Damodara Raja Narsimha : బీఆర్‌ఎస్ హయాంలో ఒక్క హాస్పిటల్‌లో కూడా ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తీసుకురాలేదు
- హరీష్ రావుపై దామోదర రాజనర్సింహ హాట్ కామెంట్స్
- ఐవీఎఫ్ సెంటర్ల ఏర్పాటుకు జీవో విడుదల చేశారు
- ఒక్క చోట కూడా ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తీసుకురాలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు పై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హాట్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్, పేట్లబుర్జు హాస్పిటల్, వరంగల్‌లోని ఎంజీఎం హాస్పిటల్‌లో ఐవీఎఫ్ సెంటర్ల ఏర్పాటుకు 06/09/2018న జీవో 520 విడుదల చేశారని, కానీ, ఒక్క హాస్పిటల్‌లో కూడా ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తీసుకురాలేదని ఆయన మండిపడ్డారు. పేట్లబుర్జు, ఎంజీఎంలో పైసా పనిచేయలేదు. ఒక్క పరికరం కూడా కొనుగోలు చేయలేదని, 2023లో ఎన్నికలకు ముందు గాంధీకి కొన్ని ఎక్విప్‌మెంట్ తీసుకొచ్చి, ఐవీఎఫ్ సేవలను ప్రారంభిస్తున్నట్టు హడావుడి చేశారని ఆయన వ్యాఖ్యానించారు. కానీ.. ఎంబ్రయాలజిస్ట్‌ను, స్టాఫ్‌ను నియమించలేదు. అవసరమైన అనుమతులు తీసుకోలేదని, ఐవీఎఫ్ చేయడానికి అవసరమైన కెమికల్స్, మెడిసిన్ కొనడానికి నిధులు మంజూరు చేయలేదన్నారు మంత్రి దామోదర రాజనర్సింహ.
Lowest Score In Test cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో సొంత మైదానంలో 10 అత్యల్ప స్కోర్లు..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
అంతేకాకుండా..’ఇవన్నీ మా ప్రభుత్వం వచ్చాక అందుబాటులోకి తీసుకొచ్చాం. ఎంబ్రయాలజిస్ట్‌ను నియమించాం. ట్రైన్‌డ్ స్టాఫ్‌ను అలాట్ చేశాం. నిధులు కేటాయించాం. అవసరమైన అనుమతులు తీసుకొచ్చి, ఐవీఎఫ్ సేవలను ప్రారంభించాం. మేము చిత్తశుద్ధితో ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తే, దాన్ని మీఖాతాలో వేసుకునేందుకు చవకబారు విమర్శలు చేస్తున్నారు. సిగ్గు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మీకు దమ్ముంటే మీ హయాంలో గాంధీలో ఒక్కరికి ఐవీఎఫ్ చేసినట్టు నిరూపించండి. పేట్లబుర్జు, ఎంజీఎంలో ఐవీఎఫ్ సెంటర్లు ఎక్కడున్నాయో చూపించండి. లేదా, ఇకనైనా ఇలాంటి చవకబారు ఆరోపణలు మానుకోండి. ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తీసుకురాకుండా, మాతృత్వం కోసం తపిస్తున్న మహిళలను మోసం చేసినందుకు వారికి బహిరంగ క్షమాపణలు చెప్పండి.’ అని మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు.
Minister Narayana: ఫ్లెక్సీలు, పోస్టర్లను నిషేధిస్తున్నాం.. త్వరలోనే చట్టాన్ని తీసుకువస్తాం..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!