Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన అంశం, పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేసు పెండింగులో ఉన్నా, నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీలో మాట్లాడారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా పార్లమెంటరీ వ్యవస్థకు వ్యతిరేకమని, కోర్టులో పెండింగులో ఉన్న విషయాలను చట్టసభల్లో ప్రస్తావించకూడదని స్పష్టంగా “కౌల్ అండ్ శకధర్ పార్లమెంటరీ ప్రొసీజర్ బుక్” పేర్కొంటుందన్నారు. ప్రస్తుతం…
Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి పై తీవ్ర విమర్శలు చేశారు. కోర్టు జ్యూడిషియల్ వ్యవహారాలపై మాట్లాడొద్దని స్పష్టంగా చెప్పినా, సీఎం సభలో కోర్టును ధిక్కరించి మాట్లాడారని ఆయన ఆరోపించారు. హరీష్ రావు మాట్లాడుతూ, గతంలో ఎలాంటి పరిణామాలు జరగలేదని, ఇప్పుడు కూడా ఏమీ కాదని సీఎం సభలో వ్యాఖ్యానించారని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కూడా ఏమీ కాదని చెప్పడం ద్వారా సీఎం తన పరిధిని దాటి సుప్రీంకోర్టు పై మాట్లాడారని…
Harish Rao : బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గజ్వేల్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు, రేవంత్ రెడ్డిని చిల్లర రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న నేతగా పేర్కొన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ, కేసీఆర్‌కు గజ్వేల్ అంటే తల్లీ-పిల్లల బంధంలా ఉందని, ఆయన అభ్యాసంతోనే గజ్వేల్ అభివృద్ధిలో దూసుకెళ్లిందని తెలిపారు. ఒకప్పుడు గజ్వేల్ హింసాత్మక సంఘటనలు, కుట్రలు, పోలీస్ కేసులతో నిండిన…
Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ, తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. “అభయహస్తం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలని అడగడమే ఆశాలు చేసిన నేరమా?” అని ప్రశ్నించారు. వందల సంఖ్యలో పోలీసులను మోహరించి, బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించడం దుర్మార్గమన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ, కేసీఆర్ ఆశా వర్కర్లకు…
Harish Rao: రాష్ట్ర శాసన సభ చరిత్ర లో ఇది చీకటి రోజు అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. క్లారిఫికేషన్ ఇవ్వకుండా సభ వాయిదా వేశారు.. సెక్రటేరియట్ లో కాంట్రాక్టర్లు ధర్నా చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది.. 20 శాతం కమిషన్ ఏ ప్రభుత్వం హయంలో జరగలేదు.. బీఆర్ఎస్ హయంలో ప్రాజెక్టులు కట్టాం.. రైతు బంధు ఇచ్చాం.
Deputy CM Bhatti: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమాధానం ఇస్తూ.. గత ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ప్రయత్నించింది అని ఆరోపించారు. వాళ్ల హయాంలో బడ్జెట్లో 38 శాతం ఖర్చు పెట్టలేదు, ఆ నిధులను ఎవరికి కేటాయించారు అని అడిగారు.
పాక్‌లో ఎన్కౌంటర్.. ఆర్మీ కెప్టెన్ సహా 10 మంది ఉగ్రవాదుల మృతి పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో పాకిస్తాన్ ఆర్మీ కెప్టెన్ హస్నైన్ అక్తర్ సహా 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత సంస్థతో సంబంధం ఉన్న 10 మంది ఉగ్రవాదులు మరణించారని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) తెలిపింది. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో పాకిస్తాన్ ఆర్మీ కెప్టెన్…
Harish Rao : ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. సభ తొలి క్షణాల్లోనే స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలతో సమావేశాలను ఆరంభించారు. ఈ సందర్భంగా బడ్జెట్‌పై చర్చల్లో విపక్ష సభ్యుడు హరీశ్ రావు మాట్లాడుతూ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్లో నీతి పాఠాలు చెప్పడంలో బాగా రాణించారని వ్యంగ్యంగా అన్నారు. గత ఏడాది బడ్జెట్‌తో పోల్చుతూ అధికార పక్షంపై విమర్శలు గుప్పించారు. గతంలో బడ్జెట్ అంచనాలను అతిగా పెంచి చూపించారని, ఈసారి మాత్రం…
Harish Rao : మాజీమంత్రి హరీష్ రావు తెలంగాణ బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు మేలు చేసేలా కాకుండా, పూర్తిగా అబద్దాలతో నిండిన బడ్జెట్‌గా ఆయన అభివర్ణించారు. అసెంబ్లీలో భట్టి విక్రమార్క ప్రసంగాన్ని విమర్శిస్తూ, అది బడ్జెట్ ప్రసంగంలా కాకుండా రాజకీయ ప్రసంగంలా మారిపోయిందని అన్నారు. హరీష్ రావు ప్రకారం, బడ్జెట్లో పేర్కొన్న అనేక విషయాలు నిజాలకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా, వడ్డీ లేని రుణాల…
KTR- Harish Rao: మీడియాతో జరిగిన చిట్ చాట్ లో బీఆర్ఎస్ శ్రేణులు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి డిలిమిటేషన్ పై చిత్తశుద్ధి లేదు అన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎంటో చెప్పలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారం లేదు.. అధికారంలో ఉన్న బీజేపీకి మేము డీ లిమిటేషన్ పై చెప్పాల్సింది గట్టిగా చెప్తాం..