PM Modi: టాప్-3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఉంటుంది.. ఇదే నా హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: గుజరాత్ గాంధీనగర్‌లో జరిగబోయే వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించారు. గుజరాత్‌లో పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది. రాబోయే ఏళ్లలో ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటిగా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు.
Read Also: Abbas Daughter : అబ్బాస్ కూతురు ఎంత అందంగా ఉందో చూశారా?
Also Read
‘‘ ప్రపంచంలో ఈ రోజు భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. 10 ఏళ్ల క్రితం భారత్ 11వ ఆర్థిక వ్యవస్థగా ఉంది. నేడు అన్ని ప్రధాన సంస్థలు రాబోయే కొన్నేళ్లలో భారత్ ప్రపంచంలోని 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంటుందని అంచనా వేస్తున్నాయి. మొదటి మూడు ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఉంటుందని హామీ ఇస్తున్నాను’’ అని ప్రధాని మోడీ అన్నారు. రాబోయే 25 ఏళ్లలో భారతదేశం వ్యూహాత్మక దృక్పథాన్ని ప్రధాని వివరించారు. స్వాతంత్య్రం పొంది 100 ఏళ్ల పూర్తయ్యే నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు.
ప్రపంచ సవాళ్లను ఎదుర్కొంటూ కూడా భారతదేశం ఆర్థిక వృద్ధికి గత దశాబ్ధకాలంగా నిర్మాణాత్మక సంస్కరరణలపై దృష్టిపెట్టడమే కారణమని ప్రధాని మోడీ అన్నారు. వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ 10వ ఎడిషన్ జనవరి 10 నుండి 12 వరకు గాంధీనగర్‌లో జరుగుతోంది. ఈ సంవత్సరం ఎడిషన్‌లో 34 భాగస్వామ్య దేశాలు మరియు 16 భాగస్వామ్య సంస్థలు పాల్గొంటున్నాయి. ఈ సమావేశానికి మొజాంబిక్ దేశాధినేతతో పాటు యూఏఈ అధ్యక్షుడు అతిథులుగా వస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!