రాజధానిలోని పేదలందరికీ ఉచితంగా అన్నిరకాల రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. జీహెచ్ఎంసీలో మరో 10 మినీ హబ్స్ (రేడియాలజీ)ను బుధవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం హరీశ్ రావ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు హైదరాబాద్ వాసుల కోసం టీ-డయాగ్నోస్టిక్స్ కింద మొత్తం 20 మినీ హబ్‌లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కొనియాడారు. నిరుడు జనవరిలో 8 హబ్స్‌ను ప్రారంభించిన సర్కారు.. బుధవారం మరో పదింటిని ప్రారంభించడంపై ఆనందం వ్యక్తం చేశారు.…
రూ.102 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులు ప్రారంభం చేసుకున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 56 రకాల ఆరోగ్య పరీక్షలు రేడియాలజీ, పతలాజి ల్యాబ్ లకు శంకుస్థాపన చేశారు మంత్రి హరీశ్ రావ్. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు రోగ నిర్దారణ కోసం ఈ ల్యాబ్ లు ఉపయోగ పడుతాయని అన్నారు. 200 పడకల ఆస్పత్రి ఆవరణలోనే మెడికల్ కాలేజీ వస్తుందని హరీశ్ రావ్ అన్నారు. వారం రోజుల్లో డయాలసిస్…
నిన్న అట్టహాసంగా వరంగల్‌లో కాంగ్రెస్ నిర్వహించిన రైతు సంఘర్షణ సభపై టీఆర్ఎస్ మంత్రలు వరుస పంచ్‌లు వేస్తున్నారు. తాజాగా ట్విటర్ మాధ్యమంగా మంత్రి హరీశ్ రావు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ‘‘రాహుల్ గాంధీగారూ, వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రమైన పంజాబ్ రైతాంగమే మిమ్మల్ని ఈడ్చి తన్నింది. పంజాబ్ రైతులు నమ్మని మీ రైతు డిక్లరేషన్ – చైతన్యవంతులైన తెలంగాణ రైతులు నమ్ముతారా? ఇది రాహుల్ సంఘర్షణ సభ – రైతు సంఘర్షణ సభ కాదని తెలంగాణ ప్రజానీకం…
తెలంగాణలో మునుపెన్నడూ లేనివిధంగా అభివృద్ధి జరుగుతున్నా కాంగ్రెస్, బీజేపీ నేతలకు కళ్ళు కనిపిస్తాలేదన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. సంగారెడ్డిలో అభయహస్తం ఫండ్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. నెలకు రెండు వేల పెన్షన్ ఇస్తున్నాం… అభయహస్తం ద్వారా మహిళల గ్రూప్ లకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం. సంగారెడ్డి జిల్లా బ్యాంక్ లింకేజ్ లో నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు రూ.672 కోట్లు ఇచ్చామన్నారు. రాష్టంలో టీఆర్స్ ప్రభుత్వం వచ్చాక…
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలు కొరికిన ఘటనలో బాధితుడు శ్రీనివాస్ మృతిచెందాడు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. నిన్న సాయంత్రం మెరుగైన వైద్యం కోసం శ్రీనివాస్‌ను వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు. అయితే చికిత్సకు సహకరించక పోవడంతో శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతతో మృతిచెందినట్లు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. అసలే ఆర్థిక…
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఐసీయూలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్ వేటు వేసింది. అంతేకాకుండా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావును కూడా బాధ్యుడిగా గుర్తించింది. ఆయనపై బదిలీ వేటు వేసింది. ఎంజీఎం సూపరింటెండెంట్‌గా శ్రీనివాసరావు స్థానంలో చంద్రశేఖర్‌కు పూర్తి బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రోగిని ఎలుకలు కొరికిన ఘటనపై పూర్తి వివరాలు తక్షణమే నివేదిక పంపించాలని…
BJP MLA Etela Rajender Fired on CM KCR. బీజేపీ ఎమ్మెల్య ఈటల రాజేందర్ మరోసారి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ ఉన్న ప్రభుత్వం మాటలకే పరిమితం అయ్యింది కానీ చేతల్లో చేయడం లేదని ఆయన ఆరోపించారు. కేసీఆర్ అనేక సభలలో రాష్ట్రం అణగారిన వర్గాల వైపు ఉంటుందని చెప్పి, 8 ఏళ్లు అయినా వారి జీవితాల్లో మార్పు రాలేదన్నారు. మద్యం సేవించడంలో తెలంగాణ మొదట స్థానంలో నిలబెట్టారని ఎద్దేవా…
శరవేగంగా అభివృద్ధిచెందుతున్న హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. నిత్యం రద్దీగా వుండే కేపీహెచ్‌బీ కాలనీలో మోడల్ రైతుబజార్ ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, హరీశ్‌రావు, మల్లారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్‌లో మొదటగా ఎర్రగడ్డలో మోడల్ రైతుబజార్‌ను ఏర్పాటు చేయగా, కూకట్పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో రెండో రైతుబజార్‌ను ఏర్పాటు చేశారు. వినియోగదారులకు అతి తక్కువ ధరకు ఇక్కడ కూరగాయలు లభిస్తాయి. కూకట్పల్లి (కేపీహెచ్‌బీ కాలనీ) రైతుబజార్…
కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రజల పట్ల వివక్ష చూపుతోందని మండిపడ్డారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పద్మానాయక ఫంక్షన్ హల్ లో కేంద్రం వడ్లు కొనేందుకు టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నియోజకవర్గ స్థాయి పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మంత్రి హరీష్ రావు, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ. అనంతరం పలువురు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. కేంద్రం ఎఫ్…