ఉప ఎన్నికలో 25 వేల ఓట్లు వస్తే.. కిషన్ రెడ్డికి మరొకసారి పొన్నం ఛాలెంజ్! కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి సవాల్ విసిరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థికి 25 వేల ఓట్లు వచ్చాయని, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో 25 వేలకు ఒక్క ఓటు తగ్గకుండా తీసుకువస్తే.. మీరేం (కిషన్ రెడ్డి) చెబితే అందుకు తాను సిద్ధం అని చెప్పారు. 25 వేల ఓట్లు బీజేపీ…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నేతలపై రాజకీయ కక్షసాధింపుతో వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే తమ పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. “రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితి అంత దారుణంగా మారింది.. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కూడా లేని స్థితి. హత్యలు, దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయి. ఈ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, మా చేతుల్లో లాఠీలు ఉన్నాయా…
Gudivada Amarnath: తాజాగా వైజాగ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పత్రికా సమావేశంపై స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ మాట్లాడిన వాస్తవాలు ప్రజలకు తెలుస్తున్నాయని, వాటిని తట్టుకోలేక అధికార పక్ష మంత్రులు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తండ్రీ కొడుకులు ఇద్దరూ విదేశాల్లో జల్సాలు చేస్తున్నారని ఆయన సీఎంపై పరోక్షంగా విమర్శించారు. గూగుల్‌ను స్వాగతిస్తున్నామని తాము చెప్పినప్పటికీ, ఎల్లో మీడియా తప్పుడు…
Gudivada Amarnath: గూగుల్ డేటా సెంటర్లపై వైసీపీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా లోకేష్ వ్యక్తిగత విమర్శలు చేశారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆయన నన్ను గుడ్డు అంటారు.. నేను పప్పు అంటాను. ఈ వ్యక్తిగత వ్యాఖ్యల వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఉండదని తెలిపారు.. ఏపీలో గూగుల్ రాకను తాము స్వాగతిస్తుమన్నానిచెబితే కూటమి అనుకూల మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. రైడన్ 1గిగా వాట్ డేటా సెంటర్ వల్ల 200మందికి ఉద్యోగాలు వస్తాయని…
Gudivada Amarnath: చిన్నప్పుడు చందమామ కథలు వింటే.. ఇప్పుడు చంద్రబాబు కథలు వినాల్సి వస్తుంది అంటూ సీఎం చంద్రబాబుపై సెటైర్లు వేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చినవారిని స్వాగతిస్తాం.. కానీ, వాటి వల్ల జరిగే ప్రయోజనాల మీద చర్చ జరగాలి అన్నారు.. ఏపీ ప్రభుత్వం-గూగుల్ మధ్య ఎంవోయూపై ఆయన స్పందిస్తూ.. డేటా సెంటర్ల వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావడం ప్రపంచ వ్యాప్తంగా లేదన్నారు..…
విశాఖలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు అనుమతి లేదని విశాఖపట్నం సీపీ శంఖబ్రత బాగ్చి చెప్పారు. జగన్ పర్యటన రోజే విశాఖలో మహిళల ప్రపంచకప్ 2025 మ్యాచ్ ఉందని, ఆ మ్యాచ్‌కు ఫాన్స్ భారీగా హాజరయ్యే అవకాశమున్నందున పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. వైసీపీ శ్రేణులు ర్యాలీగా వెళ్తే జాతీయ రహదారి బ్లాక్ అవుతుందని, రోడ్ బ్లాక్ అయితే తమిళనాడులో దళపతి విజయ్ ర్యాలీలో జరిగినట్టు తొక్కిసలాట జరగవచ్చన్నారు. ఆ…
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనపై ఉత్కంఠకు తెరలేపింది. రోడ్డు మార్గం ద్వారా మెడికల్ కాలేజ్ పరిశీలనకు వెళ్లేందుకు అనుమతి లభించలేదు. తమిళనాడు కరూర్‌లో తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో రోడ్డు మార్గం ద్వారా జగన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ప్రకటించారు. జగన్ టూర్ కోసం భారీ జన సమీకరణ జరుగుతున్నందున 63 కిమీ రోడ్డు మార్గం ద్వారా వెళ్లేందుకు అవసరమైన భద్రత…
Gudivada Amarnath: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకమే అని స్పష్టం చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. ఈ నెల 9వ తేదీ వైఎస్ జగన్ పర్యటనపై విశాఖలో సన్నాహక సమావేశం నిర్వహించారు.. 7 నియోజకవర్గాల మీదుగా రోడ్ షోగా వెళ్లే అవకాశంపై చర్చించారు.. ఈ సందర్భంగా… గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డిని స్టీల్ ప్లాంట్, షుగర్ ఫ్యాక్టరీ, బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు కలుస్తారని తెలిపారు.. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు…
Gudivada Amarnath: కక్ష పూరితంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. రాష్ట్రంలో కూటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలపై బురదజల్లే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్ లో కలిశారు మాజీ మంత్రి అమర్నాథ్,…