Sama Ram Mohan Reddy : తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ లోపలి కలహాలు ముదిరిపోతున్న నేపథ్యంలో పీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ విషయాన్ని పది రోజుల క్రితమే తాను ఊహించానని ఆయన స్పష్టం చేశారు. ఈ లేఖ వెనుక ఉన్న అసలైన కుట్రలు ఇప్పుడు బయటపడుతున్నాయని ఆరోపించారు. కవితను సస్పెండ్ చేయడానికి ఇప్పటికే స్కెచ్ వేసిన బృందం పని చేస్తోందని, సంతోష్ రావు, కేటీఆర్,…
పదేండ్ల బీఆర్ఎస్ పాలను లేఖ ద్వారా కవిత బయటపెట్టిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆరోపించారు.. బీఆర్ఎస్ మునిగిపోయే నావ.. అందులో నుంచి దూకాలని కవిత చూస్తోందని విమర్శించారు.. పదేండ్లలో కవితకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు గుర్తుకు రాలేదన్నారు.. వరంగల్ సభలో నియంతలా కేసీఆర్ ఒక్కడే మాట్లాడాడు అని కవిత చెప్పిందని.. బీజేపీతో మీకు ఉన్న సంబంధం కవిత బయట పెట్టిందన్నారు.
Addanki Dayakar: తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జరుగుతున్న వివాదాల నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం లో తప్పులు జరిగాయనే కారణంతోనే కమిషన్ కొంత సమయం తీసుకుని నివేదిక రూపొందించిందని ఆయన అన్నారు. రాజకీయ కక్షతో కాదు, కేవలం అవినీతి చెందిన బాధ్యులను వెలికితీసే ఉద్దేశంతోనే విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసే పార్టీ కాంగ్రెస్‌లో వివక్షకు అవకాశం లేదు. వివేక్, వంశీలపై ఎలాంటి వివక్ష లేదని…
Breaking News : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగవంతమైంది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్), మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు , ఈటల రాజేందర్‌లకు జస్టిస్ పి.సి. ఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఈ కమిషన్, 15 రోజుల్లోగా విచారణకు హాజరుకావాలని ముగ్గురు నేతలను ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు…
Harish Rao : అంగన్వాడీ ఉద్యోగుల జీతాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి宀కు ఆయన బహిరంగ లేఖ రాశారు. అంగన్వాడీలుగా గుర్తించి ఏడాది గడుస్తున్నా, వేతనాల పెంపు మాట మరిచిన ప్రభుత్వం తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన జీవోను కాపీ కొట్టి ప్రచారం చేసుకున్నదని, కానీ వాస్తవంగా మూడు నెలలకే పెరిగిన జీతం చెల్లించి మిగతా నెలలంతా…
కాళేశ్వరం కమిషన్‌లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. కాళేశ్వరం కమిషన్ గడువు మరో రెండు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 31తో కాళేశ్వరం కమిషన్ పదవీ కాలం ముగియనుంది. బహిరంగ విచారణను ముగించినట్లు కమిషన్ వర్గాలు ప్రకటించాయి. కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును జూలై 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాజకీయ నాయకుల విచారణ లేకుండానే నివేదిక ఇచ్చేందుకు కమిషన్ సిద్ధమైంది. పీసీ ఘోష్ కమిషన్ పదవీ కాలం పెంపుతో…
హరీష్ రావు పార్టీ పెడతారు అని ప్రచారం జరుగుతుంది.. అందుకే బుజ్జగించడానికి కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లాడని ఆరోపించారు. అయితే, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నలుగురే.. ఇప్పుడు నలుగురే అని పేర్కొన్నారు. హరీష్ ఇంటికి కేటీఆర్ వెళ్లి పార్టీలో ఉండాలని బ్రతిమిలాడుకుంటున్నాడని ఆది శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.
KTR: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, మాజీ మంత్రి, సిద్ధిపేట్ ఎమ్మెల్యే హరీశ్ రావు నివాసానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా దాదాపు రెండు గంటల పాటు హరీష్ రావుతో సమావేశం అయినట్లు తెలుస్తుంది.
తెలంగాణ ఉద్యమ సమయంలోను, ఆ తర్వాత అధికారంలో ఉన్న పదేళ్ళు తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది బీఆర్ఎస్. కానీ... 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలా పడ్డాయి పార్టీ శ్రేణులు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో పాటు... తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. చాలామంది నాయకులు ఒక్కరొక్కరుగా పార్టీని వదిలేసి వెళ్లారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో అలాంటి వలసలు ఉక్కిరిబిక్కిరి చేసినా... ఈ మధ్య కాలంలో ఆ…
ట్రబుల్ షూటర్.... ఈ మాట వినగానే..... కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా ఠక్కున గుర్తుకు వచ్చే పేరు హరీష్‌రావు. ఉద్యమ సమయంలో... కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో చేరింది బీఆర్ఎస్. అప్పుడు ఎమ్మెల్యేగా కూడా లేని హరీష్‌రావుని మంత్రిని చేశారు కేసీఆర్. అలాగే హరీష్ కూడా మామకు నమ్మిన బంటు అనడంలో ఆశ్చర్యం లేదంటారు పొలిటికల్ పండిట్స్.