో అమన్‌జోత్ కౌర్ 56 బంతుల్లో 57 పరుగులు చేసి అద్భుతంగా రాణించింది.
Kalki2898AD : కల్కి సీక్వెల్ కోసం సాయి పల్లవిని అప్రోచ్ చేస్తున్న నాగ్ అశ్విన్?
ఇక పాక్ మ్యాచ్ లో పాకిస్తాన్ మహిళలు మొదట బ్యాటింగ్ చేసి కేవలం 129 పరుగులకే పరిమితమై, బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయారు. ఈ కీలక మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇలా ఉండవచ్చు.
భారత్:
రిచా ఘోష్ (W), ఎస్ మంధాన, జెఐ రోడ్రిగ్స్, హర్మాన్ ప్రీత్ కౌర్ (C), హెచ్ డియోల్, ప్రతిక రావల్, డిబి శర్మ, స్నేహ్ రాణా, అమన్‌జోత్ కౌర్, కె గౌడ్, ఎన్ఆర్-శ్రీ చరణి.
పాకిస్తాన్:
సిద్రా నవాజ్, మునీబా అలీ (W), ఆలియా రియాజ్, సిద్రా అమీన్, నటాలియా పర్వైజ్, డయానా బైగ్, సనా ఫాతిమా (C), ఒమైమా సొహైల్, రమీన్ షమీమ్, నష్రా సంధు, సాదియా ఇక్బాల్.