Ayodhya Ram Mandir: రామయ్య పాదాల చెంత వెలిగిన 108 అడుగుల భారీ అగరబత్తి.. వీడియో ఇదిగో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్ లోని వడోదరకు చెందిన బిహాభాయ్ భర్వాద్ రామ భక్తుడు.. రామాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని 3.5 అడుగుల వెడల్పు, 108 అడుగుల పొడవుతో భారీ అగర్‌బత్తిని తయారు చేశాడు. ఆ భారీ అగర్‌బత్తి అయోధ్య రామయ్య పాదాల చెంత వెలిగింది. రామయ్యకు తమ గ్రామం నుంచి ఏదైనా కానుక ఇవ్వాలని భావించిన తర్సాలీ గ్రామం.. ఈ భారీ అగర్‌బత్తీని తయారుచేసింది. ఈ అగర్‌బత్తితో రాముడికి రోజూ ధూపం వేయాల్సిన పని కూడా తప్పుతుందని గ్రామస్థులు తెలిపారు. కాగా.. ఈ బాహుబలి బత్తీ తయారు చేయటానికి రెండు నెలల సమయం పట్టిందని.. దీని తయారీకి రూ.5 లక్షలు ఖర్చు అయ్యిందని తెలిపారు.
Ayodhya Ram Temple Invitation : అయోధ్య రామ మందిరం ఆహ్వాన కిట్ లో ఏమున్నాయంటే?
Also Read
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
ఈ అగర్‌బత్తి ఒక నెల, నెలన్నర వరకు వెలుగుతుంది. అగర్‌బత్తి తయారీలో 191 కిలోల ఆవునెయ్యి, 376 కిలోల గుగ్గిలం, 280 కిలోల నువ్వులు, 376 కిలోల కొప్పా పౌడర్, 425 కిలోల హవాన్, 1475 కిలోల ఆవుపేడ తదితర వాటిని ఉపయోగించారు. ఈ అగర్‌బత్తి మొత్తం బరువు 3,400 కిలోలు. గ్రామస్థులు మొత్తం ఈ అగర్‌బత్తి తయారీలో పాలుపంచుకున్నారు. అయోధ్య చేరిన ఈ అగర్‌బత్తిని మంగళవారం శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్‌దాస్ జీ మహారాజ్ సమక్షంలో ముట్టించారు. పలువురు ఆలయ పెద్దలు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున దీనికి హాజరయ్యారు.
PM Modi: లేపాక్షి వీరభద్ర స్వామి దేవాలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు..
కాగా.. జనవరి 22న అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఆ రోజున రామ మందిర మహాసమారోహే ప్రాణ స్థాపనలో దేశం నలుమూలల నుండి రామభక్తులు పాల్గొంటారు. పండుగతో పాటు.. వివిధ సాంస్కృతిక, పౌరాణిక కార్యక్రమాలు జరగనున్నాయి. యేళ్లతరబడి ఎదురుచూస్తున్న రామాలయం పవిత్ర ప్రారంభోత్సవానికి అయోధ్య అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. దేశ, విదేశాల్లో ఉన్న రామ భక్తులు తమకు తోచిన రీతిలో ఉడతాసాయంగా రకరకాలుగా భక్తి కురిపిస్తున్నారు.
#WATCH | The 108-feet incense stick, that reached from Gujarat, was lit in the presence of Shri Ram Janmabhoomi Teerth Kshetra President Mahant Nrityagopal Das ji Maharaj pic.twitter.com/ftQZBgjaXt
— ANI (@ANI) January 16, 2024
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు