Wrong Driving: రోడ్డు ప్రమాదాలు రోజూ పదుల సంఖ్యలో జరుగుతున్నాయి. అజాగ్రత్త, నిద్రలేమి, అవగాహన లోపం, మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రమాదాల నివారణకు ఎన్ని నిబంధనలు పెట్టినా లెక్క చేయడం లేదు. వాపోతున్నారు. ప్రధాన రహదారులు, కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తు.. హెల్మెట్, రాంగ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్‌పై జరిమానాలు విధించినా వాహనదారులు తమ ప్రవర్తన మార్చుకోవడం లేదు. దీంతో తాజాగా ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి రాంగ్ డ్రైవ్ చేసే వారికి దిమ్మతిరిగే షాక్ ఇవ్వనున్నారు ట్రాఫిక్ పోలీసులు.
Read also: Nagarjuna Sagar: నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న భారీ వరద..
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, రాంగ్ రూట్లలో వాహనాలు నడపడం, హెల్మెట్, సీటు బెల్ట్ ధరించకుండా అతివేగంగా నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటిని తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా రాంగ్ రూట్ లో వాహనాలు నడిపే వారి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తామని తెలిపారు. రవాణాశాఖకు ప్రతిపాదనలు పంపామని, త్వరలో గ్రేటర్ అమలులోకి వస్తుందని అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏటా వందల సంఖ్యలో రాంగ్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ కేసులు నమోదవుతున్నాయి. మితిమీరిన వేగం వల్ల అమాయకులు చనిపోతున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటి వరకు మద్యం తాగి వాహనాలు నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) రద్దు చేసేవారు. ఇప్పుడు రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే అదే తరహాలో చర్యలు తీసుకోవాలని ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రాంగ్ రూట్‌లో వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Medchal Crime: హాస్టల్ ఫీజు వ్యవహారంలో గొడవ..? యువకుడు మృతి..