పసిమి ఛాయ, చారెడేసి కళ్ళు, కొనదేలిన ముక్కు, దొండపండులాంటి పెదాలు, ఇలా వర్ణించుకుంటూ పోతే మౌనుల నిగ్రహానికి సైతం పరీక్ష పెట్టే విగ్రహం వై.విజయ సొంతం. తెరపై వై.విజయను చూడగానే ‘పులుసు’ అంటూ కేకలు వేసేవారు జనం. “మంగమ్మగారి మనవడు, మా పల్లెలో గోపాలుడు, ముద్దుల క్రిష్ణయ్య” చిత్రాల్లో చేపల పులుసు చేయడంలో తనకు తానే సాటి అని చెప్పుకొనే పాత్రలో కనిపించారు వై.విజయ. అప్పటి నుంచీ ఆ పేరుతోనే ‘పులుసు’ విజయగా జనం మదిలో నిలచి…
సినిమారంగాన్ని నమ్ముకుంటే ఏ నాడూ మన నమ్మకాన్ని వమ్ము చేయదని అంటారు. అలా సక్సెస్ చూసిన వారెందరో ఉన్నారు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఏ.యమ్.రత్నం సినిమా తల్లి వంటిది. బిడ్డలను ఎప్పుడూ కాపాడుతుంది అంటూ ఉంటారు. మేకప్ మేన్ గా, నిర్మాతగా, దర్శకునిగా తనదైన బాణీ పలికించిన ఏ.యమ్.రత్నం ఇప్పటికీ జనానికి వైవిధ్యం అందించాలనే తపనతోనే ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రం నిర్మిస్తున్నారాయన. గతంలో తన భారీ చిత్రాల…
ఓ నాటి అందాల తార, తరువాతి రోజుల్లో అందాల బామ్మగా, మామ్మగా నటించిన వహిదా రెహమాన్ మన తెలుగునాటనే వెలుగు చూశారు. వహిదా 1938 ఫిబ్రవరి 3న తమిళనాడులోని చెంగల్పట్టులో జన్మించారు. ఆమె తండ్రి మొహమ్మద్ అబ్దుర్ రెహమాన్ ఉద్యోగ రీత్యా తెలుగునేలపైనా ఆయన పనిచేశారు. అలా విశాఖపట్టణంలోని సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ లో ఆమె చదివారు. చిన్నప్పుడే నాట్యం నేర్చుకున్నారు. వహిదా డాక్టర్ కావాలని కలలు కన్నారు. కానీ, తండ్రి మరణంతో ఆమె నృత్యమే ఆమెకు…
నవ్వుకే నవ్వు పుట్టించగల సమర్థుడు హాస్యనటబ్రహ్మ బ్రహ్మానందం. ‘నవ్వు, నవ్వించు, ఆ నవ్వులు పండించు’ అన్నట్టుగా ఎప్పుడూ నవ్వుతూనే కనిపించే బ్రహ్మానందం చిత్రసీమలో తన నవ్వుల నావ నడపడానికి ముందు చిరునవ్వుతోటి విషవలయాలను ఛేదిస్తూ ముందుకు సాగారు. చిన్నప్పటి నుంచీ నవ్వునే నమ్ముకొని హాస్యబలం పెంచుకున్నారు. బాల్యంలోనే తనకు తెలిసిన వారిని అనుకరిస్తూ, వారి చేష్టలను చూపించి తన చుట్టూ ఉన్న వారికి నవ్వులు పంచేవారు. ఏ ముహూర్తాన ఆయన కన్నవారు బ్రహ్మానందం అని నామకరణం చేశారో…
ఇప్పుడంటే జాకీ ష్రాఫ్ ఎవరు అన్న ప్రశ్నకు టైగర్ ష్రాఫ్ తండ్రి అనే సమాధానం లభిస్తుందేమో కానీ, ఒకప్పుడు జాకీ ష్రాఫ్ చేయి తగిలితే చాలు అని పలవరించిన భామలు ఉన్నారు. జాకీ ష్రాఫ్ యాక్టింగ్ స్టైల్ చూసి ఫిదా అయిపోయిన వారెందరో! అడపా దడపా తెలుగు చిత్రాల్లోనూ విలన్ గానో, కేరక్టర్ యాక్టర్ గానో దర్శనమిచ్చే జాకీ ష్రాఫ్ అందరికన్నా ముందు తెలుగువారికే పరిచయస్థుడు. అదెలాగంటే మన హైదరాబాద్ లో తయారయ్యే చార్మినార్ సిగరెట్స్కు అప్పట్లో…
