ఉప ఎన్నికలో 25 వేల ఓట్లు వస్తే.. కిషన్ రెడ్డికి మరొకసారి పొన్నం ఛాలెంజ్!
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి సవాల్ విసిరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థికి 25 వేల ఓట్లు వచ్చాయని, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో 25 వేలకు ఒక్క ఓటు తగ్గకుండా తీసుకువస్తే.. మీరేం (కిషన్ రెడ్డి) చెబితే అందుకు తాను సిద్ధం అని చెప్పారు. 25 వేల ఓట్లు బీజేపీ అభ్యర్థికి రాకపోతే.. తాను చెప్పింది చేయడానికి కిషన్ రెడ్డి సిద్ధమా? అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పది వేల లోపే బీజేపీకి ఓట్లు వస్తాయని పొన్నం ప్రభాకర్ జోస్యం చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా యూసఫ్ గూడలో ప్రచారంలో హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం పాల్గొన్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. హోటల్‌కు రప్పించి మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్..
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం, ఓ మైనర్ బాలికకు నరకంలా మారింది. ఫ్రెండ్‌గా పరిచమైన వ్యక్తి మాయమాటలతో హోటల్‌కు రప్పించి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగింది. 15 ఏళ్ల బాలికను ముగ్గురు వ్యక్తులు బంధించి, గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఏడవ తరగతి చదువుతున్న బాలికకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నిందితుల్లో ఒకరు పరిచయమ్యాడు. ఈ వ్యక్తికి మాయమాటలు చెప్పి బాలికను మదియాన్వ్‌లోని ఐఐఎం రోడ్‌లోని ఒక హోటల్‌కు వచ్చేలా చేశాడు. అతడితో కలిసి మరో ఇద్దరు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నవంబర్ 2 రాత్రి నిందితులు బాలికను స్కార్పియో కారులో హోటల్‌కు తీసుకువచ్చి దారుణానికి పాల్పడ్డారు.
చెలరేగిన బౌలర్లు.. నాలుగో టీ20లో భారత్ భారీ విజయం!
ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా క్వీన్స్‌లాండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 48 పరుగుల తేడాతో కంగారులను చిత్తు చేసింది. భారత్ నిర్ధేశించిన 168 రన్స్ ఛేదనలో ఆసీస్ 18.2 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (30) టాప్ స్కోరర్. మాథ్యూ షార్ట్ (25) మినహా మిగతా కంగారో బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్స్ పడగొట్టగా.. అక్షర్ పటేల్, శివమ్ దూబే తలో రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో భారత్ 2-1తో సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలిదశ ఎన్నికల పోలింగ్..
బీహార్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సమయం ముగిసినా క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసేందకు అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ తొలి దశలో 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. తొలి విడతలో ఇప్పటివరకు 58 శాతం ఓటింగ్ నమోదైంది. తొలి విడతలో మొత్తం 121 స్థానాల్లో పోలింగ్ జరిగింది. నవంబర్ 11న రెండవ విడతలో 122 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరుగనున్నది. నవంబర్ 14న ఫలితాలు వెల్లడికానున్నాయి.
మాట నిలబెట్టుకున్న కోదండరెడ్డి.. వ్యవసాయ శాఖకు రాసిచ్చిన 4 కోట్ల విలువైన భూమి!
రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం.. 4 కోట్ల విలువైన తన సొంత భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేశారు. ఈరోజు ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారికంగా వ్యవసాయ శాఖకు కోదండరెడ్డి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ ప్రక్రియలో వ్యవసాయ శాఖ తరఫున రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఉషా, ఏడీఏ సుజాత, ఏవో రవినాధ్ పాల్గొన్నారు. కోదండరెడ్డి మంచి మనసుకు రాష్ట్రం మొత్తం ఫిదా అవుతోంది. కోట్ల విలువు చేసే భూమిని ప్రభుత్వానికి అప్పగించడంపై ప్రజలు, అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
చంద్రబాబు చేస్తున్నది ప్రజా వ్యతిరేక నిర్ణయం.. 12న రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు
ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ విద్య రంగంపై సీఎం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడం దరిద్రపు పని అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ మాట్లాడుతూ.. “మూడేళ్లలో మేము 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించాం. ప్రతి జిల్లాలో గవర్నమెంట్ కాలేజీలు ఏర్పరిచాం. కానీ చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు. ఇప్పుడు వాటిని ప్రైవేట్ వారికి అప్పగించాలనే ప్రయత్నం చేస్తున్నారు. సంవత్సరానికి వెయ్యి కోట్లు ఖర్చు చేసి అయినా ప్రజల ఆరోగ్య భవిష్యత్తును కాపాడాలి,” అని అన్నారు.
