కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి హరీష్ రావు. సిద్ధిపేటలోని రెడ్డి భవన్ లో గీత కార్మికులకు గుర్తింపు కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు కేంద్రంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ అభివృద్ధిని చూడలేకనే కేంద్రం ఇబ్బందులు పెడుతోందని ఆయన అన్నారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. రూ. 4 వేల కోట్లు జీఎస్టీ కింద రావాలని.. 15 వ ఆర్థిక సంఘం రూ. 6 కోట్లు ఇవ్వాలని .. 14 వ ఆర్థిక సంఘం కింద రూ. 1300 కోట్లు రావాలని ఆయన తెలిపారు. పీఆర్జీఎఫ్ నుంచి రూ. 1900 కోట్లు రావాలి.. ఇవన్నీ కావాలనే ఇవ్వకుండా కేంద్రం ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు.
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కేంద్ర, నరేంద్రమోదీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు, మంత్రులు. ఇటీవల హైదరాబాద్ టూర్ కు వచ్చిన మోదీ, టీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. కుటుంబ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణ మంత్రులు, ప్రధాని మోదీ తెలంగాణకు ఏం ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు సీఎం కేసీఆర్, ప్రధాని మోదీకి స్వాగతం చెప్పకపోవడంపై ఫైర్ అవుతున్నారు. మోదీ అంటే భయపడే కేసీఆర్ బెంగళూర్ వెళ్లారని విమర్శిస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ లో పీఎం మోదీకి 8 ప్రశ్నలు సంధిస్తూ నిలదీశారు.
ఇదిలా ఉంటే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. 2023లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇటీవల వరసగా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాలు తెలంగాణలో పర్యటించారు. దీనిని బట్టి తెలుస్తోంది బీజేపీ తెలంగాణకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అని. ఇదిలా ఉంటే తెలంగాణకు చెందిన కే. లక్ష్మణ్ కు యూపీ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసింది బీజేపీ. దీన్ని బట్టి పార్టీలో పని చేస్తే పదవులు వస్తాయనే సందేశాన్ని పంపించింది. దీంతో రానున్న రోజుల్లో పార్టీలో చేరిన వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తామనే చెప్పకచెబుతోంది.