రాధిక తీరే వేరు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(ఆగస్టు 21న నటి రాధిక పుట్టినరోజు)
చిలిపితనం, చలాకీతనం కలబోసిన రూపంతో రాధిక అనేక చిత్రాల్లో తనదైన బాణీ పలికించారు. ఇప్పుడంటే అమ్మ పాత్రల్లో అలరిస్తున్నారు కానీ, ఒకప్పుడు రాధిక అందం, అభినయం జనాన్ని కట్టిపడేశాయి. ఇక డాన్సుల్లోనూ ఆమె స్పీడును చూసి జనం అబ్బో అన్నారు. కొందరు ఆమె సరసన చిందులు వేయడం చేతకాక బొబ్బలు పెట్టారు. ‘న్యాయం కావాలి’ చిత్రంతో తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టిన రాధిక నాయికగా పలు చిత్రాలతో జైత్రయాత్ర చూశారు. నటిగా అనేక సినిమాలతో జేజేలు అందుకున్నారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో మురిపిస్తూనే ఉన్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
తమిళనాట రంగస్థలంపైనా, కెమెరాముందు మార్తాండుడిలా చెలరేగిపోయిన ప్రముఖ హాస్యనటుడు, విలన్ ఎమ్.ఆర్.రాధ కూతురు రాధిక. తండ్రి బాటలోనే పయనిస్తూ రాధిక, ఆమె చెల్లెలు నిరోషా కూడా నటనలోనే అడుగు పెట్టారు. నిరోషా కంటే రాధిక చాలా రోజులు ముందే కెమెరా ముందు తన ప్రతిభను చాటుకున్నారు. భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన ‘కిళక్కే పోగుమ్ రైల్’ చిత్రం ద్వారా రాధిక సినిమా రంగంలో అడుగు పెట్టారు. ఈ చిత్రంలో మన తెలుగు నటుడు సుధాకర్ హీరో. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. తరువాత రాధిక, సుధాకర్ జంట పలు చిత్రాలలో నటించి అలరించారు. ఇక తెలుగునాట చిరంజీవితో తెరకెక్కిన ‘న్యాయం కావాలి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు రాధిక. తొలి చిత్రంతోనే రాధిక నటిగా మంచి మార్కులు సంపాదించేశారు. శోభన్ బాబు, చంద్రమోహన్, మురళీమోహన్, చిరంజీవి వంటి హీరోలతో మంచి విజయాలను చూశారు రాధిక.
తన తొలి తెలుగు చిత్రం హీరో చిరంజీవితో రాధిక నటించిన “కిరాయి రౌడీలు, ఇది పెళ్ళంటారా, బిల్లా-రంగా, యమకింకరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మొండిఘటం, ప్రేమపిచ్చోళ్ళు, పల్లెటూరి మొనగాడు, అభిలాష, శివుడు శివుడు శివుడు, పులి-బెబ్బులి, గూఢచారి నంబర్ 1, సింహపురి సింహం, హీరో, జ్వాల, దొంగమొగుడు, ఆరాధన, రాజా విక్రమార్క” చిత్రాలు అభిమానులను అలరించాయి. చిరంజీవి, రాధిక హిట్ పెయిర్ గా వెలిగారు. చిరంజీవితో అత్యధిక చిత్రాలలో హీరోయిన్ గా నటించిన క్రెడిట్ కూడా రాధికకే దక్కింది. ఇవే కాకుండా రాధిక నటించిన “అనుబంధం, త్రిశూలం, రాముడు కాదు కృష్ణుడు, స్వాతిముత్యం, రాధాకళ్యాణం, మూడుముళ్ళు, జీవనపోరాటం, ముగ్గురు మొనగాళ్ళు, బావమరదళ్ళు, స్వాతికిరణం” వంటి సినిమాలు కూడా అలరించాయి.
తమిళ, తెలుగు, మళయాళ, కన్నడ చిత్రాల్లో నటించిన రాధిక బుల్లితెరపైనా తనదైన మార్కు అభినయం ప్రదర్శించారు. నిర్మాతగానూ అనేక చిత్రాలు నిర్మించారు. రాధిక తనను తాను ఎప్పుడూ బిజీగా ఉంచుకొంటూ సాగుతున్నారు. సినిమాల్లో అవకాశాలు వస్తే నటిస్తున్నారు. లేదంటే సీరియల్స్ చేస్తున్నారు. ఏది చేసినా అందులో రాధిక తన మార్కు ప్రదర్శిస్తూ ఉండడం విశేషం.
తాజావార్తలు
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!