పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు కళాకారుల కుటుంబంలో జన్మించిన అనిరుధ్ రవిచందర్ బాల్యంలోనే బాణీలు కట్టి భళా అనిపించాడు. అనిరుధ్ సంగీత దర్శకత్వంలో రూపొందిన అనేక చిత్రాలు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. తొలి చిత్రం ‘3’లో “వై దిస్ కొలవరి ఢీ…” అంటూ అనిరుధ్ స్వరపరచిన పాట యూ ట్యూబ్ లో సంచలనం సృష్టించింది. ఆ తరువాత అనేక చిత్రాలలో యువతను విశేషంగా అలరించే స్వరకల్పన చేశాడు అనిరుధ్. అనిరుధ్ రవిచందర్ 1990 అక్టోబర్ 16న జన్మించాడు.…
కన్నెలను కన్నెత్తి చూడని ఋష్యశృంగులనైనా వీపున బాజా మోగించి, తనవైపు చూపు తిప్పేలా చేసే కాకినాడ ఖాజాలాంటి అమ్మాయి పూజా హెగ్డే. ముంబైలో పుట్టిన పూజా హెగ్డే దక్షిణాది మూలాలు ఉన్నదే! ఉత్తర దక్షిణాలను తన అందంతో కలగాపులగం చేస్తోన్న ఈ భామ నేడు టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా రాజ్యమేలుతోంది. టాలీవుడ్ లో టాపు లేపుతూ సాగుతోంది పూజా హెగ్డే. పూజా హెగ్డే 1990 అక్టోబర్ 13న ముంబైలో జన్మించింది. ఆమె కన్నవారు కర్ణాటకలోని ఉడుపికి…
(ఆగస్టు 21న నటి రాధిక పుట్టినరోజు) చిలిపితనం, చలాకీతనం కలబోసిన రూపంతో రాధిక అనేక చిత్రాల్లో తనదైన బాణీ పలికించారు. ఇప్పుడంటే అమ్మ పాత్రల్లో అలరిస్తున్నారు కానీ, ఒకప్పుడు రాధిక అందం, అభినయం జనాన్ని కట్టిపడేశాయి. ఇక డాన్సుల్లోనూ ఆమె స్పీడును చూసి జనం అబ్బో అన్నారు. కొందరు ఆమె సరసన చిందులు వేయడం చేతకాక బొబ్బలు పెట్టారు. ‘న్యాయం కావాలి’ చిత్రంతో తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టిన రాధిక నాయికగా పలు చిత్రాలతో జైత్రయాత్ర చూశారు.…
మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాజిల్ పుట్టిన రోజు ఇవాళ. విశేషం ఏమంటే ఈ యేడాది మల్లూవుడ్ స్టార్ హీరో… ఫహద్ విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’లో ఫహద్ విలన్ గా నటిస్తుంటే… అతని భార్య నజ్రియా నజీమ్ ‘అంటే సుందరానికీ’ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలనూ మైత్రీ మూవీ మేకరస్ సంస్థే నిర్మిస్తోంది. ఆదివారం పుట్టిన రోజు జరుపుకుంటున్న ఫహద్ కు మైత్రీ…
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఈ రోజు తన 40వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. భారత దేశానికి రెండు వరల్డ్ కప్ లు అందించిన కెప్టెన్ గా అలాగే ప్రపంచ క్రికెట్ లో మూడు ఐసీసీ ట్రోపిలు అందుకున్న ఒకే ఒక్క కెప్టెన్ గా చరిత్రలో నిలిచిపోయాడు. భారత క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించాడు ధోని. 7 జులై 1981 రాంచి లో జన్మించ్చిన ధోని 23 డిసెంబర్ 2004లో…
