ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి చేసిన విశ్లేషణ చర్చనీయాంశంగా మారింది. వివిధ సామాజికవర్గాల వారీగా వైసీపీకి పడ్డ ఓట్లు....కూటమి పార్టీలకు లభించిన మద్దతు గురించి ఓపెన్ డిస్కషన్ పెట్టారాయన. విశాఖలో జరిగిన వైసీపీ SC విభాగం ప్రాంతీయ సమావేశంలో ఆసక్తికరమైన లెక్కలు చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ నా SC, నా ఎస్.టి., నా బీసీ., నా మైనారిటీ అని ఎంతగా చెప్పినా.... పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చేసరికి అవేమీ పెద్దగా వర్కౌట్ కాలేదన్నది అమర్నాథ్ వాదన.…
Gudivada Amarnath: యోగాంధ్రను చంద్రబాబు తన పబ్లిసిటీ కోసమే చేసినట్లు కనిపించింది తప్ప.. ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడలేదు అని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు. కనీస సౌకర్యాలు లేకుండా ప్రజలను గాలికొదిలేసారు.
కూటమి ప్రభుత్వం గడిచిన సంవత్సర కాలం నుండి సంక్షేమ పథకాలు అమలు చెయ్యకుండా.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద బురద జల్లి కాలం గడిపేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. విద్యుత్ కొనుగోలులో దాదాపు 11వేల కోట్ల స్కాం జరిగిందని, ప్రభుత్వ ఖజానాపై ఎంతో భారం పడుతుందని మండిపడ్డారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి.. అధికారంలోకి వచ్చాక అధిక రేట్లు పెంచేస్తున్నారని…
Gudivada Amarnath: విశాఖలో భూ కేటాయింపులపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షెల్ కంపెనీల సృష్టికర్త చంద్రబాబు అని ఆరోపించారు. షెల్ కంపెనీలకు ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నారు.
గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది.. వైసీపీ మేయర్‌పై అవిశ్వాస పరీక్షలో ఓటమిపాలయ్యారు.. అయితే, మేయర్ మీద అవిశ్వాసం గెలిచారు.. కానీ, విశాఖ ప్రజల మనసుల్లో విశ్వాసం కోల్పోయారు అంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్... విశాఖ మేయర్ ఎన్నికల్లో పరిణామాలపై ఆయన స్పందిస్తూ.. బలం లేకుండా అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారని.. ధర్మం, న్యాయం గురించి మాట్లాడే హక్కు కూటమి నాయకులకు లేదని దుయ్యబట్టారు.. అయితే విప్ ఉల్లంఘించిన…
విజయసాయిరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గుడివాడ అమర్నాథ్.. విజయసాయిరెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించిన ఆయన.. మొన్నటి వరకు సాయిరెడ్డి చెప్పిన పూజారుల్లో ఆయన ఒకరు కదా...? అని ప్రశ్నించారు.. విజయసాయిరెడ్డి వ్యాఖ్యల తర్వాత వ్యవసాయం కాదు రాజకీయం చేస్తారనేది అర్థం అయ్యింది... జగన్మోహన్ రెడ్డి కోటరీ అంటే వైసీపీ కార్యకర్తలు మాత్రమేనని స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీలో కోటరీ ఉండదో చెప్పాలి..
Gudivada Amarnath: ఎన్నికల ముందు హలో ఏపీ.. బైబై వైసీపీ అని విస్తృత ప్రచారం చేసిన కూటమి పార్టీలు వంచన చూసిన తర్వాత హలో ఏపీ.. కూటమి పెట్టింది టోపీ అని ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.