మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్. సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ.. సంగారెడ్డిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. సత్యనారాయణ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 2007లో గెలుపొందారు.
Harish Rao : ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం వార్తమన్నూరుకు చెందిన రైతు మామిళ్ళ నర్సయ్య అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విచారకరమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే గడిచిన వారం రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని, రైతుల మరణ మృదంగం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పాలనలో…
కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కేసీఆర్ సోదరి అనారోగ్యంతో మృతి చెందారు. కేసీఆర్ ఐదవ సోదరి, కేటీఆర్ మేనత్త, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు తల్లి చీటీ సకలమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. తన సోదరి భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు మేడ్చల్ దగ్గరలోని ఆమె నివాసానికి కేసీఆర్ వెళ్లనున్నారు.
నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో హల్వా వేడుక.. కేంద్ర బడ్జెట్ 2025-26 తయారీ ప్రక్రియలో చివరి దశకు చేరుకోవడంతో సంప్రదాయబద్దకంగా ఈరోజు (జనవరి 24) ఆర్థిక మంత్రిత్వ శాఖ హల్వా వేడుకను ఏర్పాటు చేయబోతుంది. ఈ వేడుకలు పార్లమెంట్‌లోని నార్త్‌బ్లాక్‌లో సాయంత్రం 5 గంటలకు పూర్తికానున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగే ఈ వేడుకకు బడ్జెట్ తయారీ ప్రక్రియలో భాగమైన అధికారులు మాత్రమే హాజరవుతారు. బడ్జెట్ ప్రవేశ పెట్టే వరకు…
Harish Rao : ప్రభుత్వ ఫెయిల్యూర్‌కు ఇదే నిదర్శనమని, జగిత్యాల జిల్లా, మల్లాపూర్ మండలం, మొగిలిపేట గ్రామసభలో మాజీ సర్పంచ్ నాగరాజు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం బాధాకరమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు లేదని ములుగు జిల్లా, బుట్టాయిగూడెంలో కుమ్మరి నాగయ్య అనే దళిత రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడటం మనస్సు కలిచివేసిందన్నారు. గ్రామ సభల్లో జరుగుతున్న ఇలాంటి వరుస…
Harish Rao: మంచిర్యాల జిల్లాలో వృద్ధాప్య పెన్షన్ డబ్బులను ఇంటి పన్నులో జమ చేశారు అని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. కొడుకు ఇంటి పన్ను కట్టకుంటే, తల్లికి వచ్చే వృద్దాప్య పింఛన్ ఆపడం అన్యాయం, అమానుషం అని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, అధికారుల తీరు కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయని చెప్పారు.
Harish Rao: సిద్దిపేటలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనుల కోసం ప్రజలు ఎన్ని సార్లు దరఖాస్తులు పెట్టాలని ప్రశ్నించారు. దరఖాస్తు పెట్టినప్పుడల్లా 40 రూపాయల వరకు ఖర్చు అవుతుందని, దరఖాస్తుల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే, గతంలో ఇచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయకుండా మూలకు పడేశారని, దరఖాస్తుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అబద్ధాల…
Damodara Raja Narasimha : ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గట్టి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు ఆరోగ్యశ్రీ పథకం గురించి మాట్లాడటం ఇప్పుడేమో, అయితే గత పదేళ్ల పాటు ఈ పథకాన్ని నిర్లక్ష్యంగా నిర్వహించినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. Komatireddy Venkat Reddy : రేపు నల్గొండలో పర్యటించనున్న మంత్రి కోమటిరెడ్డి…
Harish Rao- Uttam: ప్రతిపక్షం నిలదీస్తే గానీ, ఈ ప్రభుత్వం నిరు పేదల గురించి ఆలోచించదా? అని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తులకు కూడా రేషన్ కార్డులు ఇస్తామనే ప్రభుత్వ ప్రకటన బీఆర్ఎస్ విజయం అన్నారు.