సామ్యాన్యులపై మరో బాదుడు షురూ కానుంది. ఉప్పు నుంచి పప్పు దాకా, కూరగాయల నుంచి పాల పాకెట్ దాకా పెరిగిపోతున్న వస్తువుల ధరల దరువుకు సామాన్యులు అల్లాడుతున్న జనాలకునేటి నుంచి నిత్యావసర సరుకులపై గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విధింపు అనివార్యంమైంది. ఈనేపథ్యంలో.. నోట్లోకి ముద్ద దిగాలన్నా నోట్ల ఖర్చు పెట్టాల్సి పరిస్థితి నెలకొనడంతో కొనుగోలు దారులు లబోదిబోమంటున్నారు. అయితే.. గత నెలలో జరిగిన జీఎస్టీ 47వ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. కాగా..ఈ సమావేశంలో పలు…
ఈ నెల 18 నుంచి మరికొన్ని నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరగనున్నాయి. ఇక నుంచి రోజు ఆహార పదార్థాలపై ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆహార పదార్థాలలో పాలు కూడా ఉన్నాయి. ప్యాక్ చేసిన పెరుగు, మజ్జిగ, లస్సీ, పన్నీర్ తదితరాలపై 5 శాతం జీఎస్టీ విధించనున్నారు.
ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందాలపై జీఎస్టీని భారీగా పెంచేందుకు సిద్ధం అవుతోంది జీఎస్టీ కౌన్సిల్.. ఇప్పటి వరకు వాటిపై 18 శాతం జీఎస్టీ ఉండగా.. దానిని 28 శాతానికి పెంచేందుకు రాష్ట్ర ఆర్థిక మంత్రుల ప్యానెల్ ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పరిశీలించే అవకాశం ఉంది
2017 జూలై 1 నుంచి దేశ వ్యాప్తంగా అమలవుతున్న జీఎస్టీ విధానాలను ఖరారు చేసే జీఎస్టీ కౌన్సిల్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జీఎస్టీ కౌన్సిల్ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సిన అవసరం లేదని జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. జీఎస్టీ కౌన్సిల్ కేవలం సలహా మండలి మాత్రమేనని ధర్మాసం స్పష్టం చేసింది. జీఎస్టీపై చట్టాలను మార్చడానికి పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలకు సమాన హక్కులు ఉన్నాయని అభిప్రాయపడింది. రాజ్యాంగంలోని 246ఏ…
ప్రస్తుతం జీఎస్టీని నాలుగు శ్లాబులుగా వసూలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.. 5, 12, 18, 28 శాతం శ్లాబులు అమల్లో ఉన్నాయి.. రాష్ట్రాల ఆదాయాన్ని పెంపొందించేందుకు, జీఎస్టీ కౌన్సిల్ తన తదుపరి సమావేశంలో భారీ వినియోగంతో కూడిన కొన్ని వస్తువులను 5 శాతం శ్లాబ్ నుంచి 3 శాతం పెంచి 8 శాతం శ్లాబ్‌ను తెచ్చే అవకాశం ఉందని గతంలో కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. బంగారం మరియు ఆభరణాలపై 3 శాతం పన్ను రేటు ఉంటుంది.. ఇది…
కేంద్రం ఆదాయం కోసం దేన్నీ వదలడం లేదు. తాజాగా కేంద్రం టెక్స్‌టైల్స్‌పై జీఎస్‌టీ రేటు పెంచాలని భావించింది. అయితే వస్త్ర వ్యాపారుల నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగా ఆ నిర్ణయాన్ని పునరాలోచిస్తున్నట్టు ప్రకటించింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తీపికబురు అందించారు. టెక్స్‌టైల్స్‌పై జీఎస్‌టీ రేటు పెంపు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీని వల్ల వ్యాపారులకు ప్రయోజనం చేకూరనుంది. అదేసమయంలో కొనుగోలు దారులకు కూడా ఊరట కలుగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలోని…
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో వేదికగా జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు దేశ ప్రజలు.. ముఖ్యంగా వరుసగా పెరుగుతూ పోతున్న పెట్రో ధరలకు కళ్లెం పడుతుందని అంతా భావించారు.. పెట్రోలియం ఉత్పత్తి చార్జీలను జీఎస్టీ పరిధిలోకి తెస్తే.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గిపోతాయని.. దీంతో.. పెట్రో ధరలతో పాటు.. పరోక్షంగా ఇతర వస్తువలపై కూడా ప్రభావం చూపుతుందనుకున్నారు.. కానీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో…
భారత్ దృష్టి మొత్తం ఇప్పుడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశంపైనే ఉంది… లక్నో వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ 45వ సమావేశం ప్రారంభం అయ్యింది.. ఈ సమావేశంలో తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు సహా.. వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్థికమంత్రులు పాల్గొంటున్నారు.. అయితే, ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. 11 రకాల కోవిడ్ ఔషదాలపై పన్ను రాయితీలను పొడిగించే అవకాశం ఉంది.. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే..…
పెరుగుతూ పోతున్న పెట్రో ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో.. వాటి ప్రభావం ఇతర వస్తువులపై కూడా పడుతూ పోతోంది.. అయితే, పెట్రో ధరలపై కేంద్ర ప్రభుత్వం ఓ బిగ్ స్టెప్ తీసుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. రోజురోజుకీ పెరుగుతూ పోతున్న పెట్రో ధరల నియంత్రణ దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. పెట్రోలియం ఉత్పత్తులపై ట్యాక్స్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే విషయాన్ని ప్యానల్ ఆఫ్ మినిస్టర్స్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.. త్వరలోనే ప్రజలకు…
పెట్రో ధరలు మంట పుట్టిస్తున్నాయి.. పెట్రోల్ ఎప్పుడూ సెంచరీ కొట్టేయగా.. డీజిల్ సైతం చాలా ప్రదేశాల్లో సెంచరీని బీట్ చేసింది.. అయితే, ఇప్పట్లో పెట్రోల్‌పై వడ్డింపు ఆగేలా కనిపించడంలేదు.. ఎందుకంటే.. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.. అలాంటి ప్రతిపాదన కూడా తమ వద్ద లేదని తెలిపారు.. పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్న నిర్మలా సీతారామన్.. అంతర్జాతీయ…