జీఎస్టీ కౌన్సిల్ సమావేశం శనివారం (జూన్ 22) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగింది. సమావేశానంతరం ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని, ఇప్పుడు రాష్ట్రాలు కలిసి దాని రేటును నిర్ణయించాలని అన్నారు. జీఎస్టీ చట్టంలో పెట్రోలు, డీజిల్‌ను చేర్చాలని మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఇప్పటికే నిబంధన పెట్టారని తెలిపారు. ఇప్పుడు చేయాల్సిందల్లా రాష్ట్రాలు ఒక్కతాటిపైకి వచ్చి చర్చించి రేటు నిర్ణయించడమే. జీఎస్టీని అమలు చేస్తున్నప్పుడు, కొంతకాలం తర్వాత పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని సీతారామన్ చెప్పారు. వాటిని జీఎస్టీలోకి తీసుకురావడానికి ఇప్పటికే నిబంధనలు రూపొందించామని ఆమె తెలిపారు. ఇప్పుడు తీసుకోవలసిన ఏకైక నిర్ణయం ఏమిటంటే, రాష్ట్రాలు జీఎస్టీ కౌన్సిల్‌లో అంగీకరించి, ఆపై వారు ఏ రేటుకు సిద్ధంగా ఉండాలో నిర్ణయించాలని తెలిపారు.
READ MORE: NTA: ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ తొలగింపు..
GST కౌన్సిల్ యొక్క 53వ సమావేశం ఏప్రిల్ 22, 2024న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగింది. మోడీ ప్రభుత్వం మూడో దఫాగా ఏర్పాటైన జీఎస్టీ కౌన్సిల్ తొలి సమావేశం ఇదే. 53వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు. రైల్వే సేవలను బలోపేతం చేసేందుకు పూనుకున్నారు. అందులో భాగంగానే ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌లతో సహా రైల్వే సేవలను వస్తు సేవలను జీఎస్టీ నుంచి మినహాయించారు. ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌లతో పాటు, క్లోక్ రూమ్ సేవలు, వెయిటింగ్ రూమ్‌లు, రిటైరింగ్ రూమ్‌లు మరియు బ్యాటరీతో నడిచే కార్ సేవలు వంటి సేవలు కూడా పరోక్ష పన్ను విధానంలో ఎటువంటి లెవీలను ఆకర్షించవువని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇంట్రా-రైల్వే సరఫరా, వస్తువుల అమ్మకం కూడా GST నుంచి మినహాయించారు.