రాస్ట్ర వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. నార్మర్ డెలవరీలను ప్రోత్సహించేందుకు కీలక ప్రకటన చేశారు. నార్మల్ డెలివరీలు చేయిస్తే రూ. 3000 పారితోషకం ప్రకటించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎం, స్టాఫ్ నర్సులు, వైద్య వర్గాలు నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రజారోగ్యం కోసం మార్పు తెద్దాం అని సూచించారు. సిజేరియన్లను ప్రోత్సహించ వద్దని కోరారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరగాలని అన్నారు. నార్మల్ డెలివరీలు ఎక్కువగా పెరగాలని.. ప్రభుత్వం, ప్రైవేటు ఆస్పత్రికి తేడా ఏమిటో తెలియాలని అన్నారు.
ఇటీవల కాలంలో సిజేరియన్లు పెరిగిపోతున్న నేపథ్యంలో హరీష్ రావు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలకు వెళ్తే కేసీఆర్ కిట్ అందిస్తోంది ప్రభుత్వం. దీంతో ఇటీవల కాలంలో ప్రభుత్వ ఆస్పత్రిల్లో డెలివరీల సంఖ్య పెరుగుతోంది. ఇదిలా ఉంటే సిజేరియన్లు అరికట్టడానికి, నార్మల్ డెలివరీలను ప్రోత్సహిస్తోంది ప్రభుత్వం. ఈ మధ్య ముహూర్తాలను చూసుకుని డెలివరీలు చేసుకుంటున్నారు కొంతమంది. ఇలాంటి డెలివరీల్లో పెద్దాపరేషన్లు చేస్తున్నాయి పలు ఆస్పత్రులు. వీటన్నింటికి చెక్ పెట్టేలా నార్మల్ డెలివరీలను ప్రోత్సహించేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.