Tatineni Ramarao: ఒకప్పుడు భారతీయ సినిమా అంటే హిందీ సినిమానే అనే తీరున వెలిగింది. ప్రస్తుతం హిందీ చిత్రసీమ టాలీవుడ్ వైపే ఎక్కువగా దృష్టి సారిస్తోంది. ఇప్పటి దర్శకుల దిగ్విజయాల కారణంగానే తెలుగు సినిమా రంగంవైపు హిందీవాళ్ళు దృష్టి కేంద్రీకరించారని నవతరం ప్రేక్షకులు పొరబడుతున్నారు. మన దర్శకులు, నటీనటుల కోసం ఉత్తరాదివారు ఆసక్తిగా ఎదురుచూసిన సందర్భాలు బోలెడు ఉన్నాయి. అలా హిందీ చిత్రాలతో వెలుగు చూసిన తెలుగు దర్శకులు ఎందరో ఉన్నారు. వారిలో తాతినేని రామారావు ప్రత్యేక…
Manjula Ghattamaneni: తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోస్ ఫ్యామిలీస్ నుండి అమ్మాయిలు నటించడం అన్నదానికి శ్రీకారం చుట్టింది ఎన్టీఆరే. ఆయన కూతురు భువనేశ్వరి (చంద్రబాబు నాయుడు భార్య) బాలనటిగా ‘మనుషుల్లో దేవుడు’ చిత్రంలో కాసేపు తెరపై శ్రీకృష్ణునిగా కనిపించారు. ఆ తరువాత ‘దానవీరశూర కర్ణ’ కోసం ఓ పాటను పురంధేశ్వరి, భువనేశ్వరిపై చిత్రీకరించినా, ఎందుకనో ఆ సాంగ్‌ను సినిమాలో తొలగించారు. ఎన్టీఆర్‌ను అనేక విషయాల్లో స్ఫూర్తిగా భావించే కృష్ణ సైతం తన రెండో కూతురు మంజులను బాలనటిగానటింప…
టాలీవుడ్ లో చిన్న చిత్రాల జోరు కొనసాగుతూనే ఉంది. ఈ వీకెండ్ లో అనువాద చిత్రాలతో కలిపి ఏకంగా ఎనిమిది సినిమాలు జనం ముందుకు వస్తున్నాయి. జూన్ 7వ తేదీ హాలీవుడ్ మూవీ ‘థోర్ లవ్ అండ్ థండర్’ గ్రాండ్ వే లో రిలీజ్ అవుతోంది. అలానే గత నెలలో తమిళంలో విడుదలైన సత్యరాజ్ తనయుడు శిబి రాజ్ నటించిన ‘మయోన్’ తెలుగు డబ్బింగ్ మూవీ కూడా గురువారమే జనం ముందుకు వస్తోంది. శుక్రవారం ఆరు…
తొలిసారి దర్శకత్వం వహించే దర్శకులకు సవాలక్ష సమస్యలు ఉంటాయి. నిర్మాతకు కథ చెప్పి ఒప్పించడం ఒక ఎత్తు అయితే కథానాయకుడిని మెప్పించడం మరో ఎత్తు. అనుకున్న బడ్జెట్ లో, అనుకున్న విధంగా సినిమా రూపొందించాలంటే… అతనికి వెన్నుదన్నుగా నిలవాల్సింది ప్రధానంగా ఛాయాగ్రాహకుడు. దర్శకుడి మనసులోని ఆలోచనలను గ్రహించి, దానికి అనుగుణంగా అందంగా సన్నివేశాలను కెమెరాలో బంధించాల్సింది ఆయనే. అందువల్లే దర్శకుడు, ఛాయాగ్రాహకుడి బంధం భార్యభర్తల వంటిదని సినిమా పెద్దలు చెబుతుంటారు. ఇక తొలిసారి మెగాఫోన్ పట్టుకునే డైరెక్టర్స్…
లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్ర లో ‘మత్తువదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన సర్రియల్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘హ్యాపీ బర్త్ డే’. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 8న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు రితేష్ రానా మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించిన తన భావాలను ఇలా పంచుకున్నారు. ”’మత్తువదలరా’ కోసం ఏర్పడిన టెక్నికల్…
