గ్రంధి శ్రీనివాస్.. భీమవరం మాజీ ఎమ్మెల్యే, కాపుసామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైంలో ఒకసారి, జగన్ హయాంలో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు. మేటర్ ఏదైనాసరే...సూటిగా సుత్తిలేకుండా మాట్లాడే గ్రంధి 2019లో పవన్ కళ్యాన్‌ను ఓడించి తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యారు. దాంతో వైసీపీలో గ్రంధి పొలిటికల్ కెరీర్‌కు ఇక తిరుగే ఉండదనుకున్నారు అప్పట్లో. సీన్ కట్ చేస్తే... 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీకి దూరం జరిగిన గ్రంధి శ్రీనివాస్…
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం తిల్లపూడిలో 2 కోట్ల 46 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన గొంతెరు డ్రైన్ పై బ్రిడ్జ్ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ( Grandhi Srinivas ) ప్రారంభించారు.
ఒక పార్టీ అధ్యక్షుడిపై గెలిచినపుడు గొప్పగా అనిపించింది.. ఇపుడు చూస్తుంటే చాలా మామూలు వ్యక్తిపై గెలిచినట్టు ఉంది అని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. పార్టీ పెట్టినప్పుడు చేగువేరాతో పాటు మహనీయుల ఫోటో పెట్టుకున్న పవన్ ఇపుడు అవి తీసేసి.. చంద్రబాబు ఫోటో పెట్టుకున్నారు.. చంద్రబాబులో పవన్ కళ్యాణ్ కి చేగువేరా కనిపిస్తున్నాడు అని ఆయన ఎద్దేవా చేశారు.
వారాహి యాత్రలో రెండు చెప్పులు పోయాయి అంటున్న పవన్.. ప్యాకేజీ స్టార్ అని అందరికీ తెలుసు.. చంద్రబాబు ఇంటికి వీధి గుమ్మంలో వెళ్లిన పవన్.. ప్యాకేజీ తీసుకుని దొడ్డి దారిన వెళ్లిపోయారు. అక్కడే రెండు చెప్పులు వదిలేశారు.. చంద్రబాబు ఇంటికి వెళ్లి వెతికితే ఆ రెండు చెప్పులు దొరుకుతాయి అంటూ ఎద్దేవా చేశారు గ్రంధి శ్రీనివాస్.
Gorantla Madhav: ఏపీలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా తనపై ఫేక్ వీడియోను క్రియేట్ చేసి పరువు తీశారని, దీనిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మంగళవారం నాడు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన సీఐడీ అడిషనల్ డీజీకి లేఖ రాశారు. మార్ఫింగ్ వీడియోను ఐటీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ఐటీడీపీ పనిచేస్తోందని…
పోయినచోటే వెతుక్కోవాలని జనసేనాని చూస్తున్నారా? అందుకే ఆ నియోజకవర్గంపై మళ్లీ ఫోకస్ పెడుతున్నారా? మరోసారి బరిలో దిగుతారా లేక.. అక్కడ పార్టీని బలోపేతం చేస్తారా? కొత్త ప్లాన్ వర్కవుట్ అయ్యేనా? ఏంటా వ్యూహం? లెట్స్ వాచ్..! భీవమరం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన నియోజకవర్గం. ఇక్కడ నుంచి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పోటీ చేయడమే ఆ ఆసక్తికి కారణం. అవే ఎన్నికల్లో గాజువాక నుంచి కూడా పవన్ కల్యాణ్ బరిలో ఉన్నప్పటికీ.. ఎక్కువ…
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి త్వరలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మరో రెండేళ్ళపాటు అమాత్య పదవి పొందేందుకు వివిధ జిల్లాల నుంచి పోటీ తీవ్రతరం అయింది. అధికారంలో వుండే ఏ పార్టీకి అయినా ఉభయ గోదావరి జిల్లాలు ఆయువుపట్టు. అక్కడ ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీయే అధికారం చేపడుతుంది. ఈ సంప్రదాయం, సెంటిమెంట్ ఎప్పటినుంచో వస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 2019 ఎన్నికల్లో రెండుచోట్ల మాత్రమే టీడీపీ అభ్యర్ధులు…
పశ్చిమగోదావరి జిల్లాలో ప్రోటోకాల్ రగడ నడుస్తోంది. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కి షాకిచ్చారు వీరవాసరం మండలంలోని జనసేన నేతలు. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వీరవాసరం మండలం తోలేరు గ్రామంలో అంగన్ వాడీ బిల్డింగ్ , సొసైటీ గౌడౌన్ ప్రారంభోత్సవం చేయాల్సి వుంది. ఈ ప్రారంభోత్సవానికి ప్రోటోకాల్ పాటించలేదు. జనసేనకు చెందిన సర్పంచ్, జెడ్పీటీసీకి ఆహ్వానం పంపలేదు. దీంతో వైసీపీ భీమవరం ఎమ్మెల్యే రాకముందే అంగన్ వాడీ, సొసైటీ గౌడౌన్ లను ప్రారంభించారు జనసేన ZPTC…