Gorantla Madhav: ఏపీలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా తనపై ఫేక్ వీడియోను క్రియేట్ చేసి పరువు తీశారని, దీనిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మంగళవారం నాడు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన సీఐడీ అడిషనల్ డీజీకి లేఖ రాశారు. మార్ఫింగ్ వీడియోను ఐటీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ఐటీడీపీ పనిచేస్తోందని లేఖలో తెలిపారు. ఎంపీ గోరంట్ల మాధవ్ ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు ఐటీడీపీపై కేసు నమోదు చేశారు. దీంతో ఈ వివాదం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసు విషయంలో సీఐడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న దానిపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
Read Also: PeddiReddy: ఏపీలోని థర్మల్ ప్లాంట్లకు బొగ్గు కొరత రానివ్వకూడదు
మరోవైపు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా ఏపీ సీఐడీ అడిషనల్ డీజీకి లేఖ రాశారు. తెలంగాణ ఫిషరీస్ డిపార్టుమెంట్ టెండర్లలో స్కాం ఆరోపణలపై లేఖ రాశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని బ్యాంక్ ఆఫ్ బరోడా నకిలీ గ్యారెంటీ పత్రాల జారీ అంశంలో పాత్రధారులు, సూత్రధారులు ఎవరో విచారించాలని కోరారు. ఈ అంశంలో లోతైన పరిశోధన చేసి బాధ్యులను శిక్షించాలని ఏపీ సీఐడీకి గ్రంధి శ్రీనివాస్ లేఖలో పేర్కొన్నారు.