Ind W vs Eng W: ఇంగ్లాండ్ లోని చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్‌ను 13 పరుగుల తేడాతో ఓడించి వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఇప్పటికే టీ20 సిరీస్ ను కైవసం చేసుకోగా.. వన్డే సిరీస్‌ను కూడా తన కథలో వేసుకుంది. ఈ మ్యాచ్ లో బ్యాట్‌తో హర్మన్‌ప్రీత్ కౌర్ సెంచరీతో అలరించగా, బౌలింగ్‌లో క్రాంతి గౌడ్ ఆరు వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను దెబ్బ తీశారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 318 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ ప్రతీకా రావాల్ (26), స్మృతి మంధాన (45) మొదట్లో మంచి ప్రారంభం ఇచ్చారు. ఆ తర్వాత హర్లీన్ డియోల్ (45) సపోర్ట్ తో, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 84 బంతుల్లో 14 ఫోర్లతో 102 పరుగుల సూపర్ సెంచరీ చేసింది. చివర్లో జెమీమా రోడ్రిగ్స్ 45 బంతుల్లో 50 పరుగులతో ఫినిషింగ్ ఇచ్చింది. అలాగే రిచా ఘోష్ 18 బంతుల్లో 38 పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోర్ సాధించింది.
Gold Rate Today: గోల్డ్ ప్రియులకు భారీ షాక్.. నేడు తులం బంగారం రేటు ఎంతో తెలుసా?

ఇక 319 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ తొలుత రెండు వికెట్లు త్వరగా కోల్పోయింది. అయితే ఎమ్మా లాంబ్ 68 పరుగులు, కెప్టెన్ నాట్ సివర్ బ్రంట్ 98 పరుగులతో మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. చివర్లో ఆలిస్ డేవిడ్సన్ (44) మినహా ఎవరూ నిలబడలేకపోయారు. దీనితో ఇంగ్లాండ్ జట్టు 49.5 ఓవర్లలో 305 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ 9.5 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసి భారత్ విజయానికి మద్దతు అందించింది. ఆమెకు తోడుగా శ్రీ చరణి 2 వికెట్లు, దీప్తి శర్మ 1 వికెట్ తీశారు.
Suriya : సూర్య ‘కరుప్పు’ టీజర్ రిలీజ్.. ఓల్డ్ స్కూల్ కమర్షియల్ ట్రీట్

ఇక ఈ సిరీస్ లో.. మ్యాచ్ సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా హర్మన్‌ప్రీత్ కౌర్ (102 పరుగులు) ఎంపిక కాగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా కూడా హర్మన్‌ప్రీత్ కౌర్ (126 పరుగులు) ఎన్నికైంది. ఈ విజయం ద్వారా భారత్ మూడు వన్డేల సిరీస్‌ను 2–1 తేడాతో గెలుచుకుని ఇంగ్లాండ్ గడ్డపై మరో సిరీస్ విజయాన్ని అందుకుంది. నిజానికి ఇంగ్లాండ్‌ను వారి దేశంలో ఓడించడం ఒక సవాల్. కానీ భారత మహిళల జట్టు ఈ విజయలతో తన సత్తాను నిరూపించుకుంది.