Gujarat: గుజరాత్ మోర్బీ జిల్లాలో దారుణంగా ప్రవర్తించింది ఓ యజమాని. తాను మహిళని మరిచిపోయి ఓ దళిత ఉద్యోగిపై కర్కషంగా వ్యవహరించింది. పెండింగ్‌లో ఉన్న జీతం ఇవ్వాలని అడిగినందుకు సదరు మహిళా యజమాని దళిత ఉద్యోగిపై దాడి చేయడమే కాకుండా.. ఆమె చెప్పులను నోటిలో పెట్టుకోవాలని హింసించింది. ఈ వ్యవహారంలో సదరు మహిళతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
Ghol fish: గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర చేపగా ‘ఘోల్ ఫిష్’ని ప్రకటించింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న రెండు రోజుల గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ ఇండియా-2023 సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘోల్ ఫిష్‌ని గుజరాత్ రాష్ట్ర చేపగా ప్రకటించారు.
గుజరాత్ లోని దాహోద్ జిల్లా లోని పావ్‌డి గ్రామం.. మారుమూల గిరిజన ప్రాంతం కావడం చేత కనీస సదుపాయాలకు కూడా నోచుకోలేదు. అలా అని ఆ గ్రామ ప్రజలు నిరుత్సహ పడలేదు.
భారత వైమానిక దళానికి చెందిన గరుడ్ కమాండో సూసైడ్ చేసుకున్నాడు. తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుజరాత్‌లోని కచ్ జిల్లా భుజ్ సమీపంలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ఆయన విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు సమాచారం అందించారు. నవంబర్ 16న తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Pakistan: పాకిస్తాన్ చెర నుంచి 80 మంది మత్స్యకారులకు విముక్తి లభించింది. చేపల వేటకు వెళ్లిన వీరు భారత సముద్ర జాలాలు దాడి పాకిస్తాన్ జలాల్లోకి తెలియకుండా వెళ్లడంతో అక్కడి అధికారులు వీరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరంతా విడుదలై ఈ రోజు తమ కుటుంబాలతో దీపావళి చేసుకునేందుకు సొంతూళ్లకు వెళ్లారు.
Ex CMs Vijay Rupani, Suresh Mehta escape from Road Accident: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రులు విజయ్ రూపానీ, సురేశ్ మెహతా రోడ్డు ప్రమాదాల నుంచి త్రుటిలో బయటపడ్డారు. సోమవారం వేర్వేరు చోట్ల ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ప్రమాదాల్లో గుజరాత్ మాజీ సీఎంకు ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. ఈ విషయాన్ని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సీపీ ముంధ్వా తెలిపారు. సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో విజయ్ రూపానీ కాన్వాయ్ అహ్మదాబాద్,…
Heart Attack: ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. కొన్నాళ్ల క్రితం కేవలం వయసు పైబడిన వారికి మాత్రమే గుండెపోటు వస్తుందని అంతా అనుకునే వాళ్లం. కానీ ఇప్పడు స్కూల్ పిల్లల నుంచి టీనేజ్ వయసు వారికి, 30 ఏళ్ల లోపువారు కూడా గుండె పోటుకు గురై ప్రాణాలు వదులుతున్నారు. అంతవరకు సంతోషంగా పెళ్లిలోనో, ఇతర శుభకార్యాల్లో నవ్వుతూ డ్యాన్సులు చేస్తున్న వారు హఠాత్తుగా హార్ట్ ఎటాక్ కారణంగా విగతజీవులవుతున్నారు.
Gujarat: శనివారం గుజరాత్ సూరత్ లోని శ్రీ సిద్ధేశ్వర్ కాంప్లెక్స్‌లో ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. కాగా ఘటన స్థలంలో విషం బాట్టిల్ తో పాటుగా సూసైడ్ లెటర్ దొరకడంతో అందరూ అది సామూహిక ఆత్మహత్యగా భావించారు. అయితే తాజాగా ఆ ఘటనకు సంబందించిన పోస్టుమార్టం రిపోర్ట్స్ వచ్చాయి. ఆ రిపోర్ట్స్ ఆధారంగా అసలు నిజాలు వెలుగు చూశాయి. అందరూ భావించినట్లు కుటుంభం సభ్యులు అందరూ కలిసి సామూహిక…
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబరు 30, 31 తేదీల్లో గుజరాత్‌లో పర్యటించనున్నారు. అందులో భాగంగా ఆయన గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో పలు ప్రాజెక్టులు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు.