జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ఇండియా భారీ విజయం సాధించింది. ఈ ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 41ని దాటేసింది. ఇండియా కూటమి 56 స్థానాల్లో విజయం సాధించింది.
ప్రభుత్వం పంపుతున్న ఆహార ధాన్యాల్లో మూడో వంతు పేదలకు చేరడం లేదు. భారత ఆహార సంస్థ, రాష్ట్ర ప్రభుత్వాలు సరఫరా చేస్తున్న 28 శాతం ధాన్యాలు అనుకున్న లబ్ధిదారులకు చేరడం లేదని ఎకనామిక్ థింక్ ట్యాంక్ విడుదల చేసిన రిపోర్ట్‌లో వెల్లడైంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.69,000 కోట్లకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లుతుందని అంచనా. అలాగే.. ఈ వ్యవస్థను తక్షణమే మెరుగుపరచాలనే డిమాండ్ కూడా ఉంది.
రైతుల దుస్థితిపై బీజేపీ రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తుందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిర్ణయం మేరకు రైతులను కలుస్తున్నామన్నారు. మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మకై రైతుల పొట్ట కొట్టే పని చేస్తుందని మండిపడ్డారు. నెల రోజులుగా కుప్పలు పోసిన ధాన్యాన్ని కొనే వారు లేరని.. కలెక్టర్, అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు.
భారతదేశంలో ఆధార్ కార్డు ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అన్నింటికీ ఆధారే ఆధారం అయింది. దేనికైనా ఆధార్ కార్డున అడుగుతున్నారు. దీని బట్టి చెప్పొచ్చు. ఆధార్ కార్డుకు ఎంత విలువ ఉందో. అయితే ఆధార్ గురించి ఇప్పుడెందుకు అంటారా? అయితే ఈ సమాచారం మీకోసమే.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. అందరికి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. అందుకే డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచామని తెలిపారు. 21వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినట్లు చెప్పుకొచ్చారు. 11,062 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామన్నారు.
Civil Supplies Department: డిజిటల్ హెల్త్ కార్డుల కోసం తెలుగు దరఖాస్తుల ఫార్మేట్ ను ప్రభుత్వం విడుదల చేయలేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ క్లారిటీ ఇచ్చారు.
TGPSC Office: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎదుట గ్రూప్-1 పోస్టర్లు కలకలం సృష్టించాయి. కమిషన్ కార్యాలయం గోడలు, గేట్లపై కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడి ఫొటోలతో కూడిన పోస్టర్లు వెలిశాయి.
KTR: మానవత్వంతో ముందడుగు వేయాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
మూడున్నర ఏళ్లుగా కార్మికుల చేతుల్లో ఉన్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం ఇప్పుడు కీలక దశకు చేరింది. స్టీల్ ప్లాంట్ మనగడసాగించాలన్నా.. మూతపడాలన్న వచ్చే ఆరు నెలలు అత్యంత కీలకమైన సమయంగా ప్రజాసంఘాలు భావిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం యువత కోసం కొత్త పథకాన్ని ప్రారంభించబోతోంది. ఇది యువతకు ఉద్యోగాలు పొందడంలో సహాయపడుతుంది. అలాగే వారికి ప్రతినెలా రూ.5000 వరకు ఇంటర్న్‌షిప్ అందజేస్తారు.