మరలా తుపాకీ పట్టిన వీసీ సజ్జనార్.. థ్రిల్లింగ్‌గా ఉందంటూ పోస్ట్!
ఐఏఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ పేరు చెప్పగానే.. అందరికీ ముందుగా గుర్తొచ్చేది ‘ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు’ అనే. ఎందుకంటే ఇప్పటికే ఆయన ఎన్నో ఎన్‌కౌంటర్‌లు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మళ్లీ తుపాకీ పట్టారు. గురువారం ఉదయం హైదరాబాద్ శివార్లలోని తెలంగాణ గన్ అండ్ పిస్టల్ అకాడమీ (TGPA)లో జరిగిన ఫైరింగ్ ప్రాక్టీస్ సెషన్‌లో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ సిటీ పోలీసు బృందంతో కలిసి పిస్టల్‌తో షూటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఫైరింగ్ ప్రాక్టీస్ సందర్భంగా సీపీ సజ్జనార్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ‘ఈ రోజు హైదరాబాద్ సిటీ పోలీస్ బృందంతో కలిసి TGPAలో ఫైరింగ్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాను. రేంజ్ వద్ద మళ్లీ ఉండటం ఎప్పటిలాగే అద్భుతమైన అనుభూతి. బుల్స్‌ఐని (నిశానా గుండ్రాన్ని) తాకడం ఉత్సాహకరమైన అనుభవం’ అని పేర్కొన్నారు. సజ్జనార్ తుపాకీతో ఫైరింగ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన తన సిబ్బందితో సమానంగా ప్రాక్టీస్‌లో పాల్గొనడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అధికారులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్..
ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డేటా డ్రివెన్ గవర్నెన్స్ (Data Driven Governance) అమలులో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులకు ఆయన సీరియస్ వార్నింగ్ జారీ చేశారు. ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న లోపాలపై సమీక్ష నిర్వహించిన సీఎం, పనితీరు మెరుగు పరచాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా పశుసంవర్ధక శాఖ (Animal Husbandry) పై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, “గత ఐదేళ్లలో పాల ఉత్పత్తి తగ్గిపోవడం, పశువుల సంఖ్య తగ్గడం ఎందుకు జరిగింది? ఈ పరిస్థితి ఎందుకు తలెత్తిందో వివరించండి,” అని అధికారులను ప్రశ్నించారు. బడ్జెట్ కేటాయింపులు తక్కువగా ఉన్నాయని చెప్పిన అధికారులను ఆయన మందలించారు.
మా అమ్మకి మీరు హీరో సర్.. ప్రధానితో తెలుగు మహిళా క్రికెటర్ సంభాషణ!
ఇండియన్ క్రికెట్ ప్లేయర్ అరుంధతి రెడ్డి ఈరోజు హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈరోజు రాత్రికి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవ్వనున్నారు. వన్డే ప్రపంచకప్ 2025 సాధించిన భారత జట్టులో ఉన్న అరుంధతి రెడ్డకి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సభ్యులు స్వాగతం పలకనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎయిర్‌పోర్ట్‌కు అరుంధతి కుటుంబ సభ్యులు కూడా వెళ్లనున్నారు. అరుంధతి రెడ్డి ప్రస్తుతం భారత మహిళా జట్టులో ఫాస్ట్ బౌలర్‌గా ఉన్నారు. 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో అరుంధతికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఫస్ట్ మ్యాచ్ నుంచి ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు లేకుండానే కంటిన్యు అవడంతో.. టోర్నమెంట్ అంతటా ఆమె బెంచ్‌కే పరిమితం అయ్యారు. అరుంధతి టీమిండియా తరపున 11 వన్డేలు, 38 టీ20లు ఆడారు. వన్డేల్లో 15 వికెట్లు, టీ20లలో 34 వికెట్లు పడగొట్టారు. వరల్డ్ కప్ టోర్నీకి ముందు గాయం అయినా త్వరగా కోలుకుని జట్టులోకి ఎంపికయ్యారు.
వైఎస్సార్‌సీపీ నేతలపై కక్షసాధింపే కూటమి లక్ష్యం
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నేతలపై రాజకీయ కక్షసాధింపుతో వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే తమ పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. “రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితి అంత దారుణంగా మారింది.. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కూడా లేని స్థితి. హత్యలు, దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయి. ఈ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, మా చేతుల్లో లాఠీలు ఉన్నాయా అని తేలిగ్గా సమాధానం ఇస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కూల్చివేసేలా వ్యవహరిస్తున్నారు,” అని అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.