జీనత్ అమన్.. ఈ పేరు 1970లలో ఎంతోమంది సరసులకు ఓ మంత్రం! జీనత్ పేరే జపిస్తూ ఆమె అందాలను ఆరాధిస్తూ, తెరపై ఆ శృంగార రసాధిదేవతను చూసి, ఆమెను తమ స్వప్న సామ్రాజ్యాలకు మహారాణిగా పట్టాభిషేకం చేసుకున్నారు. అలాంటి వారు ఈ నాటికీ ఆ నాటి జీనత్ అందాలను తలచుకుంటూ మురిసిపోతున్నారు. జీనత్ కు 70 ఏళ్ళు నిండాయంటే వినడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఆమె చాలా రోజుల క్రితమే ముసలి పాత్రల్లోకి ఎంటరై పోయింది. అయినా, అభిమానులు…
స్టార్ హీరోయిన్ నయనతార నాయికగా నటించిన 50వ చిత్రం ‘మాయ’. 2015లో విడుదలైన ఈ తమిళ సినిమా తెలుగులో ‘మయూరి’ పేరుతో డబ్ అయ్యింది. కన్నడలో రీమేక్ అయ్యింది. మూడు భాషల్లోనూ ప్రేక్షకుల ఆదరణ పొందింది. దాంతో ఆ చిత్ర దర్శకుడు అశ్విన్ శరవణ మరోసారి నయనతారను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ సారి వీరిద్దరి కాంబినేషన్ లో మరో హారర్ మూవీని దర్శక నిర్మాత, నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ నిర్మించబోతుండటం విశేషం. విఘ్నేష్…
(నవంబర్ 18న నయనతార పుట్టినరోజు)నయనతార అందంలో అయస్కాంతముంది. అభినయంలో అంతకు మించిన ఆకర్షణ ఉంది. ఏ తీరుగ చూసినా నయనతార అందాల అభినయం నయనానందం కలిగిస్తుంది. నయనతారను ఈ తరం వారి సీతమ్మ అని చెప్పవచ్చు. అలాగే నిర్మాతల పాలిటి లక్ష్మీ అని భావించవచ్చు. సౌత్ లో నంబర్ వన్ నాయికగా తన తీరే వేరంటూ సాగుతోంది నయన్. తాను నటించిన సినిమాల ప్రచారపర్వంలో పాలు పంచుకోవడానికి నయన్ అంత సుముఖత చూపించరు. ఆమె పెట్టే షరతులను…
సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ రోజా తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు. తెరపై అందాలతారగా జనానికి శ్రీగంధాలు పూసిన రోజా, కొన్ని అరుదైన పాత్రల్లోనూ అభినయంతో అలరించారు. మాతృభాష తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మళయాళంలోనూ తనదైన బాణీ పలికించారు రోజా. రెండు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు రోజా. ఇక బుల్లితెరపై ఆమె నిర్వహిస్తున్న కార్యక్రమాలు సైతం ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతున్నాయని చెప్పవచ్చు. రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి. 1972 నవంబర్ 17న తిరుపతిలో జన్మించారు. పద్మావతి…
ఈ తరం ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని నటుడు రాజీవ్ కనకాల. విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారాయన. తెలుగు చిత్రసీమలో నటనా శిక్షణాలయాలకు ఓ క్రేజ్ తీసుకువచ్చిన దేవదాస్ కనకాల, లక్ష్మీ కనకాల తనయుడే రాజీవ్ కనకాల. ఈయన భార్య సుమ ప్రముఖ యాంకర్ గా నేడు దూసుకుపోతున్నారు. రాజీవ్ వైవిధ్యమైన పాత్రలతో తన రూటులో తాను సాగిపోతున్నారు. స్టార్స్ గా జేజేలు అందుకున్న రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్రప్రసాద్ వంటి ఎందరో నటులకు నటనలో శిక్షణ ఇచ్చారు దేవదాస్…
నవతరం దర్శకుల్లో తనదైన అభిరుచిని చాటుకుంటూ సాగుతున్నారు జాగర్లమూడి రాధాకృష్ణ. అందరూ ‘క్రిష్’ అంటూ అభిమానంగా పిలుచుకుంటారు. ఆయన కూడా టైటిల్స్ లో ‘క్రిష్’ అనే ప్రకటించుకుంటారు. తన ప్రతి చిత్రంలోనూ ఏదో వైవిధ్యం చూపించాలన్న తలంపుతోనే క్రిష్ పయనిస్తున్నారు. తనకంటూ కొంతమంది ప్రేక్షకులను అభిమానులుగా సంపాదించుకోగలిగారు క్రిష్. జాగర్లమూడి రాధాకృష్ణ 1978 నవంబర్ 10న జన్మించారు. గుంటూరు జిల్లా వినుకొండ వారి స్వస్థలం. అమెరికాలో ఫార్మసీ అండ్ కంప్యూటర్ సైన్సెస్ లో పట్టా పొంది, కొంతకాలం…
హిందీ చిత్రాలతోనూ వెలుగు చూసిన తెలుగు దర్శకులు ఎందరో ఉన్నారు. వారిలో తాతినేని రామారావు ప్రత్యేక స్థానం సంపాదించారు. మాతృభాష తెలుగులో విజయాలు సాధించిన తాతినేని రామారావు, దక్షిణాదిన సక్సెస్ చూసిన అనేక చిత్రాలను హిందీలో రీమేక్ చేశారు. అక్కడా జయకేతనం ఎగురవేశారు. తాతినేని రామారావు ఎన్ని సినిమాలు తీసినా, ఆయన పేరు వినగానే ‘యమగోల’ డైరెక్టర్ అనేవారు ఉన్నారు. ఆ సినిమాతో తాతినేని రామారావు పేరు మారుమోగి పోయింది. అందుకే ఇప్పటికీ ‘యమగోల’ తాతినేని రామారావుగానే…
టబు తెలుగు చిత్రాలతోనే వెలుగు చూసిన తార. తెలుగునాట టాప్ హీరోస్ అందరితోనూ నటించి ఆకట్టుకున్న అభినేత్రి టబు. ఉత్తరాదిన సైతం నటిగా తానేమిటో చాటుకున్న అందాలతార. రెండు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలచిన టబు, తెలుగు చిత్రసీమలోనూ తనదైన బాణీ పలికించారు. నవంబర్ 4తో టబు యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయడానికే టబు తపిస్తున్నారు. టబు పూర్తి పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మి. 1971…
‘అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా…’ అని శ్రీదేవిని చూసి అన్నారు కానీ, నిజానికి ఆ పదాలు ఐశ్వర్యారాయ్ కి భలేగా సరితూగుతాయి – ఇదీ అప్పట్లో ఎంతోమంది రసపిపాసుల మాట! విశ్వసుందరి కాలేకపోయింది, ప్రపంచసుందరిగానే ఐశ్వర్యారాయ్ అందం బంధాలు వేసింది. విశ్వసుందరిగా నిలచిన సుస్మితా సేన్ కన్నా మిన్నగా ఐశ్వర్యారాయ్ అందం జనాన్ని ఆకర్షించింది. మోడల్ గా ఉన్న సమయంలోనే ఐశ్వర్య అందాన్ని చూసి, ‘దివి నుండి దిగివచ్చిన తారక…’ అనుకున్నారు జనం. వెండితెరపై…