ఈమధ్య యువ దర్శకులందరూ విభిన్నమైన కథాచిత్రాలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తున్నారు. మునుపెన్నడూ ట్రై చేయని సబ్జెక్టుల్ని, కామిక్ యాంగిల్‌లో చూపిస్తూ, ఆడియన్స్‌ను అలరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో దర్శకుడు రితేష్ రానా ఆల్రెడీ విజయవంతం అయ్యాడు. తన తొలి చిత్రం(మత్తు వదలరా)తో ప్రేక్షకుల మత్తు వదిలించాడు. ఇప్పుడు హ్యాపీ బర్త్‌డే అంటూ మరో కొత్త కాన్సెప్ట్‌తో మన ముందుకు రాబోతున్నాడు. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్, సత్య, ప్రియదర్శి సహా…
మోహన్ లాల్ – ఈ పేరు మళయాళ సీమలో ఓ సమ్మోహనం! ముద్దుగా బొద్దుగా ఉంటూనే పాత్రకు పరిమితమైన అభినయాన్ని ప్రదర్శిస్తూ మోహన్ లాల్ సాగుతున్నారు. కేరళ వాసులు కేరింతలు కొడుతూ మోహన్ లాల్ చిత్రాలను ఆదరిస్తున్నారు. వారిని అలరించేందుకు తన ప్రతి చిత్రంలోనూ వైవిధ్యానికి పెద్ద పీట వేస్తున్నారు మోహన్ లాల్. కొన్ని తెలుగు చిత్రాలలోనూ నటించి ఆకట్టుకున్నారాయన. మాతృభాష మళయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలలోనూ మోహన్ లాల్ నటించి మురిపించారు.…
ప్రతిభ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి మరీ పట్టం కట్టడంలో తెలుగువారికి సాటి మరెవరూ రారు. అలా పరభాషల్లో రాణించేవారిని సైతం పట్టుకు వచ్చి తెలుగు చిత్రాలలో తగిన అవకాశాలు కల్పిస్తూంటారు మనవాళ్ళు. నటి నిత్య మీనన్ సైతం అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్నా, తెలుగు భాషను నచ్చి మెచ్చి, నటించడంతోనే కాదు, తన గళంతోనూ ఆకట్టుకుంది. 1988 ఏప్రిల్ 8న బెంగళూరులో పుట్టిన నిత్య మీనన్ మాతృభాష మళయాళం. చిన్న తనం నుంచీ అన్నిటా చురుగ్గా ఉండే…
తాత ఏయన్నార్ మహానటుడు. తండ్రి నాగార్జున టాప్ స్టార్. అన్న నాగచైతన్య యంగ్ హీరోస్ లో తనకంటూ ఓ స్థానం సంపాదించాడు. ఇక మిగిలింది అక్కినేని అఖిల్ వంతు. ఏడాది దాటిన వయసులోనే అఖిల్ ‘సిసింద్రీ’గా జనాన్ని మెప్పించాడు. అప్పటి నుంచీ అక్కినేని ఇంట మరో ప్రతిభావంతుడు పుట్టాడని జనం భావించారు. దోగాడే పసిపాపగా ఉన్న రోజుల్లోనే అలరించిన అఖిల్ కథానాయకునిగానూ మెప్పిస్తాడని అభిమానులు ఆశించారు. ఎందుకనో వారి ఆశలు అంతగా ఫలించలేదు. గత యేడాది ‘మోస్ట్…
వైవిధ్యానికి మారు పేరు రామ్ గోపాల్ వర్మ అంటారు అభిమానులు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అన్నది అనేకుల మాట. రామ్ గోపాల్ వర్మ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన లేవనెత్తే వివాదాలే! ఒకటా రెండా ఏదో విధంగా వార్తల్లో నిలవడమే వర్మకు మహా ఇష్టం. ఎవరో ఒకరిని అడ్డంగా విమర్శించి వివాదానికి తెరలేపుతారాయన. తద్వారా తన తాజా చిత్రాలకు ఆ వివాదాలనే ప్రచారంగానూ మలచుకుంటారు. దటీజ్… వర్మ అనిపిస్తారు! తొలి చిత్రం ‘శివ’తోనే ఎంతోమందిని…