Bhatti Vikramarka : ఢిల్లీలో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల రాష్ట్రాలకు కలిగే ఆదాయ లోటును కేంద్రం భర్తీ చేయాలని ఆయన స్పష్టంగా చెప్పారు. కనీసం ఐదేళ్లపాటు ఈ నష్టపరిహారం రాష్ట్రాలకు అందాలని డిమాండ్ చేశారు. అలాగే, ‘సిన్ టాక్స్’ ద్వారా వచ్చే మొత్తం ఆదాయం రాష్ట్రాలకు మళ్లించాలని కోరారు.
Nara Lokesh : “నేను ఎవ్వరిని వదిలిపెట్టను.. రెడ్ బుక్ తన పని తాను చేస్తుంది”
జీఎస్టీ తగ్గింపు కారణంగా రాష్ట్రాల ఆదాయాలు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని భట్టి ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల వైద్య, విద్య, సంక్షేమ పథకాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రాలకు స్వంతంగా ఆర్థిక వనరులు సమకూర్చుకునే పరిస్థితి లేదని గుర్తుచేసి, రాష్ట్రాలు కోల్పోతున్న రెవెన్యూను కేంద్ర ప్రభుత్వం రక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
అయితే, జీఎస్టీ పన్ను రేట్ల హేతుబద్ధీకరణ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. అదే సమయంలో రాష్ట్రాల ఆదాయ భద్రతను కాపాడే చర్యలు తప్పనిసరిగా ఉండాలని హితవు పలికారు. కేంద్ర-రాష్ట్రాలు పరస్పర సహకారంతో పటిష్ట ఆర్థిక యంత్రాంగాన్ని నిర్మించుకోవాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. సమాఖ్య స్ఫూర్తి దృష్ట్యా అన్ని రాష్ట్రాలకు అనుకూలంగా ఉండే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం కొనసాగుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని రేపటికి వాయిదా వేయకుండా ఈరోజే పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
YS Jagan: ఏపీలో యారియా కొరతపై.. మాజీ మాజీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్..