చెంబూర్ రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు
మహారాష్ట్రలోని ముంబైలోని చెంబూర్ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. స్టేషన్ వెలువల భారీగా ప్రజలు గుమిగూడారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పొగ సమీప ప్రాంతాలను కమ్మేసింది.
ఎన్నికల హామీలను నెరవేర్చటంలో ఎందుకు జాప్యం..
రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన రుణమాఫీ అమలులో విఫలం అయ్యారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని నిలదీసే కర్తవ్యాలు మాకు ఉంటాయన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చటం లో ఎందుకు జాప్యమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి సూటి ప్రశ్న అడుగుతున్నామన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ విశ్వాసం కోల్పోయింది.. రేవంత్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. కొత్త పెన్షల మాట దేవుడు ఎరుగు,ఉన్న పెన్షన్ లు పీకేస్తున్నారని, మూసీ ప్రక్షాళన కోసం లక్ష కోట్లు అనేది హాస్య పదమన్నారు.
ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి.. ఆరా తీసిన సీఎం చంద్రబాబు
కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బద్వేలు సమీపంలో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి ఘటన కలకలం రేపింది. ఇంటర్ విద్యార్థినిని రోడ్డు పక్కనే చెట్లలోకి తీసుకెళ్లి ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని స్థానికులు కడప రిమ్స్‌కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే తమ కుమార్తెను ప్రేమ పేరుతో 8వ తరగతి నుంచి విఘ్నేష్ అనే యువకుడు వేధిస్తున్నాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. అతనికి పెళ్లి అయినా కూడా వేధింపులు ఆపలేదని వారు పోలీసులకు తెలిపారు. బాధితురాలి వాంగ్మూలాన్ని జిల్లా జడ్జి నమోదు చేసుకున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. గుడివాడ నియోజకవర్గ గ్రామాలకు రక్షిత నీరు
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో తాగు నీటి సమస్య పరిష్కారం దిశగా అడుగులుపడ్డాయి. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇటీవల కంకిపాడులో జరిగిన ‘పల్లె పండుగ’ ప్రారంభ కార్యక్రమంలో తన నియోజకవర్గంలోని మూడు మండలాల్లోని 43 గ్రామాల్లో తాగునీటి కలుషిత సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తెచ్చారు. సమస్య తీవ్రతను గుర్తించి వేదిక పైనుంచే దానికి శాశ్వత పరిష్కారం చూపుతామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఈ హామీ అమలు మేరకు తర్వాత రోజు నుంచే గుడివాడ నియోజకర్గంలో కలుషిత నీరు బారిన పడిన గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరా శాఖ యంత్రాంగాన్ని నీటి పరీక్షలు చేయాలని ఆదేశించారు. దాదాపు అన్ని గ్రామాల్లోనూ నీటి పరీక్షలు చేసిన అనంతరం రక్షిత తాగునీరు సరఫరాలోని లోపాలను గుర్తించారు. సత్వరమే పనులు మొదలుపెట్టేందుకుగాను నందివాడ మండలంలో 12 పనులు గుర్తించి రూ.91 లక్షలు కేటాయించారు.
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో నా ఇల్లు కూడా పోతుంది
సింగపూర్ లో..దుబాయ్ లో ఏముండే.. ఇసుక తిన్నెలు తప్పా.. ఇంకేం ఉన్నాయని, ఇప్పుడు ఎలా మారిపోయాయని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రోడ్లు వెడల్పులో జూబ్లీహిల్స్.. బంజారాహిల్స్ లో పెద్ద పెద్ద ఇండ్లు కూల్చారని, మూసీలో లక్ష 50 వేల కోట్లు పెట్టినట్టు మాట్లాడుతున్నారని, .కేసీఆర్..కేటీఆర్..హరీష్ లు గొప్ప నీతిమంతుల లెక్క మాట్లాడుతున్నారన్నారు మంత్రి జూపల్లి. వీళ్ళ ఎంత గొప్పవాళ్ళు అంటే.. హరీష్.. ఒకప్పుడు ఎలా ఉన్నాయి.. ఇప్పుడు ఎక్కడికి వెళ్లావో తెలియదా..? అని ఆయన అన్నారు. రాజకీయ బాధ తప్పితే కేటీఆర్‌కి ఇంకో బాధ లేదని, గతంలో హరీష్‌రావు మంత్రి అయ్యిందే కాంగ్రెస్ భిక్షతోని MLA కాకుండా మంత్రి అయ్యావు.. అదేనా నీ జ్ఞానం అని ఆయన అన్నారు. మూసీ పరీవాహక ప్రాంతం వసూలు డబుల్ బెడ్ రూం కి వెళ్లొద్దా అని ఆయన అన్నారు. మూసీ రివర్ ఫ్రెండ్ అభివృద్ధిలో నా ఇల్లు కూడా పోతుందని ఆయన అన్నారు.
