భళారే… ‘శుభలేఖ’ సుధాకర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమకు అచ్చి వచ్చిన సినిమాల పేర్లనే ఇంటిపేరుగా మార్చుకొని రాణించిన వారెందరో ఉన్నారు. ‘శుభలేఖ’ సుధాకర్ కూడా అచ్చంగా అలాంటివారే! ఒకప్పుడు రివటలా ఉండే ‘శుభలేఖ’ సుధాకర్, ఇప్పుడు రాటు తేలిన కేరెక్టర్ యాక్టర్! తన దరికి చేరిన పాత్రల్లోకి ఇట్టే పరకాయ ప్రవేశం చేసి మార్కులు కొట్టేస్తూ ఉంటారు. అవి నచ్చినవారు ఆయనను పట్టేసి తమ సినిమాల్లో పెట్టేసుకుంటారు. సుధాకర్ కూడా శక్తివంచన లేకుండా నటించేసి, జనాన్ని మెప్పిస్తుంటారు. మధురగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్పీ శైలజ పతిదేవుడు ‘శుభలేఖ’ సుధాకర్. ఇద్దరూ గళంతో భలేగా ఆకట్టుకుంటున్నారు. గాయనిగా ఆమె, నటునిగా ఈయన సాగుతున్నా, డబ్బింగ్ తోనూ ఇద్దరూ అలరించడం విశేషం!
సుధాకర్ అసలు పేరు సూరావఝ్ఝల సుధాకర్. 1960 నవంబర్ 19న సుధాకర్ జన్మించారు. చదువు పూర్తి కాగానే మనసు సినిమాల్లోకి వెళ్తానని మారాం చేసింది. మదరాసులో పాత్రల కోసం ప్రయత్నాలలో ఉండగా, కె.విశ్వనాథ్ తెరకెక్కిస్తున్న ‘శుభలేఖ’లో కీలక పాత్రకు ఎంపికయ్యారు. నిజం చెప్పాలంటే ఆ సినిమాలో చిరంజీవి మెయిన్ హీరో, ఆ తరువాత ఆకట్టుకున్న పాత్ర సుధాకర్ దే! ‘శుభలేఖ’ సమయంలోనే తమిళంలో శివాజీ గణేశన్ చిత్రం ‘తునై’లోనూ నటించారు సుధాకర్. ‘శుభలేఖ’ విడుదలై మాతృభాష తెలుగులో మంచి పేరు దక్కింది. అప్పటికే ఓ సుధాకర్ చిత్రసీమలో ఉండగా, ఈ సుధాకర్ తన సినిమా ‘శుభలేఖ’ను ఇంటిపేరుగా చేసుకోవలసి వచ్చింది. ఆ పేరే ఆయనకు శుభాలు చేకూర్చింది. సోలో హీరోగా ఎప్పుడూ హిట్టు పట్టలేదు కానీ, హీరోకు సమానమైన పాత్రల్లో నటించేసి విజయాలు చూశారు సుధాకర్.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
“సితార, రెండు జెళ్ళ సీత, మంత్రి గారి వియ్యంకుడు, రావు గోపాలరావు, జననీ జన్మభూమి, స్వాతి, స్రవంతి, ప్రేమించు పెళ్ళాడు, అన్వేషణ, లేడీస్ టైలర్, సీతారామకళ్యాణం, అహ నా పెళ్ళంట, కలెక్టర్ గారి అబ్బాయి, శ్రీనివాస కళ్యాణం, ముద్దుల మావయ్య, శివ, ఆదిత్య 369, పెళ్ళి పుస్తకం, చిత్రం భళారే విచిత్రం, భైరవద్వీపం, గౌతమీపుత్ర శాతకర్ణి, భీష్మ” వంటి చిత్రాలలో శుభలేఖ సుధాకర్ తనదైన బాణీ పలికిస్తూ నటించారు. కొన్నిట సెకండ్ హీరోగా, కొన్నిటిలో విలన్ గా, మరి కొన్ని సినిమాల్లో కేరెక్టర్ యాక్టర్ గా ఇలా వైవిధ్యం పలికిస్తూ సాగారు సుధాకర్.
ఇప్పుడయితే ఎంతోమంది యువదర్శకులు శుభలేఖ సుధాకర్ ను తమ చిత్రాలలో కేరెక్టర్ రోల్స్ కు ఎంపిక చేసుకుంటున్నారు. అవి లేకపోయినా, పరభాషా నటులకు డబ్బింగ్ చెప్పడానికైనా శుభలేఖ సుధాకర్ గళాన్ని వాడేస్తున్నారు. శుభలేఖ సుధాకర్ కూడా నటన మాత్రమే చేస్తానని భీష్మించుకోలేదు. తన దరికి చేరిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటున్నారు. శుభలేఖ సుధాకర్, శైలజ దంపతులకు ఓ కుమారుడు. పేరు శ్రీకర్. ఒకప్పుడు సినిమాలలో బిజీగా సాగిన సుధాకర్, తరువాత టీవీ సీరియల్స్ లోనూ మురిపించారు. తెలుగు, తమిళ భాషల్లో ఎక్కడ అవకాశం చిక్కితే అక్కడ వాలిపోతున్నారు. ప్రతీచోటా తన ప్రతిభను ప్రదర్శిస్తూనే ఉన్నారాయన. ‘శుభలేఖ’ సుధాకర్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ మరింతగా అలరించాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
OTR: నెల్లూరులో ప్రజారాజ్యం ఫార్ములా ఫాలో అవుతున్న జనసేన..?
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
-
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!