Minister Payyavula Keshav: జీఎస్టీ కౌన్సిల్‌లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక సూచనలు
- జైసల్మీర్‌లో జరిగిన 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి పయ్యావుల కేశవ్
- ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై ప్రస్తావన
- జీఎస్టీ విధానంలో తేవాల్సిన మార్పు చేర్పులపై జీఎస్టీ కౌన్సిల్‌లో కీలక సూచనలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Payyavula Keshav: రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో జరిగిన 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. కీలక రంగాలకు సంబంధించి జీఎస్టీ విధానంలో తేవాల్సిన మార్పు చేర్పులపై జీఎస్టీ కౌన్సిల్‌లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక సూచనలు చేశారు. కీలకాంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు తీసుకుంటున్న చొరవను జీఎస్టీ కౌన్సిల్‌లో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏపీలో ప్రభుత్వం మారాక జాతీయ స్థాయిలో పాజిటివ్ టాక్ వినిపిస్తోందని పయ్యావులకు వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు చెప్పారు. పయ్యావుల కేశవ్ సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సూచనలను పరిశీలించేందుకు జీఎస్టీ కౌన్సిల్ మంత్రి వర్గ ఉప సంఘం వేసింది. తాను చేసిన సూచనలపై వెంటనే మంత్రి వర్గ ఉప సంఘం వేసినందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆర్థిక మంత్రి పయ్యావుల ధన్యవాదాలు తెలిపారు.
Read Also: Teacher Kidnap: క్లాస్‌రూమ్‌లో ఉండగానే టీచర్ కిడ్నాప్..
Also Read
5 శాతానికి మించి జీఎస్టీ శ్లాబులో ఉన్న వస్తువులపై రాష్ట్రంలో జరిగే రవాణాపై ఒక్క శాతం ఏపీ ఫ్లడ్ సెస్ విధించాలని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో సూచించారు. దీని వల్ల పేదలు, మధ్య తరగతి ప్రజలపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. ఈ సెస్ ద్వారా ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహయ, పునరావాస చర్యలు చేపడతామన్నారు. 2018లో కేరళ వరదల సమయంలో ఇదే తరహా సెస్ విధించారన్నారు. ఇన్నోవేషన్లకు ప్రోత్సాహమిచ్చేలా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు నిర్వహించే రీసెర్చ్ సర్వీసెస్‌కు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. పేదలకు రేషన్ ద్వారా ఇచ్చే పోర్టిఫైడ్ బియ్యంపై జీఎస్టీ సుంకాన్ని తగ్గించాలని సూచించారు. ఐజీఎస్టీ సెటిల్మెంట్ వ్యవస్థను మరింత పారదర్శకంగా చేపట్టాలి.. రాష్ట్రాలకూ డేటా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. చిన్న వ్యాపారస్తులు.. కాంపోజిషన్ జీఎస్టీ చెల్లింపుదారులకు అద్దెల విషయంలో విధించే రివర్స్ ఛార్జ్ మెకానిజం నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో భాగంగా జీఎస్టీ రిజిస్ట్రేషన్లను మరింత సులభతరం చేసేందుకు టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచనలు చేశారు. అలాగే బోగస్ రిజిస్ట్రేషన్లను అరికట్టాలని మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు.
తాజావార్తలు
-
Devasish Sharma: IAS పదవికి రాజీనామా.. 8 రోజుల్లోనే బీజేపీ ఎంపీ టికెట్.. దేవాశిష్ శర్మ ఎవరు?
-
Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
-
Sergio Gor: మణిపూర్‌లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
-
Rain Alert: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీకి భారీ వర్ష సూచన
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?