మహా గట్టివాడు… చంద్రమోహన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘అంగుళం అదనంగా ఉంటే అందరినీ ఆడించేవాడు’ అంటూ చంద్రమోహన్ ను గురించి ఓ వేదికపై అక్కినేని నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అయితేనేమీ ‘మహా గట్టివాడు’ అంటూ కితాబునిచ్చారు.
చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. చదివింది అగ్రికల్చర్ బి.ఎస్సీ, చదువుకొనే రోజుల నుంచీ నాటకాలు వేయడంలో దిట్ట. అదే పట్టుతో చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం చేయకుండా చిత్రసీమవైపు పరుగు తీశారు. ఆరంభంలోనే బి.యన్.రెడ్డి వంటి మేటి దర్శకుని దృష్టిలో పడ్డారు. ఆయనే చంద్రమోహన్ అని నామకరణం చేశారు. బి.యన్. తెరకెక్కించిన ‘రంగులరాట్నం’ చిత్రంలో కథానాయకునిగా పరిచయమైన చంద్రమోహన్, తరువాత తన దరికి చేరిన పాత్రలన్నిటికీ న్యాయంచేయడానికి తపించారు. నాటి మేటి నటులు యన్టీఆర్, ఏయన్నార్, కాంతారావు, జగ్గయ్య చిత్రాలలో కీలక పాత్రలు సంపాదించారు చంద్రమోహన్. ఇక తన తరం హీరోలయిన శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు చిత్రాలలోనూ ముఖ్యపాత్రలు ధరిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఒకానొక దశలో మినిమమ్ గ్యారంటీ హీరో అనిపించుకున్నారు. ఆ సమయంలో ఏడాదికి ఇరవై చిత్రాల్లో నటించి భళా అనిపించారు చంద్రమోహన్.
ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్, చంద్రమోహన్ కు అన్న వరుస అవుతారు. ప్రతిభ లేకుంటే ఏ అన్న కూడా ఆదరించలేడు కదా! అలాగే విశ్వనాథ్ తన చిత్రాల్లో చంద్రమోహన్ కు తగ్గ పాత్రలుంటే తప్పక అతణ్ణే పిలిపించేవారు. విశ్వనాథ్ దర్శకత్వంలో చంద్రమోహన్ నటించిన “సీతామాలక్ష్మి, సిరిసిరిమువ్వ, శంకరాభరణం, శుభోదయం” వంటి చిత్రాలు మంచి పేరు సంపాదించి పెట్టాయి. “ఇంటింటి రామాయణం, పదహారేళ్ళ వయసు, తాయారమ్మ-బంగారయ్య, కోరికలే గుర్రాలయితే, సత్యభామ, పక్కింటి అమ్మాయి, గోపాలరావుగారి అమ్మాయి, పెళ్ళిచూపులు, రాధాకళ్యాణం, మూడుముళ్ళు” మొదలైన చిత్రాల్లోనూ చంద్రమోహన్ హీరోగా నటించి మెప్పించారు. ఆయన సరసన నాయికలుగా నటించిన జయప్రద, జయసుధ, శ్రీదేవి, విజయశాంతి వంటి వారంతా టాప్ హీరోయిన్స్ అయ్యారు. అప్పటి నుంచీ కొత్త అమ్మాయిలు చంద్రమోహన్ సరసన నటించడానికి ఉత్సాహం ప్రదర్శించేవారు. ఆయన భార్య జలంధర ప్రముఖ రచయిత్రి. వారికి ఇద్దరు కుమార్తెలు.
Also Read
తన పర్సనాలిటీకి ఎప్పుడూ హీరో వేషాలే రావన్న సత్యం చంద్రమోహన్ కు తెలుసు. అందుకే ఓ వైపు కథానాయకునిగా నటిస్తూనే మరోవైపు ఇతరుల చిత్రాల్లోనూ కీలక పాత్రలు ధరించేవారు. అదే ఆయన కెరీర్ ను ఇంతకాలం లాక్కువచ్చిందని చెప్పవచ్చు. తరువాతి తరం హీరోల చిత్రాలలో అన్నగా, బావగా, మామగా నటించి మెప్పించిన చంద్రమోహన్ ఇప్పటి యంగ్ హీరోస్ సినిమాల్లో తాతగానూ కనిపిస్తున్నారు. 79 సంవత్సరాలు దాటినా, ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేసేందుకు ఎప్పటిలాగే తపిస్తున్న చంద్రమోహన్ మరిన్ని వసంతాలు చూడాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!