అప్పుడే ఈ ప్రభుత్వం మొండి పట్టు వీడి ఉంటే.. ఇప్పుడు అభ్యర్థుల మీద లాఠీలు విరిగేవి కావు
ప్రభుత్వం మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టిన గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జి చేసిన మరుసటి రోజు, శనివారం కూడా ఆశావహులు తమ నిరసనను కొనసాగించి అశోక్ నగర్‌లో భారీ నిరసన చేపట్టారు. క్రాస్ రోడ్డు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఔత్సాహికులతో అనేక కోచింగ్ సెంటర్లు , నివాస ప్రాంగణాలను కలిగి ఉన్న అశోక్ నగర్ ప్రాంతంలో తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో గుమిగూడిన ఔత్సాహికులతో వాపు ప్రారంభమైంది. సూడెంట్స్ ర్యాలీలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం అందడంతో పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. హాస్టళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వాదోపవాదాలు జరగడం , ఉద్రిక్తతలు పెరగడంతో, నిరసనలో చేరకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్న హాస్టల్ గదుల వద్ద ఉద్యోగ అభ్యర్థులపై పోలీసులు లాఠీ చార్జీలను ఆశ్రయించారు.
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు సోమవారం నుంచి జరుగుతున్నాయని.. ఈ పరీక్షల కోసం ఎన్నో ఏళ్లుగా నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాలయాపనకు ఫుల్‌స్టాప్ పెట్టాలని ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నామన్నారు. గ్రూప్ 1 పరీక్షలు కచ్చితంగా నిర్వహిస్తామన్నారు. కొంతమంది ఉద్యోగాలు పోవడంతో వాళ్లు ఆందోళన చేస్తున్నారని సీఎం వెల్లడించారు. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే జీవో 29 ఇచ్చామన్నారు. 53 పోస్టులకు మెయిన్స్ ఎగ్జామ్స్‌కు 31 వేల మందిని మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేశామన్నారు. ప్రిలిమ్స్ పరీక్ష అయ్యాక విపక్షాలు ఆందోళన చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చాక మధ్యంతరంగా మారిస్తే కోర్టులు ఊరుకుంటాయా.. అలా మారిస్తే కోర్టులు రద్దు చేస్తాయన్నారు. పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
తెలంగాణ కేబినెట్ సమావేశం 26వ తేదీకి వాయిదా
ఈ నెల 23న జరగాల్సిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం 26వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. ఈ నెల 26న సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుందని తెలిపారు. కేబినెట్ సమావేశం వాయిదా పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు, హైడ్రా ఆర్డినెన్స్‌కు చట్టబద్ధత కల్పించడం, రెవెన్యూ చట్టం, మూసీ బాధితుల అంశం, వరద నష్టం, రైతుభరోసా తదితర అంశాలపై చర్చించే అవకాశముంది. ఈ మేరకు వివరాలను సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు సర్కారు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
మూసీ సుందరీకరణపై రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు
కర్వాన్ డివిజన్, కేసరి నగర్ హనుమాన్ టెంపుల్ ప్రాంతంలోని మూసీ పరిధిలో పర్యటించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణపై రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, మూసీ పరివాహక ప్రాంతంలో అనేక మంది పేద ప్రజలు ఒక్కో ఇటుక పేర్చి, కష్టపడి ఇండ్లు కట్టుకున్నారు. అందుకు ఇక్కడి ప్రజలే సాక్ష్యమన్నారు. 30 ఏండ్ల కిందటే ఇక్కడ నిర్మించుకున్న ఇండ్లకు కరెంట్ కనెక్షన్లతో పాటు నీటి సదుపాయం, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇవ్వడం జరిగింది. అంతేకాదు ప్రభుత్వం ట్యాక్సులు కూడా వసూలు చేస్తోందని, గత 30 ఏండ్ల కింద నిర్మించుకున్న పేదల ఇండ్లను కూల్చాలనుకోవడం ఏమాత్రం న్యాయం కాదు. దీనిపై సీఎం రేవంత్ మానవతాదృక్పథంతో వ్యవహరించాలన్నారు కిషన్ రెడ్డి. పేద ప్రజల ఇండ్లు కూల్చడం ఏమాత్రం న్యాయం కాదని, అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమైనా పేద ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం పనిచేయాలన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజలకు ఒక్క ఇల్లు కట్టించలేదని, రెక్కాడితే గాని డొక్కాడనటువంటి వేలాది మంది ప్రజలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
అప్పుడే ఈ ప్రభుత్వం మొండి పట్టు వీడి ఉంటే.. ఇప్పుడు అభ్యర్థుల మీద లాఠీలు విరిగేవి కావు
ప్రభుత్వం మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టిన గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జి చేసిన మరుసటి రోజు, శనివారం కూడా ఆశావహులు తమ నిరసనను కొనసాగించి అశోక్ నగర్‌లో భారీ నిరసన చేపట్టారు. క్రాస్ రోడ్డు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఔత్సాహికులతో అనేక కోచింగ్ సెంటర్లు , నివాస ప్రాంగణాలను కలిగి ఉన్న అశోక్ నగర్ ప్రాంతంలో తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో గుమిగూడిన ఔత్సాహికులతో వాపు ప్రారంభమైంది. సూడెంట్స్ ర్యాలీలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం అందడంతో పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. హాస్టళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వాదోపవాదాలు జరగడం , ఉద్రిక్తతలు పెరగడంతో, నిరసనలో చేరకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్న హాస్టల్ గదుల వద్ద ఉద్యోగ అభ్యర్థులపై పోలీసులు లాఠీ చార్జీలను ఆశ్రయించారు.