ప్రముఖ నటుడు, నిర్మాత, రాజకీయనేత మురళీ మోహన్ ఈ రోజు 81 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విశేషం ఏమంటే… అక్కినేని నాగార్జున కోడలు, నాగచైతన్య భార్య, ప్రముఖ నటి సమంత స్వయంగా మురళీ మోహన్ ను కలిసి, పుష్పగుచ్ఛం ఇచ్చి బర్త్ డే విషెస్ చెప్పారు. అయితే ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన అంశం దాగుంది. అదేమిటంటే… గచ్చిబౌలిలోని జయభేరి ఆరెంజ్ కౌంటీలో మురళీ మోహన్…
తెలుగు చిత్రసీమలో ఈ రోజున తొడలు చరిచి, మీసాలు మెలేసి, వీరావేశాలు ప్రదర్శించే సన్నివేశాలు కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సీన్స్ కు ఓ క్రేజ్ తీసుకు వచ్చిన ఘనత నిస్సందేహంగా పరుచూరి సోదరులదే! ఇక పురాణగాథలను, సాంఘికాలకు అనువుగా మలచడంలోనూ సిద్ధహస్తులు ఈ సోదరులు. వీరిలో అగ్రజుడు పరుచూరి వెంకటేశ్వరరావు, అనుజుడు గోపాలకృష్ణ. ఇద్దరూ ఇద్దరే! దాదాపు నలభై ఏళ్ళ క్రితం మహానటుడు యన్టీఆర్ ఈ సోదరులకు ‘పరుచూరి బ్రదర్స్’ అని నామకరణం చేసి, తన…
తెలుగునాటనే తన కెరీర్ కు వెలుగుబాటలు వేసుకుంది కాజల్ అగర్వాల్. ‘క్యూ హో గయా నా’ చిత్రంలో తొలిసారి వెండితెరపై తళుక్కుమంది కాజల్. అందులో అందాలతార ఐశ్వర్యారాయ్ చెల్లెలిగా కనిపించిన కాజల్ ను దర్శకుడు తేజ తన ‘లక్ష్మీ కళ్యాణం’తో తెలుగు చిత్రసీమకు పరిచయం చేశాడు. తరువాత కృష్ణవంశీ ‘చందమామ’లా కాజల్ ను తీర్చిదిద్దాడు. ఇక రాజమౌళి తన ‘మగధీర’లో మిత్రవిందగా కాజల్ ను మార్చేశాడు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా కాజల్ తెలుగు చిత్రాలలో మెరుస్తూనే…
నృత్య తారలు సైతం తెలుగు చిత్రసీమలో రాజ్యమేలిన రోజులు ఉన్నాయి. వారిలో సూపర్ స్టార్ ఎవరంటే విజయలలిత అనే చెప్పాలి. వందలాది చిత్రాలలో ఐటమ్ గాళ్ గా చిందులేసి కనువిందు చేసిన విజయలలిత, కొన్ని చిత్రాలలో వ్యాంప్ గానూ, కీలక పాత్రల్లోనూ మురిపించారు. మరికొన్ని సినిమాల్లో నాయికగానూ నటించారు. యాక్షన్ క్వీన్ గానూ ఇంకొన్ని చిత్రాల్లో సందడి చేశారు. ఆ రోజుల్లో అలా సాగిన నృత్యతార మరొకరు కానరారు. కొందరు విజయలలిత బాటలో పయనించాలని చూసిన ఐటమ్…
‘అంగుళం అదనంగా ఉంటే అందరినీ ఆడించేవాడు’ అంటూ చంద్రమోహన్ ను గురించి ఓ వేదికపై అక్కినేని నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అయితేనేమీ ‘మహా గట్టివాడు’ అంటూ కితాబునిచ్చారు.చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. చదివింది అగ్రికల్చర్ బి.ఎస్సీ, చదువుకొనే రోజుల నుంచీ నాటకాలు వేయడంలో దిట్ట. అదే పట్టుతో చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం చేయకుండా చిత్రసీమవైపు పరుగు తీశారు. ఆరంభంలోనే బి.యన్.రెడ్డి వంటి మేటి దర్శకుని దృష్టిలో పడ్డారు. ఆయనే చంద్రమోహన్ అని నామకరణం చేశారు.…