Rajinikanth Birthday: తెలుగు చిత్రసీమతో మొదటి నుంచీ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అనుబంధం ఉంది. రజనీకాంత్ చిత్రసీమలో అడుగుపెట్టక ముందు బెంగళూరులో సిటీ బస్ కండక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ప్రతి రోజూ సెకండ్ షో చూడడం ఆయనకు అలవాటుగా ఉండేదట. అప్పట్లో రజనీకాంత్ ఎక్కువగా ఎన్టీఆర్ సినిమాలనే సెకండ్ షోస్ లో చూసేవారు. ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రాలంటే రజనీకాంత్‌కు ఎంతో ఇష్టం. ఎన్టీఆర్ ‘శ్రీకృష్ణ పాండవీయం’ చిత్రాన్ని బెంగళూరులో పలు మార్లు చూశానని…
సూర్య భార్య దేవిషా శెట్టి తన భర్త పుట్టినరోజు సందర్భంగా ప్రేమతో నిండిన ఓ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దేవిష పెట్టిన పోస్ట్‌కి సూర్య ఒక్క మాటలో సమాధానమిచ్చి తన భావాలను మొత్తం బయటపెట్టాడు.
IC 814 హైజాక్ సిరీస్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఈ సిరీస్ లో టెర్రరిస్టుల పేర్లపై వివాదం కొనసాగింది. కాగా.. దీనికి సంబంధించిన తాజా వార్త చక్కర్లు కొడుతోంది. చండీగఢ్‌లోని మణిమజ్రాకు చెందిన పూజా కటారియా తన భర్తతో కలిసి ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు.
HBD M. M. Keeravani : నేడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ సంగీత దర్శకుడైన ఎంఎం కీరవాణి తన 63వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవి ఆయనకు స్పెషల్ వీడియోతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. ఈరోజే జన్మించిన మా ఆస్కారుడు ఎంఎం కీరవాణి గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఓ వీడియోను ట్విట్టర్ వేదికగా చిరంజీవి పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా…
ఏదేమైనా, అప్పుడప్పుడు పరిస్థితులు కొన్ని హాస్యభరితంగా మారుతుంటాయి. బెంగళూరులోని ఒక మహిళ అర్థరాత్రి కేక్ ఆర్డర్ సంబంధించి తన అనుభవాన్ని పంచుకుంది. ఒక సూచనతో కేక్ ఎలా ఆర్డర్ చేసిందో ఆమె వివరించింది. అందులో “దయచేసి పుట్టినరోజు శుభాకాంక్షలు స్టిక్ తో పంపండి”. అయితే కంపెనీ వారు కేక్ మీదకు పుట్టినరోజు శుభాకాంక్షలు స్టిక్ పంపడం బదులుగా., బేకరీ వారు కేక్ మీద నేరుగా “హ్యాపీ బర్త్ డే స్టిక్” అనే పదాలను రాసి పంపారు. ఈ…
నేడుపుట్టినరోజు సందర్భంగా హీరోయిన్ రష్మిక మందాన నటిస్తున్న పుష్ప – 2 నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బంధం. చిత్ర నిర్మాతలు దాని అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో నేడు శ్రీవల్లిగా రష్మిక నటిస్తున్న పోస్టర్ ను విడుదల చేశారు. రష్మిక ఈ ఫోటోలో ఆకుపచ్చని చీరని కట్టుకొని, భారీగా బంగారం ఆభరణాలను ధరించి మెస్మరైజ్ చేస్తోంది. ఇకపోతే హీరోయిన్ తలపై సింధూరం ధరించడం కూడా కనబడుతుంది. Also Read: RBI…
Victory Venkatesh: ప్రస్తుతం నవతరం కథానాయకుల్లో ఎంతోమంది నిర్మాతల తనయులు హీరోలుగా సాగుతున్నారు. వారందరికీ రోల్ మోడల్ ఎవరంటే ‘విక్టరీ’ వెంకటేష్ అనే చెప్పాలి. నిర్మాతల వారసుల్లో నటులుగా మారి ఘనవిజయం సాధించిన స్టార్ హీరోగా వెంకటేష్ తనదైన బాణీ పలికించారు. ఆయన సక్సెస్‌ను చూసిన తరువాతే ఎంతోమంది నిర్మాతలు తమ కుమార రత్నాలను హీరోలుగా పరిచయం చేయడానికి పరుగులు తీశారు. అయితే ఇప్పటి దాకా ఎవరూ వెంకటేష్ స్థాయి విజయాలను అందుకోలేదు. ఒకప్పుడు వరుస విజయాలతో…
Surender Reddy Birthday: అక్కినేని అఖిల్ తాజా చిత్రం ‘ఏజెంట్’ ట్రైలర్ చూసిన వారికి అందులోని యాక్షన్ పార్ట్ నచ్చి ఉంటుంది. అది చూడగానే డైరెక్టర్ ఎవరా అని చూస్తే కనిపించే పేరు – సురేందర్ రెడ్డి. అయితే ‘సరే’… సురేందర్ రెడ్డి సినిమా అంటే ఆ మాత్రం యాక్షన్ ఉండి తీరుతుందని సగటు ప్రేక్షకుడు ఇట్టే నిర్ణయించేసుకుంటాడు. తొలి చిత్రం ‘అతనొక్కడే’ మొదలు మొన్నటి ‘సైరా నరసింహారెడ్డి’ దాకా తన ప్రతి సినిమాలో యాక్షన్ లోనూ…
Ravi Shankar Birthday: నటుడు రవిశంకర్ అంటే చప్పున గుర్తుకు రాకపోవచ్చు. కానీ ‘బొమ్మాళీ… నిన్నొదల..’ అంటూ ఆయన గళం చేసిన మాయాజాలాన్ని జనం ఎప్పటికీ మరచిపోలేరు. అన్న సాయికుమార్, తండ్రి పి.జె.శర్మ చూపిన బాటలోనే పయనిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు రవిశంకర్. ఆయన గళవిన్యాసాలతో పలు చిత్రాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అనువాద చిత్రాలలో ప్రతినాయకులకు రవిశంకర్ గళం ప్రాణం పోసిందనే చెప్పాలి. పూడిపెద్ది రవిశంకర్ 1966 నవంబర్ 28న మద్రాసులో జన్మించారు. ఆయన…
Yandamuri Veerendranath: తెలుగునాట ఎంతోమందిని పాఠకులుగా మార్చిన ఘనత కాల్పనిక సాహిత్యానికే దక్కుతుంది. అప్పట్లో యద్దనపూడి సులోచనారాణి, ఆరికెపూడి కౌసల్యాదేవి నవలలు పాఠకులను పరవశింప చేయడమే కాదు, చిత్రసీమలోనూ విజయకేతనం ఎగురవేశాయి. యద్దనపూడి ‘నవలారాణి’గా రాజ్యమేలారు. సరిగ్గా ఆ సమయంలో యండమూరి వీరేంద్రనాథ్ కలం సరికొత్త వచనంతో పాఠకులను ఆకట్టుకుంది. ఆయన రచనలు సమకాలీన పరిస్థితులకు అద్దం పడుతూనే సగటు పాఠకుని ఆకట్టుకొనే ఆకర్షణీయమైన పదజాలంతో పులకింప చేశాయి. దాంతో కమర్షియల్ గా కూడా యండమూరి రచనలు…