మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌చవాన్ (Ashok Chavan) లక్కీ ఛాన్స్ కొట్టేశారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రెండ్రోజులకే రాజ్యసభ (Rajya Sabha) సీటు దక్కేసింది.
గుజరాత్‌లో (Gujarat) ఓ స్కూల్ విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. బస్సులో విద్యార్థులతో కలిసి టీచర్లు విహారయాత్రకు వెళ్తుండగా ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి.
2 Year Old Boy Falls Into Borewell In Gujarat: బోరుబావిలో పడిన రెండేళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. రెస్క్యూ టీమ్ దాదాపు 9 గంటలపాటు శ్రమించి చిన్నారిని బయటకు తీసుకొచ్చింది. ఈ ఘటన గుజరాత్ జామ్‌నగర్‌లోని గోవానా గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. బాలుడుని వెంటనే చికిత్స కోసం జామ్‌నగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి… గోవానా గ్రామంలో మంగళవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో…
75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన పరేడ్ లో డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్‌తో రూపొందించిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ శకటానికి తృతీయ బహుమతి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.. కర్తవ్య పథ్ లో వికసిత్ భారత్ థీమ్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలకు అద్దం పట్టేలా తీర్చిదిద్దిన శకటం పలువురిని ఆకట్టుకుందని తెలిపింది.
Gujarat: అయోధ్యలో రేపు రామ మందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంతో భవ్య రామ మందిరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ లోని మోహసానా జిల్లాలో శ్రీరాముడి శోభాయాత్రపై రాళ్లు రువ్వడం కలకలం రేపింది. ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది.
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించడంతో పార్టీ వైఖరి నచ్చక సీనియర్ ఎమ్మెల్యే సీజే చావ్దా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
గుజరాత్‌లోని వడోదర హర్ని సరస్సులో పడవ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరింది. అందులో 14 మంది చిన్నారులతో పాటు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. పడవలో మొత్తం 27 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారని, వారిలో ఎవరూ లైఫ్ జాకెట్లు ధరించకపోవడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అంటున్నారు. విహారయాత్ర కోసమని పాఠశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. ఈ ఘటనలో అగ్నిమాపక సిబ్బంది ఇప్పటి వరకు ఏడుగురు విద్యార్థులను రక్షించగా, తప్పిపోయిన వారికోసం గాలింపు…
గుజరాత్‌లోని వడోదరలో తీవ్ర విషాదం నెలకొంది. హర్ని సరస్సులో పడవ బోల్తా పడి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. పడవలో ఉన్న వారు ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. మొత్తం పడవలో 27 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. వారిలో ఎవరూ కూడా లైఫ్ జాకెట్లు ధరించలేదని సమాచారం అందుతోంది. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సరస్సులో మునిగిపోయిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థులు…
గుజరాత్ లోని వడోదరకు చెందిన బిహాభాయ్ భర్వాద్ రామ భక్తుడు.. రామాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని 3.5 అడుగుల వెడల్పు, 108 అడుగుల పొడవుతో భారీ అగర్బత్తిని తయారు చేశాడు. ఆ భారీ అగర్బత్తి అయోధ్య రామయ్య పాదాల చెంత వెలిగింది. రామయ్యకు తమ గ్రామం నుంచి ఏదైనా కానుక ఇవ్వాలని భావించిన తర్సాలీ గ్రామం.. ఈ భారీ అగర్‌బత్తీని తయారుచేసింది. ఈ అగర్బత్తితో రాముడికి రోజూ ధూపం వేయాల్సిన పని కూడా తప్పుతుందని గ్రామస్థులు తెలిపారు. కాగా..…
Kite String Slits Throat: గాలి పటాలు ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా మరో పిల్లాడు గాలిపటానికి బలైపోయాడు. గుజరాత్ రాష్ట్రంలోని మహిసాగర్ జిల్లాలో గాలిపటం దారం గొంతును కోయడంతో తీవ్ర రక్తస్రావంతో 4 ఏళ్ల పిల్లాడు మరణించాడు. ఉత్తరాయణ పండుగ(మకర సంక్రాంతి) గాలిపటాలను ఎగరేస్తుంటారు. అయితే ఈ సరదా పలువురి పాలిట శాపంగా మారుతోంది.