కార్మికులకు, అసంఘటిత రంగ కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పండగలకు ముందు కానుక ఇచ్చింది. ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాన్ని పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ద్రవ్యోల్బణం కారణంగా పెరుగుతున్న జీవన వ్యయం దృష్ట్యా ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. పెరిగిన వేతనాలు 2024 అక్టోబర్ 1 నుండి వర్తిస్తాయి.
భారత్‌లో త్వరలో పండుగల సీజన్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఈ-కామర్స్ కంపెనీలు తమ సన్నాహాలు ప్రారంభించాయి. ఇందులో తమ సేల్‌ను ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి పేర్లు కూడా ఉన్నాయి.
కాకినాడ జిల్లా నాగులపల్లి నుంచి రమణక్కపేటకు ట్రాక్టర్లో వెళ్ళి ఏలేరు ముంపు ప్రాంతాలను వైసీపీ అధినేత జగన్ పరిశీలించారు. ఏలేరు వరద ముంపు ప్రాంతాలు పరిశీలన అనంతరం మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏలేరు వరదకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని జగన్ ఆరోపించారు. చంద్రబాబుకు మానవతా విలువలు తెలిసి ఉంటే ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించే వారని అన్నారు.
Jagga Reddy: విమర్శలకు సమయం కాదు..ప్రభుత్వం..ప్రతిపక్షం కలిసి ప్రజల్ని ఆదుకుందామని పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మంత్రులంతా వరద బాధితుల సేవలోనే ఉన్నారని తెలిపారు.
ప్రభుత్వ ఉత్తర్వులు, రిమైండర్‌లు ఉన్నప్పటికీ మానవ్ సంపద పోర్టల్‌లో తమ ఆస్తుల వివరాలను ఇవ్వని యూపీలోని 2 లక్షల 44 వేల 565 లక్షల మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు. వీరికి ఆగస్టు నెల జీతం నిలిచిపోయింది.
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విజయవాడలో ప్రాంతాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించింది ప్రభుత్వం.. వారిని క్షేత్రస్థాయిలో బాధితులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది.. బాధితులకు అందించే పునరావాస కార్యక్రమాలను వీరు పర్యవేక్షించనున్నారు.
ఇప్పటి వరకూ లక్ష మంది శిక్షణ తీసుకున్నారు.. గ్రామీణ సాధికారతే లక్ష్యంగా ఈ ట్రస్ట్ పని చేస్తోంది అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నుంచి స్వర్ణ భారత్ ట్రస్ట్ ఎలాంటి ఆర్థిక సహాయం తీసుకోవడం లేదు అని పేర్కొన్నారు. కానీ ప్రజల కోసం ప్రభుత్వంతో కలిసి స్వర్ణ భారత్ ట్రస్ట్ పని చేస్తోంది అని వెంకయ్య నాయుడు వెల్లడించారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తమ ప్రభుత్వ పతనానికి అమెరికా కారణమని ఆరోపించారు. బంగాళాఖాతంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు వీలుగా ఉన్న సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు అప్పగించనందుకే తనను అధికారం నుంచి తప్పించారని హసీనా ఆరోపించారు.
2024-25 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం రూ.48.21 లక్షల కోట్ల బడ్జెట్ను మంగళవారం లోక్సభ ఆమోదించింది. దిగువ సభ కూడా మూజువాణి ఓటు ద్వారా కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ బడ్జెట్ను ఆమోదించింది. వీటికి సంబంధించిన విభజన బిల్లును కూడా సభ ఆమోదించింది. బడ్జెట్ చర్చకు సమాధానంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. 2024-25 మధ్యకాలంలో ద్రవ్యలోటును జీడీపీలో 4.9 శాతానికి, 2025-26 నాటికి 4.5 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు.…