సామాన్యుడికి మేలు కలిగేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కీలక వస్తువులపై పన్నుల భారాన్ని తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు భారీ ఊరట లభించింది.
పండగ పూట సామాన్యుడికి శుభవార్త! దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. సామాన్యుడి నడ్డి విరుస్తున్న 12%, 28% పన్ను శ్లాబులను పూర్తిగా రద్దు చేసి, కేవలం 5%, 18% శ్లాబులను మాత్రమే కొనసాగించాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీలో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల రాష్ట్రాలకు కలిగే ఆదాయ లోటును కేంద్రం భర్తీ చేయాలని ఆయన స్పష్టంగా చెప్పారు.
ఢిల్లీ లో జరిగిన సమావేశంలో జీఎస్టీ రేషనలైజేషన్ (GST Rationalisation) అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సమావేశానికి ఎనిమిది రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. ఇందులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రేట్ రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రాలకు భారీ రెవెన్యూ నష్టం సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో జరిగిన 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. కీలక రంగాలకు సంబంధించి జీఎస్టీ విధానంలో తేవాల్సిన మార్పు చేర్పులపై జీఎస్టీ కౌన్సిల్‌లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక సూచనలు చేశారు.
GST : పెళ్లిళ్ల సీజన్‌లో కేంద్ర ప్రభుత్వం నుండి షాక్ ఉండవచ్చు, వాస్తవానికి డిసెంబర్ 21న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఉంది. బ్రాండెడ్ దుస్తులపై జీఎస్టీ పెంచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
GST : శీతల పానీయాలు, సిగరెట్లు, పొగాకు వంటి హానికరమైన ఉత్పత్తులపై పన్ను రేటును ప్రస్తుత 28 శాతం నుండి 35 శాతానికి పెంచాలని జిఎస్‌టి రేట్లను హేతుబద్ధీకరించడానికి ఏర్పాటు చేసిన GOM సిఫార్సు చేసింది.
GST Rates: కొత్త సంవత్సరం 2025లో జీవిత, ఆరోగ్య బీమాలపై జీఎస్టీ తగ్గింపు ఉండవచ్చని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. 2024 డిసెంబర్ 21, 22 తేదీల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాజస్థాన్‌లో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం జరగనుంది. ఈ రెండు రోజుల సమావేశంలో ఒక రోజు ఆర్థిక మంత్రి 2025-26 ఆర్థిక సంవత్సరానికి ముందు బడ్జెట్‌కు సంబంధించి రాష్ట్రాల ఆర్థిక మంత్రుల నుండి సూచనలు, సిఫార్సులు తీసుకుంటారు. మరొక రోజు జీఎస్టీ…
GST on insurance: బీమా పాలసీ ప్రీమియంలపై జీఎస్టీని తొలగించాలని డిమాండ్లు వస్తున్నాయి. కాగా, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను జీఎస్టీ నుంచి మినహాయించే ఛాన్స్ ఉందని సంబంధిత వర్గాలు చెప్పుకొచ్చాయి.
జీఎస్టీ కౌన్సిల్ సమావేశం శనివారం (జూన్ 22) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగింది. సమావేశానంతరం ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని, ఇప్పుడు రాష్ట్రాలు కలిసి దాని రేటును నిర్ణయించాలని అన్నారు.