గుజరాత్‌లోని వడోదరలో తీవ్ర విషాదం నెలకొంది. హర్ని సరస్సులో పడవ బోల్తా పడి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. పడవలో ఉన్న వారు ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. మొత్తం పడవలో 27 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. వారిలో ఎవరూ కూడా లైఫ్ జాకెట్లు ధరించలేదని సమాచారం అందుతోంది. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సరస్సులో మునిగిపోయిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థులు…
గుజరాత్ లోని వడోదరకు చెందిన బిహాభాయ్ భర్వాద్ రామ భక్తుడు.. రామాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని 3.5 అడుగుల వెడల్పు, 108 అడుగుల పొడవుతో భారీ అగర్‌బత్తిని తయారు చేశాడు. ఆ భారీ అగర్‌బత్తి అయోధ్య రామయ్య పాదాల చెంత వెలిగింది. రామయ్యకు తమ గ్రామం నుంచి ఏదైనా కానుక ఇవ్వాలని భావించిన తర్సాలీ గ్రామం.. ఈ భారీ అగర్‌బత్తీని తయారుచేసింది. ఈ అగర్‌బత్తితో రాముడికి రోజూ ధూపం వేయాల్సిన పని కూడా తప్పుతుందని గ్రామస్థులు తెలిపారు. కాగా..…
Kite String Slits Throat: గాలి పటాలు ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా మరో పిల్లాడు గాలిపటానికి బలైపోయాడు. గుజరాత్ రాష్ట్రంలోని మహిసాగర్ జిల్లాలో గాలిపటం దారం గొంతును కోయడంతో తీవ్ర రక్తస్రావంతో 4 ఏళ్ల పిల్లాడు మరణించాడు. ఉత్తరాయణ పండుగ(మకర సంక్రాంతి) గాలిపటాలను ఎగరేస్తుంటారు. అయితే ఈ సరదా పలువురి పాలిట శాపంగా మారుతోంది.
PM Modi: గుజరాత్ గాంధీనగర్‌లో జరిగబోయే వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించారు. గుజరాత్‌లో పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది. రాబోయే ఏళ్లలో ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటిగా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో కలిసి మంగళవారం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి గాంధీనగర్ వరకు గ్రాండ్ రోడ్‌షో నిర్వహించారు.
ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల ప్రధాన మంత్రితో పాటు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సమావేశమవుతారని అధికారులు తెలిపారు.
ఓ వ్యక్తి ఏకంగా పోలీస్ వాహనమే కొట్టేసి పరారయ్యాడు. అదీ కూడా పోలీస్ స్టేషన్‌లోనే.. దర్జాగా పోలీస్ వాహనంలో పారిపోయిన సంఘటన గుజరాత్‌లోని ద్వారకాలో చోటుచేసుకుంది. సోషల్ మీడియా పోస్ట్ ద్వారా దొంగను గుర్తించిన పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేశారు. వివరాలు.. గుజరాత్‌కు చెందిన మోహిత్ శర్మ బైక్‌పై ద్వారకా వచ్చాడు. ఈ క్రమంలో ద్వారక పోలీస్ స్టేషన్ సమీపంలో బైక్ పార్క్ చేశాడు. ఆ తర్వాత ద్వారక పోలీసు స్టేషన్ ముందు పార్క్ చేసిన…
Fake Toll Plaza: నేరాల తీరు మారుతోంది. గతంలో ఇంటికి కన్నాలు వేసే పద్ధతిలో నేరాలు జరగడం లేదు. ఇప్పుడంతా సైబర్ దాడులు, టెక్నాలజీ ఆధారిత మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఇదిలా ఉంటే గుజరాత్‌లో జరిగిన ఓ నేరం గురించి తెలిస్తే, మోసగాళ్లు ఎంతగా తెలివిగా ప్లాన్ చేశారో తెలుస్తోంది. ఏకంగా ఓ హైవే ప్రత్యామ్నాయంగా రోడ్డు నిర్మించి నకిలీ టోల్‌ప్లాజాను ఏర్పాటు చేసుకుని దర్జాగా ఏడాదిన్నర పాటు దోపిడీ చేశారు. ఏకంగా ప్రభుత్వాన్ని మోసం చేయడం…
India: భారత్ సంప్రదాయ శిలాజ ఇంధనాల నుంచి శిలాజేతర ఇంధనాల వైపు మొగ్గు చూపుతోంది. సుస్థిర ఇంధనం వైపు పరోగమిస్తోంది. భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఏకంగా సింగపూర్ దేశ పరిమాణంతో ఒక సోలార్ ప్లాంట్‌ని నిర్మిస్తోంది. గుజరాత్ రాష్ట్రంలోని ‘రాన్ ఆఫ్ కచ్’ ఉప్పు ఎడారిలో ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును నిర్మిస్తోంది.
గుండెపోటు కారణంగా గుజరాత్‌లో ఆరు నెలల్లో 1052 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 11 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు వారే 80 శాతం మంది హార్ట్ ఎటాక్‌తో మరణించినట్లు గుజరాత్ ప్రభుత్వం చెబుతోంది. గుండెపోటు ఘటనలు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 2 లక్షల మంది టీచర్లు, కాలేజీ ప్రొఫెసర్లకు సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.