‘ఈ తరం పిక్చర్స్’ అధినేత పోకూరి బాబూరావు చిత్రాలను గుర్తు చేసుకుంటే, ఆయన అభిరుచి ఏమిటో ఇట్టే అర్థమై పోతుంది. ఆయన సినిమాల్లో అభ్యుదయ భావాలు దర్శనమిస్తాయి. సామాన్యుల పక్షం నిలచి, తన సినిమాల ద్వారా వారిలో ధైర్యం నింపిన పోకూరి బాబూరావు నైజం ఆకర్షిస్తుంది. కమర్షియల్ ఫార్ములా మిస్ కాకుండానే తన అభిరుచికి తగ్గ చిత్రాలతో పోకూరి బాబూరావు జనాన్ని ఆకట్టుకున్నారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలుకు సమీపంలోని త్రోవగుంట పోకూరి బాబూరావు స్వస్థలం. 1950 డిసెంబర్…
నవతరం దర్శకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకొని సక్సెస్ రూటులో సాగిపోతున్నారు సురేందర్ రెడ్డి. తొలి చిత్రం ‘అతనొక్కడే’ మొదలు మొన్నటి ‘సైరా…నరసింహారెడ్డి’ దాకా తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వైవిధ్యం చూపించే ప్రయత్నం చేశారు సురేందర్ రెడ్డి. కరీంనగర్ జిల్లా మాచంపల్లి సురేందర్ రెడ్డి స్వగ్రామం. 1975 డిసెంబర్ 7న సురేందర్ రెడ్డి జన్మించారు. ఆయన తండ్రి వీరారెడ్డి వారి గ్రామానికి సర్పంచ్ గా ఉండేవారు. సురేందర్ రెడ్డికి చిన్నప్పటి నుంచీ సినిమాలంటే…
నాజూకు షోకులతో కుర్రకారును కిర్రెక్కించి, కితకితలు పెట్టింది పాయల్ రాజ్ పుత్. ఆమె పేరు చెబితే అందరూ చప్పున గుర్తు పట్టకపోవచ్చు. కానీ, ‘ఆర్ ఎక్స్ 100’ హీరోయిన్ అనగానే ఇట్టే ఆమె అందాలను మరింతగా గుర్తు తెచ్చుకుంటారు యువకులు. నటిగా అంతకు ముందు కొన్ని చిత్రాలలో నటించినా, ‘ఆర్ ఎక్స్ 100’ తోనే ఆమెకు మంచి గుర్తింపు లభించింది. తరువాత తెలుగు చిత్రాలలో ఓ వెలుగు చూసింది పాయల్. పాయల్ రాజ్ పుత్ ఢిల్లీలో 1992…
సినిమా రంగాన్ని నమ్ముకుంటే తప్పకుండా ఆ తల్లి ఆదరిస్తుంది అంటూ ఉంటారు. చిత్రసీమలో విజయం సాధించిన వారందరి మాటా ఇదే! ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ సైతం అదే మాటను పలుకుతూ ఉంటారు. చిత్రసీమలో అడుగు పెట్టి, ఒక్కో మెట్టూ ఎక్కుతూ, చివరకు నిర్మాతల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు బెల్లంకొండ సురేశ్. ఆయన తనయుడు సాయి శ్రీనివాస్ నవతరం హీరోల్లో ఒకరిగా సాగుతున్నారు. బెల్లంకొండ సురేశ్ 1965 డిసెంబర్ 5న గుంటూరు జిల్లాలో జన్మించారు.…
ముద్దుగా బొద్దుగా మురిపిస్తూ తెలుగువారిని భలేగా ఆకట్టుకుంటోంది ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా. తెలుగు సినిమాలతోనే ఓ వెలుగు చూసిందీ ముద్దుగుమ్మ. కేవలం నటనతోనే కాకుండా తన గళంతోనూ ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. ఆరంభంలో బరువు దరువుతో అలరించిన రాశీ ఖన్నా, ఇప్పుడు నాజూకు సోకులు సొంతం చేసుకొని మరింతగా ఆకర్షిస్తోంది. దక్షిణాది చిత్రాలతోనే ఈ ఉత్తరాది అందం మెరిసిపోవడం విశేషం! రాశీ ఖన్నా 1990 నవంబర్ 30న ఢిల్లీలో జన్మించింది. అక్కడే లేడీస్ శ్రీరామ్ కాలేజ్…