ఈ నాటి ప్రేక్షకులకు కేరెక్టర్ యాక్టర్ గా పరిచయమున్న నరేశ్ ను చాలామంది ‘సీనియర్ నరేశ్’ అంటూ ఉంటారు. కృష్ణ సతీమణి విజయనిర్మల తనయుడే నరేశ్. కృష్ణ హీరోగా నటించిన కొన్ని చిత్రాలలో బాలనటునిగా కనిపించిన నరేశ్, తల్లి దర్శకత్వం వహించిన ‘ప్రేమసంకెళ్ళు’తో ముందుగా కెమెరా ముందుకు వచ్చారు. అయితే ఆ సినిమా నిర్మాణంలో ఉండగానే జంధ్యాల తెరకెక్కించిన ‘నాలుగు స్తంభాలాట’ లో నవ్వులు పూయిస్తూ జనం ముందు నిలిచారు. ఆ చిత్రంతోనే నటుడిగా మంచి పేరు…
‘ఆరడుగుల బుల్లెట్’ అంటూ పవన్ కళ్యాణ్ పై పాట రాశారు కానీ, వాళ్ళ కొణిదెల ఫ్యామిలీ స్టార్స్ లో ఆ మాటకు అసలు సిసలు నిర్వచనంగా నిలుస్తాడు వరుణ్ తేజ్. ఆరడుగుల పైన ఎత్తున్న వరుణ్ తేజ్ నవతరం కథానాయకుల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. చిరంజీవి పెద్ద తమ్ముడు నటుడు, నిర్మాత నాగబాబు కుమారునిగా ఆరంభంలో గుర్తింపు సంపాదించిన వరుణ్ తేజ్ ఇప్పుడు హీరోగా తన ఉనికిని చాటుకుంటున్నాడు. వరుణ్ తేజ్ 1990 జనవరి 19న…
భానుప్రియ అన్న నాలుగక్షరాలు ఆ రోజుల్లో ఎందరో కుర్రాళ్ళకు నిత్యం జపించే మంత్రం. భానుప్రియ అందాల అభినయం రసిక హృదయాల్లో ఓ ఆకర్షణ యంత్రం. కనులు మూసినా, తెరచినా ఈ విశాలాక్షి రూపాన్నే స్మరిస్తూ సాగినవారెందరో. అందరికీ ఈ నాటికీ భానుప్రియ పేరు వినగానే మదిలో మధురమైన బాధ మొదలు కాక మానదు. నటనతోనూ, నర్తనంతోనూ తెలుగువారికి నయనానందం కలిగించిన అభినయ ప్రియ ఆమె. భానుప్రియ అసలు పేరు మంగభాను. స్వస్థలం రాజమండ్రి సమీపంలోని రంగంపేట. అక్కడే…
మెగా మేనల్లుళ్లు, పంజా బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ మధ్య ఉన్న సోదర ప్రేమ గురించి వర్ణించడం కష్టమే. తమ్ముడిని ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో అన్న సాయి ధరమ్ తేజ్ ప్రయత్నం చాలా గట్టిది. ప్రతి కథలో తాను ఇన్వాల్వ్ అవ్వకుండా వైష్ణవ్ తేజ్ సింగిల్ గా నిర్ణయం తీసుకొనేలా నేర్పించాడు. అతడి సక్సెస్ ని సాయి తేజ్ సెలబ్రేట్ చేశాడు. ఇక వైష్ణవ్ కూడా ఏమి…
చిత్రసీమలో రాణించాలంటే గుమ్మడి కాయంత ప్రతిభ కన్నా, ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. ఇది పాత సామెతే! కానీ, ఏ నాటికైనా పనికి వచ్చే సినిమా సామెత! అందాల భామ ప్రగ్యా జైస్వాల్ విషయంలో ఈ సామెత నిజమయిందనే చెప్పాలి. అమ్మాయిని చూడగానే నాజుకు షోకులతో ఆకట్టుకొనే మెరుపు తీగెలా ఉంటుంది. అలాగే, ముఖంలో భావాలను పలికించడంలోనూ మేటి అనిపిస్తుంది. కానీ, ఏం లాభం ఇప్పటి దాకా ఆమె నటించిన ఏ చిత్రమూ అంతగా జనాన్ని ఆకట్టుకోలేక పోయింది.…