Gujarat: ఎంతటి కష్టం వచ్చిందో.. ఒకే కుటుంబంలోని 7గురు సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన గుజరాత్ లోని సూరత్ లో చోటు చేసుకుంది. ఘటన స్థలం నుంచి పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Cyclone Tej: తేజ్ తుఫాన్ తీవ్రత తారా స్థాయికి చేరనుందని భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. భారత వాతావరణ కేంద్రం (IMD) సమాచారం ప్రకారం.. ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నానికి తేజ్ తుఫాన్ తీవ్రతరంగా మారే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం తేజ్ తుఫాను కారణంగా అతి వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయని.. వేచే ఈదురు గాలుల వేగం గంటకు గరిష్టంగా 62 కిలోమీటర్ల నుంచి 88 కిలోమీటర్లుగా ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు.…
Garba events: నవరాత్రుల సందర్భంగా గుజరాత్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో గర్భా డ్యాన్స్ కార్యక్రమాలు అట్టహాసంగా జరుగాయి. గర్బా నృత్య వేడుకల్లో చిన్నా పెద్దా, యువతీయువకులు పాల్గొంటున్నారు. అయితే ఈ వేడుకల్లో పాల్గొంటున్న కొందరు గుండెపోటుతో కుప్పకూలుతున్నారు. గర్బా వేడకలు ఆయా కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. అప్పటి వరకు తమ ముందు ఆనందంగా, నవ్వుతూ డ్యాన్స్ చేసిన వ్యక్తులు గుండె పోటుతో మరణించడం చాలా మందిని కలిచివేస్తోంది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దసరా నవరాత్రులు జరుగుతున్నాయి.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి.. ఇక గుజరాత్ లో నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.. తొమ్మిది రోజుల పండుగ, దాండియా రాత్రులు మరియు విందులతో గుర్తించబడుతుంది. ఇప్పుడు, రాజ్‌కోట్ నుండి ఒక వీడియో ఉద్భవించింది, ఇది ఒక సమూహం స్త్రీలు కత్తులు పట్టుకుని మోటార్‌సైకిళ్లు మరియు కార్లను నడుపుతూ విన్యాసాలు చేస్తున్నట్లు చూపిస్తుంది.. ఒకానొక సమయంలో, ఈ స్త్రీలలో కొందరు స్కూటర్‌లపై నిలబడి ఇతరులు…
పంచమహల్, దాహోద్ మరియు ఆనంద్ జిల్లాలలో గురువారం అనంత చతుర్దశి సందర్భంగా గణేష్ నిమజ్జనం సందర్భంగా జరిగిన మూడు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. అలాగే 11 మంది గాయపడ్డారు..ఆనంద్‌లోని ఖంభాట్ పట్టణంలోని లడ్వాడ నివాసితులు సందీప్ కోలి మరియు అమిత్ ఠాకోర్ నిమజ్జనం సమయంలో విద్యుదాఘాతానికి గురయ్యారు, ఈ సంఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఖంభాట్‌లోని నవరత్న సినిమా సమీపంలో నిమజ్జనం కోసం గణేశుడి విగ్రహాన్ని తీసుకెళ్లేందుకు బాధితులు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగిందని…
Bridge collapse:గుజరాత్ రాష్ట్రంలో సురేంద్రనగర్ జిల్లాలో ఘోరం జరిగింది. వస్తాడి ప్రాంతంలో ఆదివారం పాత వంతెన కూలిపోయింది. దీంతో డంపర్, మోటార్ సైకిళ్లతో సహా పలు వాహనాలు వంతెన కింద ప్రవహిస్తున్న నదిలో పడిపోయాయి. వాహనాలతో పాటు ప్రయాణికులు నదిలో పడిపోయారు.
గుజరాత్‌లోని తిరుచిరాపల్లి-శ్రీ గంగానగర్ మధ్య నడిచే హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులో శనివారం మంటలు చెలరేగాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. రైలు నుంచి పొగలు కమ్ముకున్నట్లు కనిపిస్తున్నాయి. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడం ఊపిరి పీల్చుకున్నారు.
గుజరాత్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వడోదర, భరూచ్, నర్మదా, దాహోద్, పంచమహల్, ఆనంద్, గాంధీనగర్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న 11,900 మందిని షెల్టర్ హోమ్‌లకు తరలించారు. మరో 270 మంది ఒంటరిగా ఉన్న పౌరులను రక్షించారు.
మొన్నటివరకు వీధి కుక్కలు మనుషులను ఆటాక్ చేసి చంపేస్తున్నాయి.. ఇప్పుడు వీధుల్లో తిరుగుతున్న ఆవులు కూడా మనుషుల పై పగబట్టి చంపేస్తున్నాయి.. సడెన్ గా దాడులకు తెగబడుతున్నాయి. కొమ్ములతో కుమ్మి కుమ్మి పడేస్తున్నాయి. ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. దేశంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో కుక్కలు, ఆవులు, ఎద్దుల దాడుల ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా గుజరాత్ లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ ఆవు రెచ్చిపోయింది. ఓ యువకుడిపై దాడి చేసింది. వీధుల్లో అతడిని…
Fake Pilot:ఈ మధ్య కాలంలో ప్రేమ, పెళ్లి పేరుతో మోసలకు పాల్పడటం ఎక్కువై పోయింది. పెద్ద ఉద్యోగం చేస్తున్నానంటూ యువతులను చాలా మంది అబ్బాయిలు మోసం చేస్తున్నారు. కేవలం అబ్బాయిలు మాత్రమే కాదు అమ్మాయిలు కూడా అబ్బాయిలను మోసం చేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు తాను పైలెట్ అని చెప్పి నలుగురు అమ్మాయిలను మోసం చేశాడు. అయితే అతడిని పోలీసులు పట్టుకోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇంతకీ అతనిపై అమ్మాయిలు ఫిర్యాదు చేయలేదు. అతనంతట అతనే…