Harish Rao : హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద సమస్యల పరిష్కారం కోసం ఆర్ఎంపీ, పీఎంపీల మహా ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు భారీగా ఆర్ఎంపీ, పీఎంపీలు తరలివచ్చారు. అయితే.. వారి ధర్నాకు మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఆర్ఎంపీ, పీఎంపీలపై బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి కేసులు లేవని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భయబ్రాంతులకు గురిచేసి , అక్రమ కేసులు పెడుతున్నారని, మేనిఫెస్టోలో…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట మీరు అనేక హామీలను ఇచ్చారని.. అందులో రూ.2 లక్షల రుణమాఫీ అంతంత మాత్రమే పూర్తి చేశారని పేర్కొన్నారు. రైతు భరోసా పెట్టుబడి సాయానికి కోతలు పెట్టారని ఆరోపించారు. సన్నవడ్లకు మీరు ఇస్తానన్న బోనస్ డబ్బులను బోగస్ అన్నట్లుగానే ఎగవేస్తున్నారని హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. మార్పులు, చేర్పులు కూడా ఆన్ లైన్ లోనే చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవలో అప్లికేషన్ చేసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం తెలపడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. మీ సేవాలో దరఖాస్తుల పేరిట మరోసారి కాంగ్రెస్ దగా చేస్తోందని మండిపడ్డారు. దరఖాస్తుల పేరిట ఇంకెన్ని సార్లు…
గులాబీ బాస్ కేసీఆర్... ఇటీవల తనను కలిసిన పార్టీ నాయకులతో ఉత్తేజపూరితంగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై క్షేత్ర స్థాయిలో ప్రజలు చాలా కోపంగా ఉన్నారని, వాళ్ళు దొరికితే కొట్టేంత కోపం మీద ఉన్నారంటూ తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చేశారు. నేనేదో..... ఫామ్‌హౌస్‌లో కామ్‌గా ఉన్నానని అనుకుంటున్నారేమో... కో....డ్తే...... మామూలుగా ఉండదని అంటూ అక్కడున్నవారిలో జోష్ నింపే ప్రయత్నం చేశారాయన.
Harish Rao: తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ విషయం సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 8000 మంది రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక, వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన విమర్శించారు. 30 ఏళ్లకుపైగా ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించిన ఠాగూర్ నారాయణ సింగ్ గారి పరిస్థితి చూస్తే…
కేంద్ర బడ్జెట్‌పై ఏపీ ఆర్ధికశాఖ అలెర్ట్.. కేంద్ర బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ అలెర్ట్ అయ్యింది.. బడ్జెట్ లో రాష్ట్రానికి వస్తున్న ప్రయోజనాలు.. నిధులకు సంబంధించి మద్యాహ్నం 3 గంటలలోగా నివేదిక ఇవ్వాలని అన్నిశాఖలకు ఆర్ధికశాఖ సూచనలు చేసింది.. అన్ని శాఖల నుంచి సమాచారం వచ్చిన తర్వాత.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నివేదిక ఇవ్వనుంది ఆర్థిక శాఖ.. ఆంధ్రప్రదేశ్ లో నదుల అనుసంధానానికి కేంద్రాన్ని నిధులు కోరింది ఏపీ ఆర్ధిక శాఖ. తుఫాన్లు, రాయలసీమ ప్రాంతంలో…
Harish Rao : కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన మాజీ ఆర్థికమంత్రి హరీష్ రావు.. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారని. కానీ దేశమంటే కొన్ని రాష్ట్రాలు కాదోయ్ దేశమంటే 28 రాష్ట్రాలోయ్ అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు. దేశానికి 5.1 జీడీపీ ఇచ్చి దేశాన్ని తెలంగాణ పోషిస్తుందని, కానీ పోయినసారి ఆంధ్రకు, ఈసారి బీహార్ కి బడ్జెట్ లో పెద్దపీట వేసి…
Harish Rao: బీఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్ లో.. ఇప్పుడు ప్లాట్లు అమ్ముడు పోలేదని బిల్డర్ ఉరేసుకునే పరిస్థితి రావడం శోచనీయం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు.. ఇప్పుడు బిల్డర్లు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు.
Harish Rao: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కొనసాగుతున్న కాంగ్రెస్ మార్కు ప్రజా పాలన అని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఎటాక్ చేశారు. రైతుల అప్పులు ముఖ్యమా, దావోస్ డప్పుల ముఖ్యమా అని ప్రశ్నించారు. రైతు భరోసా చిల్లర పంచాయతీనా ముఖ్యమంత్రి గారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.