మంచు వారి అబ్బాయి విష్ణువర్ధన్ బాబు తండ్రి మోహన్ బాబు లాగే కంచు కంఠం వినిపిస్తూ ఉంటారు. సినిమాల్లో దాదాపుగా తండ్రిని అనుకరిస్తూ నటించే మంచు విష్ణు, మొన్న జరిగిన ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎన్నికల్లోనూ తనదైన బాణీ పలికించారు. అందరినీ కలుపుకుపోతూ ‘మూవీ ఆర్టిస్ట్స్ మంతా ఒక ఫ్యామిలీ’ అనే నినాదంతో ‘మా’ అధ్యక్షునిగా ఘనవిజయం సాధించిన మంచు విష్ణు ఆ మధ్య ప్రతి రోజూ వార్తల్లో నిలిచారు. హీరోగా అనేక చిత్రాలలో నటించినా, మంచు…
నవతరం కథానాయకుల్లో అక్కినేని నాగచైతన్య తనదైన తీరులో సాగిపోతున్నారు. అక్కినేని నటవంశం మూడోతరం హీరోగా జనం ముందు నిలచిన నాగచైతన్య అభిమానుల మదిని దోచుకున్నారు. తన ప్రతి చిత్రంలోనూ వైవిధ్యం ప్రదర్శించడానికే ఆయన తపిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీకి అచ్చివచ్చిన రొమాంటిక్ స్టోరీస్ తోనే నాగచైతన్య ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు. తొలి చిత్రం ‘జోష్’ మొదలు మొన్న వచ్చిన ‘లవ్ స్టోరీ’ దాకా నాగచైతన్య కెరీర్ గ్రాఫ్ లో ప్రేమకథలే ప్రధాన పాత్ర పోషించాయి. లవర్ బోయ్ ఇమేజ్…
ఈ తరానికి హెలెన్ అంటే సల్మాన్ ఖాన్ పిన్ని అని, లేదా ఓ సీనియర్ యాక్ట్రెస్ అని మాత్రమే తెలుసు. కానీ, ఆ నాటి ప్రేక్షకులకు హెలెన్ శృంగార రసాధిదేవత! ఐటమ్ గాళ్స్ లో సూపర్ స్టార్ అనిపించుకున్న మేటి డాన్సర్ హెలెన్. ఆ రోజుల్లో హెలెన్ పాట కోసం జనం థియేటర్లకు పరుగులు తీసేవారు. కొన్ని చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు హెలెన్. అయితే వందలాది సినిమాల్లో ఐటమ్స్ తోనే మురిపించారు. హెలెన్ దాదాపు 700…
ప్రస్తుతం డైరెక్టర్ వంశీ అనగానే ఏ కృష్ణవంశీనో, వంశీ పైడిపల్లినో గుర్తు చేసుకుంటారు. కానీ, తెలుగు సినిమా రంగంలో చెరిగిపోని ముద్ర వేసిన వంశీకి వెనుకా ముందూ ఏమీ లేకపోయినా, తన సృజనతో వైవిధ్యం పలికిస్తూ సాగారు. ఈ నాటికీ వంశీ సినిమాను చూడాలని ఉవ్విళ్ళూరేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మరో మాట ఇక్కడ మరచిపోరాదు, ఈ రోజున మాటలతో మాయ చేస్తున్నవారికి వంశీ చిత్రాల్లోని సంభాషణలే ఆదరువు అన్నా అనతిశయోక్తే! గోదావరి అంటే వంశీకి ప్రాణం.…
తమకు అచ్చి వచ్చిన సినిమాల పేర్లనే ఇంటిపేరుగా మార్చుకొని రాణించిన వారెందరో ఉన్నారు. ‘శుభలేఖ’ సుధాకర్ కూడా అచ్చంగా అలాంటివారే! ఒకప్పుడు రివటలా ఉండే ‘శుభలేఖ’ సుధాకర్, ఇప్పుడు రాటు తేలిన కేరెక్టర్ యాక్టర్! తన దరికి చేరిన పాత్రల్లోకి ఇట్టే పరకాయ ప్రవేశం చేసి మార్కులు కొట్టేస్తూ ఉంటారు. అవి నచ్చినవారు ఆయనను పట్టేసి తమ సినిమాల్లో పెట్టేసుకుంటారు. సుధాకర్ కూడా శక్తివంచన లేకుండా నటించేసి, జనాన్ని మెప్పిస్తుంటారు. మధురగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్పీ…