PM Modi Roadshow: ప్రధాని నరేంద్ర మోడీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో కలిసి మంగళవారం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి గాంధీనగర్ వరకు గ్రాండ్ రోడ్‌షో నిర్వహించారు. సాయంత్రం విమానాశ్రయంలో యూఏఈ అధ్యక్షుడికి ప్రధాని స్వాగతం పలికిన తర్వాత 3 కిలోమీటర్ల మేర మెగా రోడ్‌షో ప్రారంభమైంది. అహ్మదాబాద్, గాంధీనగర్‌లను కలుపుతూ ఇందిరా వంతెన వద్ద రోడ్ షో ముగుస్తుంది. ఈ ఈవెంట్ కోసం సమగ్ర భద్రతా చర్యలు అమలు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి సోమవారం పేర్కొన్నారు.
Read Also: Uttarpradesh: జనవరి 22న యూపీలో విద్యాసంస్థలకు సెలవు.. మద్యం అమ్మకాలు బంద్
బుధవారం గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ సెంటర్‌లో వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ (వీజీజీఎస్) 10వ ఎడిషన్‌ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. బుధవారం సమ్మిట్‌ను ప్రారంభించిన తర్వాత, ప్రధాన గ్లోబల్ కార్పొరేషన్ల సీఈఓలతో మోడీ సమావేశమై, ఆపై గిఫ్ట్ సిటీకి వెళతారు. సాయంత్రం 5:15 గంటలకు ప్రధాని మోడీ గ్లోబల్ ఫిన్‌టెక్ లీడర్‌షిప్ ఫోరమ్‌లో ప్రభావవంతమైన వ్యాపార నాయకులతో ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంది. వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 10వ ఎడిషన్ జనవరి 10 నుంచి 12 వరకు గాంధీనగర్‌లో జరగనుంది.
#WATCH | People in large numbers welcome PM Modi and UAE President Sheikh Mohamed bin Zayed Al Nahyan in Gujarat's Ahmedabad pic.twitter.com/YdGFcP35Nm
— ANI (@ANI) January 9, 2024