గుజరాత్ దారుణం చోటు చేసుకుంది. ఆయుర్వేదిక్ సిరప్ తాగి ఐదుగురు మరణించగా.. మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన గురువారం గుజరాత్‌లోని ఖేడా జిల్లా నడియాడ్‌లో జరిగింది.ఆ సిరప్‌లో విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్ కలిసినట్టు బాధితుల వైద్య పరీక్షలో వెల్లడైంది. దీంతో గ్రామస్తుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. పోలీసులు సమాచారం ప్రకారం.. పట్టణంలోని ఓ షాప్ కల్‌మేఘాసవాసవ అరిష్ట అనే పేరుతో ఆయుర్వేదిక్ సిరప్‌ను విక్రయించగా.. స్థానికంగా ఉన్న 50 మంది వరకు దానిని కొనుగోలు చేసినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
Also Read: World AIDS Day 2023: మీరు కూడా హెచ్‌ఐవీ, ఎయిడ్స్ ఒకటే అని అనుకుంటున్నారా?.. తేడా తెలుసుకోండి..
ఆ సిరప్ తాగిన రెండు రోజుల్లో అయిదుగురు మృతి చెందారు. మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. అయితే ఇద్దరు విషమ పరిస్థితిలో అస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా షాకింగ్ విషయం వెల్లడైంది. వారు తాగిన ఈ ఆయుర్వేదిక్ సిరప్‌లో విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్ కలిసినట్టు వైద్య పరీక్షలో బయటపడింది. దీంతో పోలీసులు సిరప్ విక్రయించిన షాపు యాజమానిని విచారించగా.. సిరప్ విక్రయానికి ముందు అందులో మిథైల్ ఆల్కహాల్ కలిపినట్టు తేలింది. దీంతో సిరప్ అమ్మిన షాపు యజమానితో పాటు ముగ్గురిని అరెస్టు చేసినట్టు ఖేడా ఎస్పీ రాజేష్ గదియా తెలిపారు.
Also Read: Nayanthara: నయనతారకు ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చిన భర్త.. ధర ఎంతో తెలుసా?