ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఆరాంఘర్ - జూ పార్క్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ 6 లైన్లతో.. 4 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు. రూ.799 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తయింది. ఈ ఫ్లైఓవర్ నగరంలోని పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ తర్వాత అత్యంత పెద్దదిగా నిలుస్తుంది.
CM Revanth Reddy : హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త.. గ్రేటర్ హైదరాబాద్‌లో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు చేపట్టిన ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో భాగంగా కొత్త ఫ్లైఓవర్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం 42 పనులలో 36 పనులు పూర్తి అయ్యాయి. ఇందులో అత్యంత ప్రాముఖ్యమైన ఫ్లైఓవర్, జూపార్కు నుంచి ఆరాంఘర్ వరకు నిర్మించబడింది. ఇది సికింద్రాబాద్, వరంగల్, భువనగిరి, మేడ్చల్, హుజురాబాద్, మల్కాజిగిరి ప్రాంతాల వాసులకు శంషాబాద్ విమానాశ్రయానికి సిగ్నల్-ఫ్రీ ట్రావెల్‌ను సౌకర్యవంతంగా అందిస్తుంది. PM Modi: 8న…
CM Revanth Reddy : రాబోయే 25 ఏండ్ల భవిష్యత్తు అవసరాలను అంచనా వేసుకొని, గ్రేటర్ హైదరాబాద్ సిటీలో మంచినీటి సరఫరాకు సరిపడే మౌలిక సదుపాయాల ప్రణాళికను తయారు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జలమండలి అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీ విస్తరణను దృష్టిలో పెట్టుకొని 2050 సంవత్సరం నాటికి పెరిగే జనాభా అవసరాలకు సరిపడేలా ఫ్యూచర్ ప్లాన్ ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఇంటింటికీ తాగునీటితో పాటు సీవరేజీ ప్లాన్ను రూపొందించాలని, అవసరమైతే ఏజెన్సీలు, కన్సల్టెన్సీలతో…
బీజేపీ కొట్లాడితే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సనాతన ధర్మం గురించి, రైతుల గురించి, మహిళల గురించి రేవంత్ రెడ్డి పోరాటం చేశారా.. ఓటుకు నోటు కేసు అయింది, దానికే ఆయన జైలుకు పోయారని విమర్శించారు.
ప్రస్తుత వేసవి సీజన్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడం వల్ల విద్యుత్ డిమాండ్ మరియు వినియోగాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రతి విద్యుత్ శాఖ ఉద్యోగి అప్రమత్తంగా ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ అధికారులను ఆదేశించారు. సంస్థ ప్రధాన కార్యాలయంలో.. చీఫ్ జనరల్ మేనేజర్లు, సూపెరింటెండింగ్ ఇంజినీర్లు, డివిజనల్ ఇంజినీర్లతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. గ్రేటర్…
Double Bedroom Houses: హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం గ్రేటర్ పరిధిలో లక్ష పడక గదుల ఇళ్ల పంపిణీ ప్రక్రియను రేపటి నుంచి అంటే సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌కు అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించడంతో జీహెచ్‌ఎంసీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.
G20: తెలంగాణ రాజధాని హైదరాబాదులో ఈ నెల 28నుంచి జూన్ 17మధ్య జీ20 సమావేశాలు విడతల వారీగా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతపై డీజీపీ అంజన్ కుమార్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.