Gudivada Amarnath: కక్ష పూరితంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే కుట్ర..! అందుకే ఇలా..
- కక్ష పూరితంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే కుట్ర..
- కూటమీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై బురదజల్లే ప్రయత్నం..
- కూటమి సర్కార్ పై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: కక్ష పూరితంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. రాష్ట్రంలో కూటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలపై బురదజల్లే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్ లో కలిశారు మాజీ మంత్రి అమర్నాథ్, విజయనగరం జడ్పీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.. ఆ తర్వాత మాజీ మంత్రి గుడివాడ అమర్నా్థ్ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేస్తున్నారని అన్నారు. ఇదే విధంగా ఎంపీ మిధున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి కక్ష పూరితంగా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. కక్ష పూరితంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి జరిగిన కుట్ర అని ఆరోపించారు. నేరస్తులను బయట విడిచిపెట్టి వారి చెప్పిన పేర్లతో సంబంధం లేని వ్యక్తులను జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు.
Read Also: Rajastan: అసలు మీరు మనుషులేనా.. అపుడే పుట్టిన శిశువు నోట్లో ఫెవికిక్..
Also Read
- Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
- Jakkampudi Raja: వైసీపీ అభ్యర్థిపై దాడి కేసు.. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
- AP LocalBody Elections : తూర్పుగోదావరిలో ఎన్నికల వేడి.. రెండో రోజు భారీగా నామినేషన్లు
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
అక్కడ అడ్డూ అన్నారు.. ఇక్కడ లిక్కర్ అన్నారు.. ఎందులోనూ అభియోగాలు నిరూపించలేకపోతున్నారని వ్యాఖ్యానించారు అమర్నాథ్.. మరోవైపు, హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటులు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలపై మండిపడ్డారు.. బాలకృష్ణ వ్యాఖ్యలపై చెలరేగిన దుమారాన్ని డైవర్ట్ చేయడానికి మరొక వైసీపీ నాయకుడు ఎవరో ఒకరిని అరెస్ట్ చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నాయని దుయ్యబట్టారు.. ఎంపీ మిథున్ రెడ్డికి.. ఉత్తరాంధ్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటామని అన్నారు. మిథున్ రెడ్డి జైల్లో ధైర్యంగా ఉన్నారని, ఇటువంటి కుట్రలు, అక్రమ కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొందామని చెప్తున్నారని అమర్నాథ్ అన్నారు. మిథున్ రెడ్డికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు సంపూర్ణంగా ఉందని తెలిపారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గుడివాడ అమర్నాథ్..
తాజావార్తలు
-
GVMC Result Day: పోలింగ్ శాతం హఠాత్తుగా పెరగడంపై వైసీపీ అనుమానం.. రేపే ఓట్ల లెక్కింపు
-
Daredevil Movie: గ్రాండ్‌గా మొదలైన అజిత్ ‘డేర్‌డెవిల్’.. క్రేజీ క్యాస్టింగ్ వైరల్!
-
RC 17: కొత్త ప్రపంచాన్ని సుకుమార్ సృష్టిస్తాడా?
-
Donald Trump: రిపబ్లికన్లు ఓడితే ‘‘వీటో’’ వాడుతా.. డెమోక్రాట్లకు ట్రంప్ వార్నింగ్.!
-
Shivathmika: నేను హీరోయిన్గా చేస్తే సినిమా చెయ్యను అన్నాడు.. శివాత్మిక రాజశేఖర్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!