కేసీఆర్ సభ పైనా ప్రజల కంటే కాంగ్రెస్ నాయకులకే ఇంట్రెస్ట్ పెరిగింది అని సెటైర్ వేశారు. కేసీఆర్ ఏం మాట్లాడుతారు అని కాంగ్రెస్ నేతలు ఆతృతగా ఎదురు చూస్తున్నారని హరీష్ రావు తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర శాఖ ప్రెసిడెంట్ ఎవరు?..జాతీయ అధ్యక్షుడు ఎవరు? అని ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. కేటీఆర్ దమ్ముంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పదవి తెచ్చుకో అని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి లాగ పీసీసి అధ్యక్షుడు అయిన రెండు సంవత్సరాలలో ముఖ్యమంత్రివి కావాలన్నారు. మీడియాతో మాట్లాడిన అద్దంకి.. బీఆర్ఎస్, కేటీఆర్‌ను తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ ఏర్పడ్డప్పుడు, ఇప్పుడు పీసీసీ అధ్యక్షులు బీసీలే అన్నారు. దమ్ముంటే తమ పార్టీలో బీసీని లేదా ఎస్సీని రాష్ట్ర…
ఓ చిన్నారి మాట్లాడుతూ.. తన తండ్రి చనిపోయిన తల్లి చదివిస్తుందని కంటతడి పెట్టుకుంది. ఇక, ఆ చిన్నారి మాటలకి తల్లడిల్లిన ఆయన ఆ పాపను దగ్గరికి పిలిచి ఓదార్చాడు. సదరు చిన్నారితో పాటు హరీష్ రావు కంటతడి పెట్టుకున్నారు.
Harish Rao : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణాన్ని ఎలా అణిచివేస్తుందో, అది ఎంత భయానకంగా, బాధ్యతారాహిత్యంగా సాగుతోందో ఇప్పుడు దేశానికి, ప్రపంచానికి తేటతెల్లమైందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. కంచ గచ్చిబౌలి భూముల అంశంలో సుప్రీం కోర్టులో జరిగిన వాదనలు, ప్రభుత్వ నైపుణ్యానికి బదులుగా నిరంకుశత్వాన్ని ఉద్ఘాటించాయని ఆయన అన్నారు. సెలవు దినాల్లోనూ ప్రభుత్వ యంత్రాంగం బుల్డోజర్లతో భూవిధ్వంసానికి పాల్పడడంపై సుప్రీంకోర్టు చేసిన గంభీర వ్యాఖ్యలు, కాంగ్రెస్…
చిన్నకోడూరు (మం) గోనేపల్లి, రాముని పట్ల, ఇబ్రహీంనగర్ లో వడగళ్ల వానతో పంట నష్టం జరిగిన పొలాలను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ.. రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి నేను సవాల్ చేస్తున్నాను ఏ ఊర్లో పూర్తి రుణమాఫీ జరిగిందో చెప్పండి.. గన్మెన్లు లేకుండా, పోలీసులు లేకుండా ఏ ఊరికి వెళ్దామో రండి రుణమాఫీ ఎక్కడ జరిగిందో చూద్దాం.. పద్మశ్రీ…
రేపు వారణాసిలో మోడీ పర్యటన.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రధాని మోడీ శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. రూ.3,880 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని మాట్లాడనున్నారు. ఏప్రిల్ 11న ఉదయం 10 గంటలకు ప్రధాని మోడీ వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయానికి రానున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 4,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు…
Harish Rao : కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ మాజీ మంత్రి టీ. హరీష్ రావు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న విధానంపై ప్రశ్నలెత్తుతూ, కేంద్ర కమిటీకి అవసరమైన డాక్యుమెంట్లు అందించామని తెలిపారు. “ఎవరైనా చెట్టు నరకాలంటే అటవీశాఖ అనుమతి తప్పనిసరి. వాల్టా చట్టం ప్రకారం కూడా చెట్లు రక్షించాల్సిందే,” అని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వం స్వయంగా చెట్లు నరికిందని ఆరోపించారు. ఈ విషయంలో TGIIC స్వయంగా పోలీసులను సంప్రదించి రక్షణ…
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎంపీ చామల మాట్లాడుతూ.. “మీరు పడగొట్టిన రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి నిలబెట్టిండు.. తెలంగాణలో మీకుటుంబమే నిలబడింది.. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ పరిస్థితి ఏంటో ఆయనకే తెలియదు.. మామకు వారసుడు అని పగటి కలలు కంటుండు.. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ మీటింగ్ సందర్భంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పెట్టిన పోస్టర్లలో హరీష్ రావు ఫొటో లేదు.. 2009 లోనే హరీష్ రావు కన్న కల…
రాష్ట్రమంతా కేసీఆర్ వైపు చూస్తోంది.. ఏడాది కాంగ్రెస్ పాలనలో పాలేవో.. నీళ్ళేవో ప్రజలకు తెలిసిపోయింది అని మండిపడ్డారు. ఆనాడు LRS ఫ్రీ అని చెప్పి.. ఇప్పుడు ముక్కు పిండి డబ్బులు వసూళ్లు చేస్తున్నారని హరీష్ రావు పేర్కొన్నారు.
Harish Rao : తెలంగాణ రాష్ట్రానికి గత పదేళ్లలో సాధించిన అభివృద్ధిని ఒక్క సంవత్సరంలోనే వెనక్కి నెట్టి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన దెబ్బ కొట్టారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో గణనీయమైన తగ్గుదల నేపథ్యంలో, ట్విటర్ వేదికగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హరీష్ రావు పేర్కొన్న వివరాల ప్రకారం, బీఆర్ఎస్ పాలనలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతి సంవత్సరం సగటున 25.62 శాతం…