ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై మంత్రి హరీష్ రావు కీలక కామెంట్లు చేశారు. ఇరు రాష్ట్రాల అభివృద్ధిని పోలుస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం మన అదృష్టమని ఆయన అన్నారు. తాగునీరు, సాగునీరు, మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేసుకున్నామని.. విడిపోయి మన అభివృద్ధి చెందితే , వారు వెనుకపడి పోయారని అన్నారు. ఇతర రాష్ట్రాలకు పోయి చూస్తే మన తెలంగాణ ఎంత అభివృద్ది చెందిందో తెలుస్తుందని ఆయన అన్నారు.
కేంద్రం అన్ని ప్రభుత్వం ఆస్తులను అమ్మితే మనం కాపాడుకుంటున్నామని హరీష్ రావు అన్నారు. వేలాది కార్మికులు ఆర్టీసీలో పని చేస్తున్నారని.. ఎంతో మంది జీవితాలకు తోడుంటుందని, ఆర్టీసీ మనందరిది, దీన్ని కాపాడుతోవాల్సిన అవసరం ఉందని హరీష్ రావు అన్నారు. సిద్దిపేట బస్ స్టాండ్ తెలంగాణ ఉద్యమానికి అడ్డాగా ఉందని అన్నారు. వేలాది మందికి సౌకర్యం కల్పించడానికి బస్ స్టాండ్ పునర్నిర్మాణం చేస్తామని అన్నారు. ఢిల్లీకి ఉద్యమ గళాన్ని వినిపించిన అడ్డా ఈ బస్టాండ్ గడ్డ అని అన్నారు.
అవార్డుల గడ్డ ఈ సిద్ధిపేట గడ్డ అని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ అవార్డులు సాధిస్తున్నామని.. ప్రజల భాగస్వామ్యంతో ఈ అవార్డులు సాధిస్తున్నామని హరీష్ రావు అన్నారు. కార్మికుల కోసం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామని.. విద్యా, వైద్యం, రోడ్లు ఇలా అన్ని రంగాల్లో తెలంగాణను డెవలప్ చేసుకుంటున్నామని అన్నారు. ఒక ఏడాదిలో సిద్ధిపేటకు రైలు వస్తుందని..ఐటీ పార్క్, సాఫ్ట్ వేర్ కంపెనీలు తీసుకొస్తా అని హామీ ఇచ్చారు.