బ్లాక్ ఫంగస్ ఔషధతో పాటు కోవిడ్ 19 కట్టడికోసం చేపట్టే సహాయక చర్యల్లో ఉపశమన చర్యలు చేపట్టింది కేంద్రం.. ఇవాళ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారమన్ అధ్యక్షతన జరిగిన 44వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వాటిపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. టీకాలపై 5 శాతం జీఎస్టీకి కట్టుబడి ఉండటానికి కౌన్సిల్ అంగీకరించిందని తెలిపారు..టీకాలు, మందులు మరియు పరికరాలతో సహా వివిధ కోవిడ్ వస్తువులపై పన్ను మినహాయింపు మరియు రాయితీలను…
దేశంలో ప్రజలందరికీ ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా చేపట్టి ప్రాణాలు కాపాడాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు కోరారు. అవసరాల తగినంతగా దేశీయంగా కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి కావడం లేదని, దేశ అవసరాల మేరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకోని అయినా ప్రణాళికాబద్ధంగా, వేగంగా ప్రజలకు అందించాలని సూచించారు. మూడో విడత కోవిడ్ ఉధృతి వస్తుందన్న శాస్త్రవేత్తల హెచ్చరిక నేపథ్యంలో కేంద్రం వ్యాక్సినేషన్ కార్యక్రమం త్వరగా చేపట్టాలన్నారు. కోవిడ్ 19 చికిత్స కు…
తెలంగాణ రాష్ట్రం ప్రతీ ఏటా రూ.3,439. కోట్లు అంటే 2.102 శాతం ఆదాయం కోల్పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు.. 43వ జీఎస్టీ సమావేశంలో పాల్గొన్న ఆయన.. మాట్లాడుతూ.. న్యూట్రల్ ఆల్కహాల్ ను జీఎస్టీ పరిధిలోకి తేవడం సమంజసం కాదన్నారు.. జీఎస్టీ పరిధిలోకి రాకుండా రాష్ట్రాలకు వదిలినవి ఎక్సైజ్, పెట్రోల్ అండ్ డీజిల్ మాత్రమేనని.. కేంద్రానికి ఎక్కువగా ఆదాయం వస్తోంది సెస్, సర్ ఛార్జిల రూపంలోనే అన్నారు హరీష్‌రావు.. గత బడ్జెట్‌లో కేంద్ర…
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ నేతృత్వంలో 43 వ “వస్తు, సేవల పన్ను” మండలి ( జి.ఎస్.టి కౌన్సిల్) సమావేశం అయింది. సుమారు 7 నెలల తర్వాత సమావేశం జరిగింది. 2017 సంవత్సరం జులై నెల నుంచి GSTR (3B) రిటర్న్ ఫైల్ చేయడం ఆలస్యం అయితే, విధించే “లేటు ఫీజు”ను తగ్గించే అంశంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరిగింది. అలాగే, వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించుకొనేందుకు కొనుగోలు చేసే “ఆక్సిజన్ కాన్సంట్రేటర్”పై ఉన్న…