Ghol fish: గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర చేపగా ‘ఘోల్ ఫిష్’ని ప్రకటించింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న రెండు రోజుల గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ ఇండియా-2023 సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘోల్ ఫిష్‌ని గుజరాత్ రాష్ట్ర చేపగా ప్రకటించారు.
భారతదేశంలో కనిపించే ఈ అరుదైన చేప రకాల్లో ఘోల్ చేప ఒకటి. ఇది బంగారు-గోధుమ రంగులో ఉండీ.. గుజరాత్, మహారాష్ట్ర సముద్ర ప్రాంతాల్లో కనిపిస్తుంది. అంతర్జాతీయంగా, దేశీయంగా ఈ చేపకు చాలా డిమాండ్ ఉంది. మత్స్యకారులకు ఈ చేప వలలో చిక్కితే లక్షలు చిక్కినట్లే. ఈ చేపను కొనాలంటే సాధారణ ప్రజలు ఆస్తుల్ని అమ్ముకోవాల్సిందే, ఈ చేపకి అంత డిమాండ్ ఉంటుంది.
Read Also: Heart Attack: AIతో గుండెపోటును పదేళ్ల ముందే గుర్తించవచ్చు.. ఆక్స్‌ఫర్డ్ అధ్యయనంలో వెల్లడి..
దాని మాంసం, ఎయిర్ బ్లాడర్ కారణంగా ఈ చేపకు చాలా డిమాండ్ ఉంది. ఘోల్ చేపని బీర్, వైన్ తయారీకి ఉపయోగిస్తారు. చేప ఎయిర్ బ్లాడర్ ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. చేప మాంసాన్ని, ఎయిర్ బ్లాడర్‌ని విడివిడిగా విక్రయిస్తారు. ఎయిర్ బ్లాడర్‌ని ముంబై నుంచి ఎగుమతి చేస్తారు.
ఒకటిన్నర పొడవు ఉంటే ఈ చేప ధర చాలా ఎక్కువ. ఎంత పొడవుంటే అంత ఎక్కువ రేటు పలుకుతుంది. ఒక్క చేప రూ. 5 లక్షల వరకు పలుకుతుంది. ఘోల్ చేప వల్ల ఏటా కొందరు మత్స్యకారులు లక్షల్లో సంపాదిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సందర్భంగా కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా గతంలో ఈ గ్లోబల్ ఫిషనరీ కాన్ఫరెన్స్ ఇండియా ద్వారా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్ర చేపను ప్రకటించాయని వెల్లడించారు.