దవాఖానలో చికిత్స పొందుతున్న బాలింతలు తమ చిన్నారులకు ప్రైవేట్ మందులను వాడటాన్ని గమనించి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సీరియస్ అయ్యారు. నగరంలోని కోఠి ప్రభుత్వ ప్రసూతి దవాఖానను హరీశ్ రావ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానకు వస్తూనే నేరుగా వార్డులన్నీ కలియతిరిగారు. దవాఖానలో అందుతున్న వైద్యసేవలపై రోగులు, వారి సహాయకులతో ఆరాతీశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా వైద్య సేవలను అందిస్తుంటే పేద రోగులకు ప్రైవేట్ మెడికల్ షాపుల నుంచి మందులు తీసుకువచ్చేందుకు ఎందుకు రాస్తున్నారని ప్రశ్నించారు.
ఈ మందులను రాసిన వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని పిలిచి చర్యలు తీసుకోవాల్సిందిగా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ కె రాజ్యలక్ష్మికి సూచించారు. ఇక మీదట ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితిలో సహించేది లేదన్నారు. ప్రభుత్వం రోగులకు అన్ని రకాలుగా వైద్య సేవలను అందించాల నే ధ్యేయంతో రూ. 500 కోట్ల నిధులను విడుదల చేసిందన్నారు. ఇద్దరు బాలింతలకు తమ చిన్నారులకు అవసరమయ్యే మందులను బయటి నుండి తెచ్చుకో వాలని రాసినందుకు ఇద్దరు పీడియాట్రిషన్ డాక్టర్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టాఫ్‌నర్సును డీఎంఈకి అటాచ్ చేయాలని ఆదేశించారు. పరీక్షలు బయటకు రాసిన మరో పీజీ డాక్టర్‌ను తీవ్రంగా మందలించారు.
Breaking : ఏపీలో మరో దారుణం.. బాలికపై కరస్పాండెంట్ అత్యాచారం..